For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:కేజీఎఫ్ డైలాగ్ కొట్టిన రేవంత్.. ఆదిరెడ్డి సీరియస్.. ఫిజికల్ గా కెప్టెన్సీ టాస్క్

  |

  అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ముందుగా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న ఆలోచనతో భారత్ లో హిందీ భాషలో ముందుగా స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు.

  తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి 11 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 10 మంది మిగిలి ఉన్నారు. వీళ్ల మధ్య పదకొండోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

  73 రోజులు 74 ఎపిసోడ్ లు పూర్తి..

  73 రోజులు 74 ఎపిసోడ్ లు పూర్తి..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 73 రోజులు 74 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటికీ పది వారాలకు గానీ 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు బాలాదిత్య, వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి బయటకు వెళ్లిపోయారు.

  కెప్టెన్సీ టాస్క్ లో ఐదుగురు..

  కెప్టెన్సీ టాస్క్ లో ఐదుగురు..

  ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా కూల్ గా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 10 మంది ఇంటి సభ్యుల్లో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. ఫైమా తప్పా రొహిత్, ఇనయా, ఆదిరెడ్డి, కీర్తి, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, రాజ శేఖర్, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్లుగా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయా సుల్తానా పోటి పడ్డారు.

  కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్..

  కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్..

  బిగ్ బాస్ తెలుగు 11వ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ను ప్రారంభించాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన నవంబర్ 17 గురువారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. 11వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా "కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్" ఇచ్చారు ఇందులో ఐదుగురు గుండ్రంగా నిల్చోని ఉన్నారు. వారు నిల్చున్న చోట రెండు స్టాండ్స్ పెట్టారు. మధ్యలో పెద్ద బాల్ పెట్టారు. ఆ బాల్ ఎవరికి చెందిన రెండు స్టాండ్స్ ల నుంచి బయటకు వెళ్తుందో వారు అవుట్ అయినట్లు.

  రేవంత్ కేజీఎఫ్ డైలాగ్

  రేవంత్ కేజీఎఫ్ డైలాగ్

  అంటే సేమ్ ఫుట్ బాల్ మ్యాచ్ లో గోల్ కొట్టినట్లు. ఈ బాల్ ను అడ్డుకోవడానికి అందరూ ఫిజికల్ గా గట్టిగానే పోటి పడ్డారు. ఆట స్టార్టింగ్ లో ఇఫ్ యూ ఆర్ బ్యాడ్.. ఐయామ్.. యువర్ డాడ్ అని కేజీఎఫ్ డైలాగ్ కొట్టాడు రేవంత్. గేమ్ స్టార్ట్ అయ్యాక ఆ బిగ్ బాల్ ఎవరి స్టాండ్స్ నుంచి వెళ్లకుండా బాగానే ఆడారు. ఆట మధ్యలో ఆదిరెడ్డిని శ్రీహాన్ పట్టుకోగా.. రేవంత్ బంతిని స్టాండ్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశాడు. కానీ అది పక్కనుంచి వెళ్లిపోయింది.

  స్ట్రాటజీస్ అంటూ ఆదిరెడ్డి సీరియస్..

  స్ట్రాటజీస్ అంటూ ఆదిరెడ్డి సీరియస్..

  రోహిత్ స్టాండ్ నుంచి ఆదిరెడ్డి బాల్ ను బయటకు పంపడంతో రోహిత్ అవుట్ అయ్యాడు. ఆదిరెడ్డి స్టాండ్ నుంచి బాల్ బయటకు పంపించేందుకు రేవంత్, శ్రీహాన్ కలిసి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆదిరెడ్డికి దెబ్బ తగిలి అరిచాడు. తర్వాత స్ట్రాటజీస్ ఉపయోగించారా అంటూ చాలా సీరియస్ అయ్యాడు ఆదిరెడ్డి. బాల్ ను పట్టుకుని ఆదిరెడ్డి ఉంటే ఇదికూడా స్ట్రాటజీనే కదా అని శ్రీహన్ అన్నాడు. నేను ఎవరితోనూ స్ట్రాటజీలు ఎప్పుడు మాట్లాడను. నువ్ అగ్రెసివ్ గా ఆడి తోసేస్తా ఎవడు భయపడతాడు అని రేవంత్ ను ఆదిరెడ్డి అన్నాడు.

  రేవంత్ వర్సెస్ ఫైమా..

  తర్వాత సంచాలక్ గా ఉన్న రోహిత్ తో రేవంత్, శ్రీహాన్ కు గొడవైంది. మధ్యలో రేవంత్ అండ్ ఫైమాకు మాటల యుద్ధం నడిచింది. గేమ్ అనగానే ఇలా కోట్టుకోవడం కాదు అని చేతులతో చూపించింది ఫైమా. దీనికి ఆ వెటకారమే తగ్గించుకుంటే మంచిదని రేవంత్ అంటే నీ అంత లేదులే అని ఫైమా సమాధానం ఇచ్చింది. నేను వెటకారం చేస్తే ఏడుస్తావ్ అని రేవంత్ అనగానే.. అమ్మో నాకు భయం వేస్తుందని ఫైమా ఇంకాస్తా వెటకారంగా అంది.

  English summary
  Bigg Boss Telugu 6: Revanth Faima Fight In 11th Week Captain Is Your Goal Captaincy Task November 17 Episode Promo Released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X