For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  |

  బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో మన దగ్గర ఎవరూ ఊహించని రీతిలో ఆదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అందుకే నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత మజా దొరుకుతుండడంతో దీనికి రెస్పాన్స్ అంతకంతకూ పెరుగుతోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాగే, మరికొందరు ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందులోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లలో చాలా మంది తమ పర్సనల్ విషయాలను కూడా బయట పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  19 మందితో మొదలు... ఒకరు ఔట్

  19 మందితో మొదలు... ఒకరు ఔట్

  బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లందరిలో చాలా మంది ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ఇక, మొదటి వారం షో నుంచి 7 ఆర్ట్స్ సరయు రాయ్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  టైటిల్ ఫేవరెట్లలో వాళ్లిద్దరు కూడా

  టైటిల్ ఫేవరెట్లలో వాళ్లిద్దరు కూడా

  గతంలో మాదిరిగా కాకుండా ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండవు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది.

  ఒకరు నెమ్మది... మరొకరు స్పీడుగా

  ఒకరు నెమ్మది... మరొకరు స్పీడుగా

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోని టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ మొదటి వారం నిరాశ పరిచాడనే చెప్పాలి. ఆరంభంలో జరిగిన నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయ్యాయి. అయినప్పటికీ మొదటి వారం షణ్ముఖ్ జశ్వంత్‌కు పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం తన సత్తాను చాటుకుంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. దీంతో టైటిల్ వేటలో తాను ఉన్నానని సగర్వంగా చాటి చెప్పుకుందీ తెలుగు యువ నటి.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

   సీక్రెట్లు బయట పెట్టించిన టాస్కు

  సీక్రెట్లు బయట పెట్టించిన టాస్కు

  ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లతో పలు రకాల ఆటలు ఆడించాడు. మొదట జంటలుగా మార్చి క్యాట్ వాక్ చేయించారు. ఇందులో ప్రియాంక, శ్వేత విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత ఇద్దరేసి కంటెస్టెంట్లను పిలిచి ఒకరి గురించి ఒకరిని ప్రశ్నలు అడిగాడు నాగ్. దీని ద్వారా వాళ్ల వాళ్ల వ్యక్తిగత విషయాలను బయట పెట్టే ప్రయత్నాలు చేశాడు. అందుకు అనుగుణంగానే పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలను కూడా అడిగాడు. దీంతో కొన్ని సీక్రెట్స్ రివీల్ అయిపోయాయి.

  వాళ్లిద్దరికీ ప్రశ్నలు.. లవ్ ట్రాక్స్ లీక్

  వాళ్లిద్దరికీ ప్రశ్నలు.. లవ్ ట్రాక్స్ లీక్

  కంటెస్టెంట్లు ఇద్దరి గురించి తెలుసుకునేందుకు పెట్టిన టాస్కులో మొదట జెస్సీ, సిరి జంటగా వచ్చారు. ఆ సమయంలో జెస్సీ ‘నువ్వు ఎందుకు ఇంత త్వరగా ఎంగేజ్ అయిపోయావ్' అంటూ ప్రశ్నించాడు. అప్పుడామె ‘నువ్వు వస్తావని తెలియక' అంటూ బదులిచ్చింది. ఆ తర్వాత విశ్వ, షణ్ముఖ్ కలిసి వచ్చారు. ఆ సమయంలో నాగార్జున ‘షణ్ముఖ్ ఎక్కువగా ఏ హౌస్‌మేట్ గురించి మాట్లాడతాడు? అతడి చేతిపై ఏ టాటూ ఉంది' అని విశ్వను అడగ్గా.. అతడు ఏమాత్రం తడుముకోకుండా దీప్తి సునైనా గురించి చెప్పేసి తర్వాత నాలుక కరుచుకున్నాడు.

  Bigg Boss: లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు.. ఐదుగురిలో నలుగురు ఎలిమినేట్

  దీప్తి సునైనాతో షణ్ముఖ్ లవ్ ట్రాక్

  దీప్తి సునైనాతో షణ్ముఖ్ లవ్ ట్రాక్

  సోషల్ మీడియాలో పలు రకాల యాప్‌లలో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఈ విషయాన్ని దీప్తి రెండో సీజన్‌లోనే రివీల్ చేసేసింది. అయితే, ఆ తర్వాత వీళ్ల మధ్య చాలా కాలం పాటు గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం మళ్లీ కలిశారు. అప్పటి నుంచి తరచూ జంటగానే కనిపిస్తున్నారు. అలాగే, ప్రేమించుకుంటున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే వస్తోంది.

  Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
  అతడి ప్రేమలో పడ్డ సిరి హన్మంత్

  అతడి ప్రేమలో పడ్డ సిరి హన్మంత్

  యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సిరి హన్మంత్.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘ఉయ్యాలా జంపాల', ‘అగ్నిసాక్షి' సహా పలు ధారావాహికల్లో నటించింది. అలాగే, ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఈ క్రమంలోనే శ్రీహాన్ అనే నటుడితో ప్రేమలో పడింది. ఓ కార్యక్రమంలోనే వీళ్లకు ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. త్వరలోనే వీళ్లు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఇలాంటి సమయంలో సిరి హన్మంత్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. శ్రీహాన్ బయట నుంచి ఆమెకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Shanmukh Jaswanth and Siri Hanmanth Love tracks Revealed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X