For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss Telugu 5: హౌజ్ లో ఎక్కువ రోజులు ఉండేవాళ్ళ డ్రామా లీక్.. అసలు గేమ్ ఆడుతున్నారా?

  |

  బిగ్ బాస్ సీజన్ 5 లో మొత్తానికి కొంత మంచి గుర్తింపు ఉన్న స్టార్ట్ సెలబ్రిటీలతో మొదలవడంతో ఈసారి మంచి బజ్ క్రియేట్ అయింది. అసలు గత ఏడాది కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి మాత్రం మంచి పేరున్న సెలబ్రెటీలను తీసుకురావడంతో మంచి క్రేజ్ లబించింది. చూస్తే ఈసారి గతేడాది కంటే రేటింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు ఆలోచించిన విధానం ఎలా ఉందో కానీ ఆటలో మాత్రం ఇంకా అసలు మజా అయితే రావడం లేదు అనే కామెంట్స్ వస్తున్నాయి.

  ముఖ్యంగా కొందరు ఎన్ని రోజులు ఆటలో ఉండాలో ముందే డిసైడ్ అయ్యిందని అందుకే గేమ్ అసలు ట్రాక్ లోకి రావడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ దెబ్బతో బిగ్ బాస్ స్క్రిప్టు కంటెంట్ అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఆటలో అందరికీ ఒకే తరహా నియమాలు ఉండాలని రూల్స్ పెట్టాలి. కానీ కొందరు ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం జనాలకు మరింత అర్థం అయితే ఇక అసలు మజా ఉండదని కూడా అంటున్నారు.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   కంటెస్టెంట్స్ విషయంలో హ్యాపీ

  కంటెస్టెంట్స్ విషయంలో హ్యాపీ

  బిగ్ బాస్ సీజన్ 5 మొదలుపెట్టినప్పుడు అసలు ఎలాంటి కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెడతారు అనేది అందరి లో కొంత ఆసక్తిని కలిగించింది. ఒక విధంగా గత ఏడాది కంటే ఈ సారి కొంత మంచి సెలబ్రిటీలను తీసుకువచ్చారు అని పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, కాజల్, శ్రీరామ చంద్ర, ప్రియాంక వంటి వారిని తీసుకురావడం షోలో హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన స్వభావాలు కలిగిన మరికొందరు కూడా హౌస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు

  సరైన గేమ్ అడడం లేదు

  సరైన గేమ్ అడడం లేదు

  ఆట ఇంకా అసలు ట్రాక్ లోకి రాలేదు కాబట్టి ఎవరి శత్రువు ఎవరు మిత్రులు అనే కంటెస్టెంట్స్ లో ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. గొడవ పడిన పది నిమిషాలకి మళ్ళీ కౌగిలించుకోవడం మాట్లాడుకోవడం ఎప్పటిలానే జరుగుతోంది. కొంతమంది అసలు ఆట ప్రకారం స్టాండర్డ్ గా ఉండటం లేదని కూడా కామెంట్స్ వస్తున్నాయి. గతంలో కౌశల్ మండా రాహుల్ వంటి వారు ఈ తరహా లో గేమ్ ప్లాన్ అయితే ఆడలేదు. ప్రతి ఒక్కరూ ఎలిమినేషన్ కాకూడదు అని ఇతరులతో స్నేహంగా ఉండే అందుకే ప్రయత్నం చేస్తున్నారు గొడవ పడిన పది నిమిషాలకే మళ్ళీ వెంటనే భయపడుతున్నారు అంటేనే అర్థమవుతొంది అనే కామెంట్స్ వస్తున్నాయి.

  పవర్ హౌజ్ అవసరం లేదా?

  పవర్ హౌజ్ అవసరం లేదా?

  షోలో కంటెస్టెంట్స్ ఎవరు ఎలా ఉన్నా కూడా కొంతమంది మాత్రం అసలు ఎలిమినేషన్స్ అని భయం కూడా కనిపించడం లేదని అర్థమవుతోందని అంటున్నారు. అసలు ఆటలో ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయేలా చేస్తున్నారానే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ లో ఎక్కువగా పవర్ హౌస్ ను హైలెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పవర్ హౌస్ దగ్గర ఎంతో ఓపికతో ఉండే ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అసలు అది మాకు అవసరం లేదులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

  ఎమోషన్స్ తో గేమ్..

  ఎమోషన్స్ తో గేమ్..

  బిగ్ బాస్ హౌస్ లోకి ఒకసారి అడుగుపెట్టిన తర్వాత వారు ఎంత పెద్ద సెలబ్రిటీ లో అయినా సరే అందరితో సమానంగా గేమ్ ఆడాల్సి ఉంటుంది. అదే ఆటలో అసలు మజా. ఎవరు ఎలాంటి వారు అనేది అక్కడే బయటపడుతుంది. ఇక గొడవలు పెట్టుకున్నంత మాత్రాన కూడా హైలెట్ అవుతారనేది అవివేకం. కొందరికి ఆ విషయం బాగా తెలిసినప్పటికీ మరి కొందరు తొందరపాటులో మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలని కూడా కొందరు బాగానే ట్రై చేస్తుంటారు.

  ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు..

  ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు..

  అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది ఎక్కువ రోజులు ఉంటారు అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి అందులో యాంకర్ రవి , షణ్ముక్, లోబో పేర్లు లో టాప్ లో ఉన్నాయి అని అంటున్నారు. అలాగే సింగర్ శ్రీరామచంద్ర ఆర్జే కాజల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుమానాలకు తగ్గట్లుగానే వీరు అందరూ కూడా పవర్ హౌస్ రూమ్ దగ్గర ఎక్కువగా అయితే కనిపించలేదు. ఎక్కువగా మిగతా వాళ్లే కనిపించారు. RJ కాజల్ అప్పుడప్పుడు వచ్చింది కానీ ఆమె సరైన పద్ధతిలో గేమ్ అడడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమె బిగ్ బాస్ హౌజ్ గురించి ఎక్కువగా తెలుసు అని అన్నప్పటికి కూడా అంతగా హైలెట్ అయితే అవ్వడం లేదు.

  #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
  పక్కా స్క్రిప్ట్..?

  పక్కా స్క్రిప్ట్..?

  ప్రియాంక కూడా హౌస్ లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆమె మానస్ శ్రీ రామచంద్ర వారితో కెమిస్ట్రీని కొనసాగిస్తుండడం హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మధ్య మధ్యలో కూడా లోబో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీరు కూడా హౌస్ లో ఎక్కువ రోజులు ఉండే అనుమానాలు వస్తున్నాయని, అందుకే పవర్ హౌజ్ దగ్గర ఎక్కువగా కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా యాంకర్ రవి అయితే ఒక్కసారి కూడా పోటీపడినట్లు అనిపించింది లేదు. దీంతో ఇది పక్కా స్క్రిప్ట్ డ్రామా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి భవిష్యత్తులో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో అయినా వీళ్ళు రియాలిటీని బయటకు తీస్తారు లేదో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 top celebraty contestants not in game mood,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X