For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆమె వాడుకుందని చెప్పి బాధ పడిన షణ్ముఖ్.. బలవంతం చేయడం వల్లే ఇలా ఓపెన్

  |

  తెలుగు బుల్లితెరపై ఏమాత్రం ఆశలు, అంచనాలు లేకుండానే ప్రారంభమై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో, నిజ సంఘటనలు చూపిస్తూ ఆడియెన్స్‌ను గెలుచుకుంటోందిది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ షో ఐదో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

  ముందుగా చెప్పినట్లుగానే ఇందులో ఐదింతల ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌ను చూపిస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ షణ్ముఖ్ జస్వంత్ ఓపెన్ అయిపోయాడు. తనను అమ్మాయి వాడుకుందని చెబుతూ బాధ పడిపోయాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అదుర్స్ అనిపించి.. రికార్డు కొట్టేసింది

  అదుర్స్ అనిపించి.. రికార్డు కొట్టేసింది

  దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుంది. దీంతో ఆరంభంలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ఏకంగా 19 మంది.. వాళ్లిద్దరికి భారీగానే

  ఏకంగా 19 మంది.. వాళ్లిద్దరికి భారీగానే


  ఐదో సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంపిక అయ్యారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండవు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. వీళ్లిద్దరిపై అందరి దృష్టీ పడింది.

  ఆమె స్పీడుగా.. షణ్ముఖ్ మాత్రం స్లోగా

  ఆమె స్పీడుగా.. షణ్ముఖ్ మాత్రం స్లోగా

  తాజా సీజన్‌లోని టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఆరంభంలోనే నిరాశ పరిచాడనే చెప్పాలి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయ్యాయి. అయినప్పటికీ అతడికి మాత్రం పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కలేదు. అయితే, ఈ మధ్య మాత్రం షణ్ముఖ్‌ తన ఆటను మొదలెట్టి హైలైట్ అవుతున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. దీంతో టైటిల్ వేటలో తాను ఉన్నానని చాటుకుంటూ మిగిలిన వాళ్లకు హెచ్చరికలు పంపింది.

  హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

  బయటకు వెళ్లిన వాళ్ల కామెంట్స్ అలా

  బయటకు వెళ్లిన వాళ్ల కామెంట్స్ అలా

  బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. బిగ్ బాస్ స్టేజ్‌పైనే ఉన్న సమయంలో ఈ జంటను బాగా విమర్శించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. ఆ తర్వాత ఉమాదేవి అయితే వీళ్లిద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, అలాంటప్పుడు రావడం ఎందుకని విమర్శించింది. ఇక, లహరి కూడా వీళ్లు జంటగానే ఆడుతుంటారని ఆరోపించింది.

  ఫ్రెండ్‌కు దూరంగా ఉంటోన్న షణ్ముఖ్

  ఫ్రెండ్‌కు దూరంగా ఉంటోన్న షణ్ముఖ్

  బయట ఫ్రెండ్ అయిన షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో కూడా స్నేహితులుగా ఉన్నారని, కలిసే ఆటలు ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ వీళ్లిద్దరూ చాలా రోజులుగా అలాగే వ్యవహరిస్తున్నారు. ఇక, దీని నుంచి ఏం గ్రహించాడో ఏమో కానీ.. షణ్ముఖ్ జస్వంత్ కొద్ది రోజులుగా ఆమెను దూరం పెడుతున్నాడు. మాట్లాడడ మానేయడమే కాదు.. పక్కకు వస్తే దూరంగా వెళ్లిపోతున్నాడు. దీంతో నాగార్జున దీనిపై స్పందించాడు. బయట వాళ్లను పట్టించుకోవద్దని చెప్పి సిరితో కలిసుండమన్నాడు.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  షణ్ముఖ్ మళ్లీ అలా.. సతాయించిన సిరి

  షణ్ముఖ్ మళ్లీ అలా.. సతాయించిన సిరి

  నాగార్జున చెప్పిన మాటల వల్ల సిరి హన్మంత్‌తో క్లోజ్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. గత వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో సైతం ఆమెతోనే జతకట్టాడు. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఎప్పటిలాగే ఉంటారని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ మాత్రం ఆమె పట్ల విముఖతగానే ఉంటున్నాడు. తాజా ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ మాట్లాడాలని ప్రయత్నించినా అతడు మాత్రం దూరం పెట్టాడు. అంతేకాదు.. ఆమె పిలిచినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. దీంతో సిరి ఎంతగానో ఏడ్చేసింది. ఆ సమయంలో కాజల్ ఆమెను మరింతగా రెచ్చగొట్టేసింది.

  వాడుకుంటున్నావని అనిపిస్తుందంటూ

  వాడుకుంటున్నావని అనిపిస్తుందంటూ

  ఎంత ప్రయత్నించినా షణ్ముఖ్ తనను దూరం పెట్టడంతో సిరి అతడిని నేరుగా అడిగేసింది. అప్పుడు 'నీతో ఉండాలంటే మానసికంగా నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి.. నన్ను వాడుకుంటున్నారేమో అని ఫీలింగ్ కలుగుతుంది. నాకు జెస్సీ మధ్య బాండింగ్ వేరు. వాడు నన్ను వాడుకున్నా ఆ ఫీలింగ్ ఏమీ రాదు. కానీ నీ విషయంలో అలా కాదుగా. నువ్వు నన్ను వాడుకుంటున్నావేమో అని అనిపిస్తుంది. అందుకే ఇలా ఉండాల్సి వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి ముఖం మాడిపోయింది. మరి వీళ్ల బంధం మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Shanmukh Jaswanth Open Blam Siri Hanmanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X