twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 Elimination: ఇంటి నుంచి వెళ్లిపోయేది ఎవరంటే.. టాప్ సెలబ్రిటిపై ఎలిమినేషన్ వేటు?

    |

    బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 5 రెండోవారం ముగించుకోనేందుకు సిద్ధంగా ఉంది. గత రెండు వారాల్లో ఇంటి సభ్యుల మధ్య ఎన్నో అనుభూతులు, అవమానాలు, గొడవలు, వ్యకిగత దూషణలు, క్షమాణల కనిపించాయి. పరిస్థితులకు అనుగుణంగా కంటెస్టెంట్లు స్పందిస్తూ.. అవసరమైతే ఇంటి సభ్యులను క్షమాపణ కోరుతూ షోను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే రెండోవారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది. రెండో వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయంపై తెలుగు ఫిల్మీబీట్ పోల్ నిర్వహించింది. ఆ పోల్‌లో వెళ్లడైన ఫలితాలు ఏమిటంటే..

    నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు

    నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు

    బిగ్‌బాస్ ఇంటిలో రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ అత్యంత గందరగోళం మధ్య ముగిసింది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత వారం 7 ఆర్ట్స్ సరయు రాయ్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

    సరయు ఎలిమినేషన్ కరెక్టేనా?

    సరయు ఎలిమినేషన్ కరెక్టేనా?

    గతవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరయు ఎలిమినేషన్‌పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్న వేయగా.. ఆమె ఎలిమినేషన్ కరెక్ట్ కాదు అని 48.15 శాతం, సరయు ఎలిమినేషన్ కరెక్ట్ అని 46.91 శాతం, చెప్పలేం అని 4.94 శాతం మంది తన సమాధానాలు తెలిపారు.

    శ్వేతావర్మ దురుసుతనం సరైనదేనా?

    శ్వేతావర్మ దురుసుతనం సరైనదేనా?

    బిగ్‌బాస్ తెలుగు 5 షోలో రెండోవారం నామినేషన్ సమయంలో హమీదాపై శ్వేతా వర్మ దురుసుగా ప్రవర్తించడం సరైనదేనా? అంటూ అడిగిన ప్రశ్నకు 73.24 శాతం మంది సరికాదు అంటూ, అలాగే 21.13 శాతం సరైనదే, 5.63 శాతం సరికాదు అంటూ సమాధానం చెప్పారు. శ్వేతా వర్మ రంగుతో హమీదాను, లోబోను ముఖంపై కొట్టడంపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

    బిగ్‌బాస్ తెలుగు 5 ఎలా ఉందంటే?

    బిగ్‌బాస్ తెలుగు 5 ఎలా ఉందంటే?


    రెండు వారాలుగా కొనసాగుతున్న బిగ్‌బాస్ ఎలా కొనసాగుతున్నది అనే ప్రశ్నకు 58.62 శాతం బాగా లేదు అని సమాధానం చెప్పగా, 29.89 శాతం మంది బాగుంది అని, 11.49 శాతం ఏమీ చెప్పలేమని జవాబు ఇచ్చారు. సంప్రదాయ ప్రేక్షకులు ఈ షో గురించి పెదవి విరిచినట్టు స్పష్టమవుతున్నది.

    బిగ్‌బాస్ కంటెస్టెంట్ల వాడే భాష ఎలా ఉందంటే?

    బిగ్‌బాస్ కంటెస్టెంట్ల వాడే భాష ఎలా ఉందంటే?

    బిగ్‌బాస్ తెలుగు 5 షోలో కంటెస్టెంట్లు మాట్లాడుకొనే భాష గురించి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీ బీట్ అడిగిన ప్రశ్న.. బిగ్ బాస్ తెలుగు 5 షోలో ఇంటి సభ్యులు మాట్లాడుకొనే భాషపై మీ అభిప్రాయం ఏమిటి అంటే.. 76.67 శాతం మంది బాగాలేదు అని, 13.33 శాతం మంది బాగుంది అని, 10 శాతం మంది చెప్పలేం అని సమాధానం చెప్పారు.

    ఎవరు ఎలిమినేట్ అవుతారనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే..

    ఎవరు ఎలిమినేట్ అవుతారనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే..

    ఇక బిగ్ బాస్ నుంచి రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. లోబో 4.28 శాతం మంది, ప్రియకు 5.88 శాతం, ఆర్జే కాజల్‌కు 7.49 శాతం మంది, ప్రియాంక సింగ్‌కు 6.42 శాతం మంది, అని మాస్టర్‌కు 6.95 మంది, నటరాజ్ మాస్టర్‌కు 16.58 మంది, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవికి 52.41 శాతం మంది ఓటు వేశారు. అత్యధిక మంది ఓటు వేసిన ఉమాదేవికి ఎలిమినేషన్ ముప్పు ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఉమాదేవి ఎలిమినేషన్ ముప్పు తప్పించుకొంటుందా లేదా వేచి చూడాల్సిందే.

    English summary
    Bigg Boss Telugu 5 Week 2 Elimination process on cards. Lobo, Priya, RJ Kajal, Priyanka Singh, Anee Master, Nataraj Master, Umadevi on the nomination for eliminations. As per Filmibeat Telugu Survey, Umadevi is facing threat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X