For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: అలా బ్లాక్‌మెయిల్ చేసి షణ్ముఖ్‌తో సిరి రొమాన్స్.. మా అమ్మకు తెలుసులే అంటూ దారుణంగా!

  |

  రియాలిటీ కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. కంటెస్టెంట్ల ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ.. ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలను చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో ఆదరణను అందించారు. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఇక, ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ రొమాన్స్ డోస్ పెంచేస్తున్నారు. దీంతో మళ్లీ ఇద్దరూ రెచ్చిపోయారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ కోసం!

  దీన్ని కూడా వాటిలాగే నడిపిస్తున్నారు

  దీన్ని కూడా వాటిలాగే నడిపిస్తున్నారు


  మిగిలిన భాషలతో పోలిస్తే బిగ్ బాస్ షో తెలుగులో మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడు ప్రసారం అయినా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే దీనికి ఆశించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో లవ్ ట్రాకులు, గొడవలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఫలితంగా మంచి రేటింగ్‌ను రాబడుతున్నారు. ఇలా దీన్ని కూడా గత సీజన్ల మాదిరిగానే నడిపిస్తున్నారు.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  ఆ ఇద్దరి రొమాన్స్.. విమర్శలు వస్తునే

  ఆ ఇద్దరి రొమాన్స్.. విమర్శలు వస్తునే

  ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ముందున్నారు. ఫాలోయింగ్ పరంగా టాప్‌లో ఉన్న వీళ్లిద్దరూ.. ఆటలోనూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఈ జంట షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో వీళ్లిద్దరూ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిత్యం రొమాన్స్ చేస్తూనే ఉంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ స్నేహితులుగా ఉన్నా.. ఇలా వ్యవహరించడంపై చాలా రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్న విషయం తెలిసిందే.

  నాగ్ చీవాట్లు.. కంటెస్టెంట్లు కూడా అలా

  నాగ్ చీవాట్లు.. కంటెస్టెంట్లు కూడా అలా

  షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బయట స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి గొడవలు పెట్టుకుని అలుగుతున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి అసలు ఏం జరుగుతుందోనన్న అనుమానాలు కలిగిస్తున్నారు. ఈ విషయంలోనే మొన్న నాగార్జున ఇద్దరినీ ఆడుకున్నాడు. అప్పుడు సిరి.. షన్నూతో కనెక్ట్ అయ్యానని చెప్పడంతో అంతా షాకయ్యారు.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చినా

  కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చినా

  గత వారం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వాళ్లు లోపలికి వచ్చిన సమయంలో అందరికీ తగు జాగ్రత్తలు చెప్పారు. ఇందులో భాగంగానే షణ్ముఖ్ జస్వంత్‌కు వాళ్ల అమ్మ గేమ్ పైన మాత్రమే ఫోకస్ చేయమని చెప్పారు. అలాగే, సిరి హన్మంత్ వాళ్ల అమ్మ హగ్గులు ఇచ్చుకోవడం తనకు నచ్చడం లేదని అన్నారు. ఇలా వాళ్లిద్దరూ వీళ్లిద్దరి రొమాన్స్ గురించి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో తల్లులు వచ్చారన్న సంతోషం లేకుండా.. హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడం కుదరదని ఇద్దరూ బాధ పడినట్లు కనిపించారు.

  సిరి మాత్రం అస్సలు తగ్గడం లేదుగా

  సిరి మాత్రం అస్సలు తగ్గడం లేదుగా


  'నువ్వు షణ్ముఖ్‌కు హగ్గులు ఇవ్వడం నాకు నచ్చడం లేదు. అతడు నిన్ను ఫ్రెండ్‌లా, అన్నలా, తండ్రిలా చూసుకుంటున్నాడు. కానీ, నాకు మాత్రం అలా చేయడం నచ్చడం లేదు' అంటూ హౌస్‌లోకి వచ్చినప్పుడు చెప్పుకొచ్చారు సిరి మదర్. అది కూడా షణ్ముఖ్ జస్వంత్ ముందే ఆమె అలా మాట్లాడారు. దీంతో అతడు బాగా హర్ట్ అయ్యాడు. అప్పటి నుంచి సిరికి దూరంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. తరచూ హగ్గులు ఇవ్వమంటోంది. ఈ క్రమంలోనే అతడి మీదకు ఎక్కేసి ముద్దులు కూడా పెడుతూనే ఉంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  సిరికి షణ్ముఖ్ సేవలు... అన్నీ తానై

  సిరికి షణ్ముఖ్ సేవలు... అన్నీ తానై

  ఐస్ టబ్ ఛాలెంజ్‌లో సిరి హన్మంత్ కాళ్లకు గాయాలు అయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె సరిగా నడవలేకపోయింది. గురువారం ఎపిసోడ్‌లో ఆమె సమస్య బాగా ఎక్కువైనట్లు కనిపించింది. దీంతో గేమ్‌లు కూడా ఆడలేని స్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జస్వంత్ తన స్నేహితురాలికి సేవలు చేశాడు. ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా ఎత్తుకుని తీసుకెళ్లాడు. మొత్తంగా ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. దీనికి సిరి కూడా సంతోషించడంతో పాటు తరచూ అతడికి హగ్గులు, ముద్దులు ఇస్తూ కనిపించింది. ఆ తర్వాత సిరి బదులు ఓ టాస్క్ కూడా ఆడాడతను.

  Recommended Video

  Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
  బ్లాక్‌మెయిల్ చేసి మరీ రొమాన్స్ చేసి

  బ్లాక్‌మెయిల్ చేసి మరీ రొమాన్స్ చేసి

  తనకు ఎంతగానో సేవలు చేస్తున్నందుకు షణ్ముఖ్‌కు సిరి హగ్గుల మీద హగ్గులు ఇచ్చింది. ఒక సందర్భంలో అతడిని దగ్గరకు రమ్మని పిలిచింది. కానీ, తను రావడానికి అఇష్టత చూపించాడు. దీంతో 'నువ్వు నా దగ్గరకు రాకపోతే టాబ్లెట్లు కూడా వేసుకోను' అని బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో షణ్నూ ఆమె బెడ్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు హగ్గులిచ్చి ముద్దులు పెట్టుకుంది. అప్పుడు షణ్ముఖ్ 'ఆంటీ.. ఇది ఫ్రెండ్‌షిప్ హగ్ మాత్రమే' అని కెమెరాల వైపు చూసి అన్నాడు. దీనికి సిరి 'మా అమ్మకి తెలిసి ఉంటుంది. మొత్తం అర్థం అవుతుందిలే' అని అనడం విశేషం.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Siri Hanmanth Blackmailed Shanmukh Jaswanth for Hugs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X