For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 షోకు ముఖం చాటేసిన మంగ్లీ.. కారణం అదే.. బిగ్‌బాస్ ప్రారంభమయ్యే డేట్ ఇదే..!

  |

  తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రసారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లను ఎంపిక చేసిన నిర్వాహకులు మరికొందరిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే రానున్న సీజన్‌లో కంటెంస్టెంట్ల పేర్లు ఆసక్తిగా మారాయి. అయితే కొందరు వివాదాస్పద సెలెబ్రీటీలు కూడా ఈసారి హంగామా సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్‌బాస్ తెలుగు 5కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  దేశంలోనే రికార్డు టీఆర్పీని సాధిస్తూ..

  దేశంలోనే రికార్డు టీఆర్పీని సాధిస్తూ..

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకొన్నది. తొలి సీజన్‌లో విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్‌లో అభిజిత్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో తెలుగు బుల్లితెరపైన అత్యధికంగా రేటింగ్‌ సొంతం చేసుకోవడం కాకుండా.. దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ షోలో టాప్ టీఆర్సీ సాధించి రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఐదో సీజన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు తెలిసింది.

   కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం

  కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కరోనా కారణంగా మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సిన షో సెప్టెంబర్‌కు వాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సెట్ డిజైన్, నిర్మాణం గురించి చర్యలు తీసుకొంటున్నారు.

   సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం

  సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం

  బిగ్‌బాస్ తెలుగు 5 షోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. అంతా సవ్యంగా సాగితే సెప్టెంబర్ 5వ తేదీన సీజన్ 5ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాదాపు ఈ షోను 110 రోజలు పాటు అంటే సెప్టెంబర్ 26వ తేదీన ఫైనల్ నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఒకవేళ థర్డ్ వేవ్ బలంగా ప్రభావం చూపితే ఈ షో ప్రారంభానికి మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

   ఎంపికైన సెలబ్రిటీలు వీరే..

  ఎంపికైన సెలబ్రిటీలు వీరే..

  బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక చురుకుగా సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే యాంకర్ రవి, లోబో, టీవీ9 ప్రత్యూషను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇంకా కొందరితో సంప్రదింపులు జరుగుతున్నాయి. కొందరి డేట్స్, రెమ్యునరేషన్ల విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అందుకే పూర్తిస్థాయి లిస్ట్‌ను ఖరారు చేయలేదనే విషయం బయటకు వచ్చింది.

  మనసు మార్చుకొన్న మంగ్లీ

  మనసు మార్చుకొన్న మంగ్లీ

  బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో సింగర్ మంగ్లీ పేరు ప్రధానంగా వినిపించింది. మంగ్లీతోపాటు ఇటీవల కాలంలో కాంట్రవర్సిలో ఉన్న సెలబ్రిటీలతో సంప్రదించినట్టు సమాచారం. అయితే సింగర్ మంగ్లీ ఓ దశలో ఈ షోలోకి వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ సింగర్ మంగ్లీ ఈ షోలో పాల్గొనడం లేదనే విషయం ఆమె సన్నిహితులు వెల్లడించారు. ఇటీవల బోనాల పాటపై చేసుకొన్న వివాదంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు తెలుస్తున్నది.

  FCUK Movie Song 4 Manasu Katha
  బోనాల పాట వివాదం కారణంగానే అంటూ

  బోనాల పాట వివాదం కారణంగానే అంటూ

  బోనాల పాటపై ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో రాద్దాంతంతో సింగర్ మంగ్లీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆమె ఇక నుంచి మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఇప్పట్లో బిగ్‌బాస్ లాంటి షోలకు వెళ్లకూడదనే గట్టిగా నిర్ణయించుకొన్నట్టు మంగ్లీ స్నేహితులు పేర్కొన్నారు. అయితే చివరి జాబితా ఫైనల్ చేసే వరకు మంగ్లీని షోలోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

  English summary
  Most popular show on Telugu Television, Bigg Boss Telugu 5 season is goint starts in September. As per report This show will air on September 5 if everything goes fine. As reports, Anchor Ravi, Social media influencer Lobo, TV9 Anchor Prathysha are finalised. Mangli not interested to go to show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X