For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: అతన్ని టాప్ 5 లో నిలబెట్టిన ఆ ఒక్క వీడియో కాల్?.. రేవంత్ కు పోటీగా

  |

  బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతుంటాయి. ఇక మొదటి వారంలోనే వెళ్లిపోతారు అనుకున్న కొందరు ఊహించిన విధంగా టాప్ 5 లో కూడా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కూడా అలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అయితే టాప్ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ కొనసాగుతున్నాడు. కానీ తాజగా ప్రసారమైన అక్టోబర్ 11 మంగళవారం నాటి 37వ రోజు 38వ ఎపిసోడ్ లో ఆ కంటెస్టెంట్ కు వచ్చిన వీడియో కాల్ అతన్ని టాప్ 5లోకి నెట్టేసినట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాళ్లోకి వెళితే..

  ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా..

  ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా..


  ఒకసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి అని కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా టాస్కులలో ఆడితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. అయితే కొందరు అదే తరహాలో గేమ్ ఆడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం అనవసరమైన వివాదాలతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నారు. ఇక గీతూ చాలా గట్టిగానే గేమ్ ఆడింది కానీ ఆ తర్వాత ఆమె నోటి దురుసు కారణంగా మెల్లగా ఓట్లు కోల్పోతుంది.

  అత్యధిక ఓట్ల అందుకున్న..

  అత్యధిక ఓట్ల అందుకున్న..

  మొదటివారం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా సింగర్ రేవంత్ ఓట్లు అయితే భారీగానే పెరుగుతున్నాయి. అతను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి కూడా అత్యధిక ఓట్ల అందుకున్న కంటెస్టెంట్ గా ఉంటున్నాడు. ఇక అతనికి పోటీగా అయితే శ్రీహాన్ కొనసాగుతూ వచ్చాడు. మధ్యలో గీతూ రాయల్ పోటీ ఇచ్చినప్పటికీ ఆమె అతిగా మాట్లాడడం వలన తన హోదాను కోల్పోయి తక్కువ స్థాయిలో అయితే ఓట్లు అందుకుంటుంది.

  రేవంత్ కు బలమైన పోటీ..

  రేవంత్ కు బలమైన పోటీ..

  ఇక ఇప్పుడు ఉన్నవారిలో సింగర్ రేవంత్ కు బలమైన పోటీ ఇచ్చే వారిలో ఎక్కువగా అయితే శ్రీహన్ అని చెబుతున్నారు. కానీ శ్రీహన్ మాత్రం కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో గొడవ పడకుండా చాలా సున్నితంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆదిరెడ్డి మాత్రం అలా కాదు ఛాన్స్ వస్తే దూసుకుపోతున్నాడు ఎవరిని కూడా లెక్క చేయకుండా గేమ్ లో తన బలాన్ని చూపిస్తున్నాడు.

  చాలా మెచ్యుర్డ్ గా మాట్లాడి..

  చాలా మెచ్యుర్డ్ గా మాట్లాడి..

  ఇంకా అతనికి మరింత హైప్ వచ్చేలా చేసింది అక్టోబర్ 11 మంగళవారం నాటి 37వ రోజు 38వ ఎపిసోడ్ లోని వీడియో కాల్. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి తన భార్య కవితతో వీడియో కాల్ మాట్లాడుకునే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో అతని భార్య కవిత, అతని కూతురు అద్వైత వీడియో కాల్ లో మాట్లాడారు. ఇందులో కవిత చాలా మెచ్యుర్డ్ గా మాట్లాడి ఆదిరెడ్డికి బూస్టప్ ఇచ్చిందనే చెప్పొచ్చు.

  ఎందుకు మిస్ అయ్యాం అనే ప్రశ్న..

  ఎందుకు మిస్ అయ్యాం అనే ప్రశ్న..

  ''ఒకప్పుడు బిగ్ బాస్ కు వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు చెబుతున్నా.. బిగ్ బాస్ కు వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నా ప్రోగ్రస్ అవ్వాలని ప్రతిసారి చెప్తావ్. అక్కడ ఉన్న ప్రతిక్షణం ప్రోగ్రస్ అవ్వడానికే ట్రై చేయు. నీ వైపు తప్పు లేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైన సరే ఆర్గ్యుమెంట్ చేయి. కామన్ మ్యాన్ రివ్యూవర్ అయ్యాడు. రివ్యూవర్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ బిగ్ బాస్ విన్నర్ అయి రావాలి. ఈ 3 నెలలు మేం నిన్ను ఎందుకు మిస్ అయ్యాం అనే ప్రశ్నకు సమాధానం నువ్ గెలిచి రావడం'' అని ఆదిరెడ్డిలో ఆత్మవిశ్వాసం నింపింది అతని భార్య కవిత.

  డ్యాన్స్ కి భయంకరమైన ఫ్యాన్స్..

  డ్యాన్స్ కి భయంకరమైన ఫ్యాన్స్..

  తన భార్య కవిత మాటలకు చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆదిరెడ్డి. తర్వాత పాప గురించి వాల్ల అమ్మానాన్నని, నాగలక్ష్మి (చెల్లి)ని బాగా చూసుకో అని చెప్పాడు. తన పాప బర్త్ డే ఉన్న సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అని చెప్పి.. బర్త్ డేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయామని చెప్పాడు. తర్వాత తన డ్యాన్స్ ఎలా ఉంది అని ఆదిరెడ్డి అడగడంతో నీ డ్యాన్స్ కి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు అని కవిత నవ్వుతూ చెప్పింది. ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆదిరెడ్డి టాప్ 5లో ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. ఈ ఒక్క వీడియో కాల్ తో శ్రీహాన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కి చేరడం ఖాయం అనుకుంటున్నారు.

  టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా..

  టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా..

  ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా ఆదిరెడ్డికి సంబంధించిన విషయాల వైరల్ గా మారుతున్నాయి. తప్పకుండా టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తారు అని చెబుతున్నారు. ముఖ్యంగా సింగర్ రేవంత్ కు అతను పోటీగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కేవలం యూట్యూబ్లో రివ్యూలు చెప్పుకొని ఇక్కడి వరకు వచ్చిన ఆది ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆదిరెడ్డి ఊహించినట్లే రేవంత్ కు చివరి వరకు పోటీ ఇస్తాడో లేదో చూడాలి.

  English summary
  Adireddy Gives Competition To Revanth After Srihan In Top Position By Video Call With His Wife Kavitha In Bigg Boss Telugu 6 Battery Recharge Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X