For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షణ్ముఖ్‌తో తొలిసారి ఆ మాట చెప్పిన సిరి.. ఇష్టమే కాదు అలవాటు అంటూ బాత్రూంలోనే రచ్చ!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా దీనికి తెలుగు ప్రేక్షుకులు భారీ స్పందన అందించారు. దీంతో ఇప్పటి ఐదో సీజన్ వరకూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. తాజా సీజన్‌లో ఎక్కువ హైలైట్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ పేర్లు ముందుగా చెప్పుకోవాలి. దీనికి కారణం హౌస్‌లో వీళ్లిద్దరూ చేస్తున్న రచ్చే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ తొలిసారి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   చివర్లో మరింత మజాను పంచుతూ

  చివర్లో మరింత మజాను పంచుతూ

  ఐదో సీజన్ ఆరంభం నుంచే ఆదరణను అందుకుంటోంది. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ.. మళ్లీ చిన్నగా పుంజుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చివరి అంకానికి చేరడంతో షో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ నిర్వహకులు సైతం సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. దీంతో చివర్లో కూడా మరింత రంజుగా సాగుతూ ఫినాలేకు చేరువ అవుతోంది.

  Bigg Boss Elimination: ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్.. టాప్‌లో అతడే.. చివర్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్

  వాళ్లిద్దరూ జంటగా మారిపోయారు

  వాళ్లిద్దరూ జంటగా మారిపోయారు

  ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ పేర్లు చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి హన్మంత్ తరచూ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

  హగ్గులు... ముద్దులతో రెచ్చిపోతూ

  హగ్గులు... ముద్దులతో రెచ్చిపోతూ

  షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బయట స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, తరచూ ముద్దులిచ్చుకోవడం.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోతున్నారు. దీంతో వీళ్ల బంధంపై డౌట్లు వస్తున్నాయి.

  హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

  ‘రోల్ ప్లే' టాస్క్‌లో ఇద్దరూ ఇలా

  ‘రోల్ ప్లే' టాస్క్‌లో ఇద్దరూ ఇలా

  చివరి వారం కావడంతో కంటెస్టెంట్లకు 'రోల్ ప్లే' టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సీజన్‌లో హైలైట్ అయిన గొడవలకు సంబంధించిన సన్నివేశాలను రీ క్రియేట్ చేయమని చెప్పాడు. ఇక, తాజా ఎపిసోడ్‌లో సూపర్ స్టార్లుగా మారాలని సూచించాడు. ఇందులో సిరి.. జెనీలియాగా, సన్నీ.. బాలయ్యగా, షన్నూ.. సూర్యగా, మానస్.. పవన్‌లా, కాజల్.. శ్రీదేవిలా, శ్రీరామ్.. చిరులా మారారు.

  అలా చూసి తట్టుకోలేని షణ్ముఖ్

  అలా చూసి తట్టుకోలేని షణ్ముఖ్

  ఈ టాస్కులో భాగంగా ఏ స్టార్‌కు సంబంధించిన పాట వస్తే వాళ్లు పోడియంపై డ్యాన్స్ చేయాలి. డ్యూయెట్ అయితే జంటను పిలవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా ముందుగా సిరికి జెనీలియా పాట ప్లే చేశారు. దీనికి ఆమె షన్నూను పిలిచినా రాలేదు. దీంతో సన్నీ వచ్చి ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. అప్పుడు షణ్ముఖ్ అస్సలు తట్టుకోలేకపోయినట్లు కనిపించింది.

  Ashu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియో

  సిరిపై కోపం.. మీరంతా ఒక గ్రూప్

  సిరిపై కోపం.. మీరంతా ఒక గ్రూప్

  సన్నీతో డ్యాన్స్ చేసిన తర్వాత సిరి.. షణ్ముఖ్‌తో మాట్లాడింది. అప్పుడు అతడి పరిస్థితిని అర్థం చేసుకుంది. ఆ సమయంలోనే షన్నూ కూడా 'నువ్వు నాకు అలవాటయ్యావురా. దూరం ఉండాలన్నా కుదరట్లే' అన్నాడు. ఆ తర్వాత మరో టాస్క్ కోసం అంతా మాట్లాడుతుండగా షన్నూను పిలిచారు. అప్పుడతను 'మీరంతా ఒక బ్యాచ్. మీరే చూసుకోండి' అంటూ వెళ్లిపోయాడు.

  Recommended Video

  RRR Trailer : Have You Observed This In The Trailer ? || Filmibeat Telugu
  నువ్వుంటే ఇష్టం అంటూ హగ్గులు

  నువ్వుంటే ఇష్టం అంటూ హగ్గులు

  షణ్ముఖ్ కోపంగా బాత్రూంలోకి వెళ్లిపోవడంతో సిరి అతడి వెనకే వెళ్లింది. అప్పుడు అతడిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. 'నీ బాధకు అర్థం నాకు తెలుసు. బిగ్ బాస్ టాస్క్ కోసం తప్పడం లేదు' అంటూ బ్రతిమాలింది. అంతేకాదు, 'నువ్వంటే నాకు ఇష్టం రా' అని తొలిసారి చెప్పేసింది. దీంతో ఇద్దరూ కాసేపు హగ్ చేసుకున్నారు. అంతలో మానస్ రావడంతో తేరుకున్నారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Siri Hanmanth Blackmailed Shanmukh Jaswanth for Hugs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X