Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Sree Ramachandraకి షాకిచ్చిన శ్రీ రెడ్డి.. వర్మను లాగుతూ అతనికి సపోర్ట్ చేయమంటూ షాకింగ్ కామెంట్స్!
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం ఆరుగురు హౌస్ హౌస్ మేట్స్ మాత్రమే లోపల ఉన్నారు. అయితే వీరిలో శ్రీరామ్ కి షాక్ ఇస్తూ షన్నును సపోర్ట్ చేయండి అంటూ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

సపోర్ట్ చేస్తూ
బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ అంతా వారి కంటెస్టెంట్ లకు ఓట్లు వేస్తూ, తమ స్నేహితులు సన్నిహితులు చేత ఓట్లు వేయిస్తూ మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా అందులో సింగర్ శ్రీరామచంద్ర ఇటీవల ఫినాలేకి చేరుకున్నాడు. ఆయన మినహా మిగతా హౌస్లో ఉన్న సిరి, కాజల్, మానస్, షణ్ముఖ్ జస్వంత్, సన్నీ అందరూ కూడా నామినేషన్స్ లోకి వెళ్లారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ రెడ్డి గతంలో శ్రీరామచంద్రని టార్గెట్ చేస్తూ ఆయన చాట్ చేసిన కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్ లను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీరామచంద్రకు వ్యతిరేకంగా
ఇప్పుడు కూడా తాజాగా సింగర్ శ్రీరామచంద్రకు వ్యతిరేకంగా మాట్లాడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ ను సపోర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ ప్రేక్షకులను షణ్ముఖ్ కి మాత్రమే ఓటు వేయాలని శ్రీ రెడ్డి విజ్ఞప్తి చేసింది. గతంలో శ్రీరెడ్డి సింగర్ శ్రీరామచంద్రతో ఉన్న విభేదాలు - అఫైర్స్ అన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో పై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోపై చాలామందికి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. విలువలు మర్చిపోయి ఈ షోని ప్రసారం చేస్తున్నారు. ఈ విషయంలో వ్యక్తిత్వాలు దిగజార్చుకుని ప్రవర్తిస్తున్నారని ఆమె పేర్కొంది.

యాక్సెప్ట్ చేయలేకపోతున్నా
బాస్ షోని ఆపేయాలని ఎప్పటి నుండో చెబుతున్నారన్న ఆమె ఈ షో వలన పిల్లలకు ఎలాంటి ఉపయోగం లేదనీ ఈ షో ద్వారా పిల్లలు తప్పుదోవ పడుతున్నారని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. ఇక తన విషయానికి వస్తే.. బిగ్ బాస్ లో కొన్నింటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా పిల్లలు చూస్తున్నారనే కామన్ సెన్స్ లేకుండా.. అసభ్యకరమైన వాటిని కనీసం ఎడిటింగ్ లో తీసేయకుండా ప్రసారం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

షణ్ముఖ్ కి సపోర్ట్
ఇంత చెప్పుకొచ్చిన ఆమె చివరకు ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా ఉన్న శ్రీరామచంద్రకు ఎవరు ఓటు వేయకండని కోరింది. అంతే కాక తన అభిమానులు సపోర్ట్ అంతా యూట్యూబర్ షణ్ముఖ్ కి ఇవ్వాలని.. అతనే మొదటి నుండి జెన్యూన్ గా ఉన్నట్లు శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అయితే శ్రీ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత మందిని ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే శ్రీరెడ్డి చెబుతున్న చూడలేకపోతున్న దృశ్యాలన్నీ షణ్ముఖ్ జస్వంత్ వల్లే చూడాల్సి వస్తుందని మరి అలాంటిది అతనికి సపోర్ట్ చేయమని ఎలా కోరుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

ఇన్ఫులెన్స్‌కి బలయ్యాను
షణ్ముఖ్ జస్వంత్‌కి సపోర్ట్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు ఆ నిర్ణయం నా అంతట నేనే తీసుకున్నా.. ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మ ఇన్ఫులెన్స్‌కి బలయ్యాను కానీ.. ఆ గుణ పాఠంతోనే ఎప్పుడూ ఎవరి మాట వినకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరో మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి.. షణ్మఖ్‌ని గెలిపించండి' అంటూ ఆడియన్స్‌ని లో