Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 ఆదిరెడ్డి బిగ్ బాస్ జర్నీ.. సామాన్యుడిగా మొదలై విజేతగా అంటూ!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకొ ఒక్క వారమే మిగిలి ఉంది. వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. అదే రోజు టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు, సెలబ్రిటీల మధ్య విన్నర్ ను ప్రకటించి ట్రోఫీ అందజేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా మరొక కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫినాలేలో ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న హౌజ్ మేట్స్ బిగ్ బాస్ జర్నీలను చూపిస్తున్నారు బిగ్ బాస్.

ఇంటి సభ్యుల జర్నీలు..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు మిగిలారు. తాజాగా ఇనయా సుల్తానా ఎలిమినేట్ కావడంతో హౌజ్ లో రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య, కీర్తి భట్, ఆదిరెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి సీజన్ లో టాప్ 5లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు వేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీళ్ల బిగ్ బాస్ జర్నీలను వారికి చూపిస్తున్నారు బిగ్ బాస్.

100వ ఎపిసోడ్ ప్రోమో..
సోమవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో రేవంత్ అండ్ శ్రీ సత్య బిగ్ బాస్ జర్నీలను చూపించారు. దీంతో వారు చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే వాళ్ల గురించి అద్భుతంగా చెప్పి స్ఫూర్తి నింపారు బిగ్ బాస్. తాజాగా ఆదిరెడ్డి జర్నీని చూపించారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 6 డిసెంబర్ 13 నాటి 100వ రోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బ్యూటిఫుల్ అండ్ కలర్ ఫుల్ లైటింగ్ లో ఆదిరెడ్డి తన బిగ్ బాస్ జర్నీని చూస్తూ మురిసిపోయాడు.

ఒక్క అడుగు దూరంలో..
బిగ్ బాస్ హౌజ్ గార్డెన్ ఏరియాలో కలర్ ఫుల్ లైటింగ్ లతోపాటు ఆదిరెడ్డికి సంబంధించిన ఫొటోలను అందంగా డెకరేట్ చేశారు. ఆ ఫొటోలను ఒక్కొక్కటి చూస్తున్నాడు ఆదిరెడ్డి. బ్యాక్ గ్రౌండ్ లో ఆదిరెడ్డి భార్య కవిత మాటలు వినిపించారు. "హాయ్ ఆది.. మేమందరం బాగున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. నీ కల నేరవేరడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావ్. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని మళ్లీ నిరూపించబోతున్నావ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆది" అని కవిత చెప్పారు.

కొత్త కోణంలో చూడగలగడం..
కవిత చెప్పాక ది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఆఫ్ ది మై లైఫ్ బిగ్ బాస్ అని ఆదిరెడ్డి చెప్పాడు. ఆదిరెడ్డి.. ఇంట్లోకి రాకముందే ఆట గురించి ఎన్నో లెక్కలు వేసి.. ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే మీలోని స్ట్రాటజీ మాస్టర్ చురుకయ్యారు. ప్రతి విషయాన్ని నిశితంగా కొత్త కోణంలో చూడగలగడం మిమ్మల్ని ఆటలో ఒక అడుగు ముందు ఉంచింది. మీలోని రివ్యూవర్ ని కాకుండా ఒక సామాన్యుడిని కొన్నిసార్లు బయట పెట్టారు.
సామాన్యుడిగా మొదలై..
మీలో మీకు తెలియని కోణాలను ఈ ఇల్లు ప్రేక్షకులకు పరిచయం చేసింది. మాట పడని స్వభావం. మాట ఎలా అనాలో తెలిసిన నేర్పరితనం మీకు మాత్రమే సొంతం. ఓటమిని ఒప్పుకోవడం.. గెలుపుకోసం ప్రయత్నించడాన్ని ఆపకూడదు. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం కూడా ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ కు రావాలని.. బిగ్ బాస్ లాస్ట్ సెకన్ వరకు ఉండాలనేది ఆశ. అది నెరవేరింది బిగ్ బాస్ అని ఆదిరెడ్డి అన్నాడు.