For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిరి, షణ్ముఖ్ గుట్టు విప్పిన ఉమాదేవి: పక్క పక్కనే పడుకుంటారు.. ఆ పని చేయడానికే వచ్చారా అంటూ బూతులు

  |

  ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినా.. ఊహించని రీతిలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. మన భాషలోకి ఆలస్యంగా వచ్చినా.. భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్‌లో స్టార్ మాను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫలితంగా తెలుగు బిగ్ బాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అదే సమయంలో నాలుగు సీజన్లను మంచిగా పూర్తి చేసుకుని, ఐదోది కూడా ఇటీవలే మొదలైంది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్ నుంచి తాజాగా ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె షో నుంచి బయటకు వచ్చిన వెంటనే సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  19 మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు ఔట్

  19 మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు ఔట్

  ఈ సారి బిగ్ బాస్ నిర్వహకులు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. ఇంత మంది ఉండడంతో తరచూ గొడవలు కనిపిస్తున్నాయి. దీంతో ఆరంభం నుంచే ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, మొదటి వారం బోల్డ్ బ్యూటీ సరయు ఈ షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక, తాజాగా రెండో వారంలో ఉమాదేవి షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  ఆ కారణంగానే ఉమ వెళ్లిపోయిందని

  ఆ కారణంగానే ఉమ వెళ్లిపోయిందని

  ఉమాదేవి ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆమె చాలా రోజులు ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే, రెండో వారం నామినేషన్స్ టాస్కు సమయంలో బూతులు మాట్లాడడం.. ఆ తర్వాత తరచూ గొడవలకు దిగడం వంటివి తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. ఈ కారణంగానే ఆమె ఎలిమినేట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది.

  అందరి ముఖం ముందే చెప్పేసింది

  అందరి ముఖం ముందే చెప్పేసింది

  ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్‌లో ఉమాదేవి హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆమె లోపల ఉన్న కంటెస్టెంట్లు అందరితో మాట్లాడారు. ఈ క్రమంలోనే కొందరు ఇంటి సభ్యులపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫ్రెండ్లీగా చెబుతున్నా అంటూనే ఉమాదేవి ముఖం మీదే విమర్శలు గుప్పించారు. దీంతో ఎన్నో కొత్త విషయాలు కూడా ప్రేక్షకులకు తెలిసిపోయాయి.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  బిగ్ బాస్ బజ్‌ షోలో ఉమ విశ్వరూపం

  బిగ్ బాస్ బజ్‌ షోలో ఉమ విశ్వరూపం

  బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు ‘బిగ్ బాస్ బజ్' అనే టాక్ షోలో పాల్గొనాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సారి దీన్ని గత సీజన్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండో వారంలో బయటకు వచ్చిన ఉమాదేవి ఇందులో పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో ఆమె విశ్వరూపం చూపించారు.

  కన్నింగ్ ఆనీ, రవితో గొడవ ఉండాలి

  కన్నింగ్ ఆనీ, రవితో గొడవ ఉండాలి

  తాజాగా విడుదలైన బిగ్ బాస్ బజ్ ప్రోమోలో ఉమాదేవి కొందరు కంటెస్టెంట్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు కనిపించింది. ఆనీ మాస్టర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఆమె మెంటాల్టీ చాలా కన్నింగ్, ఫాల్తు గేమ్ ఆడుతుంది' అని చెప్పారు. అలాగే, యాంకర్ రవి గురించి ‘రవితో గొడవ పెట్టుకోవాలని చాలా సార్లు అనుకున్నా. కానీ చాన్స్ ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చారామె.

  Bigg Boss: మూడో వారం నామినేషన్స్ లీక్.. ఈ సారి ఆ ఏడుగురు నామినేట్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

  ఈ షోకు ఆమె ఒక్కరే వేస్ట్ అని చెప్పి

  ఈ షోకు ఆమె ఒక్కరే వేస్ట్ అని చెప్పి

  బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్‌లో ఉమాదేవి అందరు కంటెస్టెంట్ల గురించి మాట్లాడారు. మరీ ముఖ్యంగా హోస్ట్ ఆరియానా గ్లోరీ.. సీనియర్ యాక్టర్ ప్రియ గురించి అడిగింది. అప్పుడామె ‘అసలు ఈ అమ్మాయి వేస్ట్.. బిగ్ బాస్ షోకు అస్సలు పనికి రాదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హౌస్‌లో చక్కగా మాట్లాడినా.. ఈ షోలో మాత్రం ప్రియ గురించి అలా చెప్పడం ఆశ్చర్యపరిచింది.

  అలా అయితే అక్కడే ఆడుకోవచ్చు

  అలా అయితే అక్కడే ఆడుకోవచ్చు

  బిగ్ బాస్ బజ్ ప్రోమోలో ఉమాదేవి ఎక్కువగా సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అసలు సిరి, షణ్ముఖ్ ఏంటి? ఫ్రెండ్స్‌లా ఆడడానికి వచ్చారా? అలా అయితే వాళ్ల ఇంట్లోనే ఆడుకోవచ్చు కదా. ఫ్యామిలీలను వదిలేసి *** వచ్చారా? నేను ఇలా మాట్లాడితే తప్పు. వాళ్లు మాత్రం మంచిగా' అంటూ ఏవేవో సైగలు చేస్తూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. పక్క పక్కన పడుకుని ఆ భాగాలను తాకుతూ దారుణంగా!

  Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu

  పక్క పక్కనే పడుకుంటారు అంటూ

  ఉమాదేవి కంటిన్యూ చేస్తూ ‘సిరి ఉంటే షన్నూ ఉండాలి. లేదంటే ఇద్దరూ ఉండదు. మంచాలు కూడా పక్కనే వేసుకుంటారా? దాని పక్కనే వాడు పడుకోవాలా? బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రేమ ఉంటదా? దాని పనుల్లో అది ఉంటది.. వాడి పనుల్లో వాడు ఉంటాడు. సిరి మాటలు వింటే కనుక షన్నూ కచ్చితంగా ఏదో ఒకరోజు బయటకు వచ్చేస్తాడు' అని అన్నారు.

  English summary
  Umadevi Recently Eliminated From Bigg Boss Telugu 5. In Bigg Boss Buzzz Interview.. She Did Sensational Comments on Shanmukh Jaswanth and Siri Hanmanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X