For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆమె చేయి పట్టుకుని ఆదిరెడ్డి అలా, నాగార్జునను మ్యానిపులేట్ చేస్తావంటూ కామెంట్స్

  |

  తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ షో ముందుగా అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభై సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న భావనతో భారత్ లో స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు.

  తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి మంచి వ్యక్తగా గుర్తింపు పొందిన బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 13 ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదల చేశారు.

  పెద్దగా గేమ్ ఆడలేదని..

  పెద్దగా గేమ్ ఆడలేదని..

  తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో పదో వారం బాలాదిత్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లేముందు అందరిలో బలహీనతలు చెప్పి వాటిని మార్చుకోమ్మని సలహా కూడా ఇచ్చాడు. ఎలాంటి నెగెటివిటీ లేకుండా వెళ్తున్నావని నాగార్జున పొగిడారు. అయితే బాలాదిత్య జెన్యూన్ గా ఉన్నాడే తప్పా పెద్దగా గేమ్ ఆడలేదని ప్రేక్షకులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయినట్లు టాక్.

  ఆడిపాడించడమే కాకుండా..

  ఆడిపాడించడమే కాకుండా..

  ఈసారి డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇవ్వనున్నాడు హోస్ట్ నాగార్జున. బాలాదిత్యను డైరెక్ట్ ఎలిమినేట్ చేసి ఇంటి నుంచి పంపించి వేశారు. అయితే ఎప్పటిలానే శని, ఆదివారాల్లో వచ్చిన హోస్ట్ నాగార్జున ఆడి పాడించడమే కాకుండా ఇంటి సభ్యుల ఆట, మాట తీరుపై వార్నింగ్, సలహాలు ఇస్తారన్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా ప్రసారం కాబోయే నవంబర్ 13 ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా.

  నువ్ బొమ్మ గీస్తే నేను చెబుతాను..

  నువ్ బొమ్మ గీస్తే నేను చెబుతాను..

  ఈ ప్రోమోలో మిగిలిన 11 మంది ఇంటి సభ్యులచేత ఆడిపాడించాడు హోస్ట్ నాగార్జున. స్టేజి పైకి మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు నాగార్జున. ఇంటి సభ్యులచేత పిక్షనరీ గేమ్ ఆడించాడు నాగార్జున. పిక్షనరీ గేమ్ అని నాగార్జున అంటే మేము బొమ్మ గీస్తే మీరు చెప్పాలా సార్ అని ఫైమా అంటే.. లేదమ్మా.. నువ్ బొమ్మ గీస్తే నేను చెబుతాను అని నవ్వించాడు హోస్ట్ నాగార్జున. తర్వాత శ్రీసత్య జై లవ కుశ సినిమాను చెప్పేందుకు మూడు బొమ్మలు గీసింది.

  ఆడపిల్లలు వస్తే బాగా డ్యాన్స్ చేస్తావా..

  ఆడపిల్లలు వస్తే బాగా డ్యాన్స్ చేస్తావా..

  అందులో ఒక బొమ్మకు కొమ్ములు పెట్టింది. అది చూసిన నాగార్జున.. శ్రీ సత్య తన బొమ్మే తాను గీసుకుంది అని కామెడీ చేశాడు. అటువైపు శ్రీహాన్ ఆ బొమ్మ అబ్బాయా.. అమ్మాయా అని అయోమయంలో ఉన్నాడు. ఆ మూడు బొమ్మలు శ్రీహాన్, రేవంత్, శ్రీ సత్య అని నాగార్జున చెప్పాడు. తర్వాత హౌజ్ లోని అమ్మాయిలందరితో కలిసి డ్యాన్స్ చేశాడు ఆదిరెడ్డి. శ్రీసత్య చేయి పట్టుకుని ఆదిరెడ్డి స్టెప్పు వేస్తాడు. దీంతో నాగార్జున.. ఆదిరెడ్డి ఆడపిల్లలు వస్తే బాగా డ్యాన్స్ చేస్తావా లేకపోతే చేయావా అని నవ్వించాడు.

  శ్రీసత్యను చూస్తూ కిందపడి..

  శ్రీసత్యను చూస్తూ కిందపడి..

  రేవంత్ వచ్చిన బొమ్మలు గీస్తూ యాక్ట్ చేస్తాడు. దీంతో నువ్ గీయాలమ్మా.. యాక్టింగ్ చేయకూడదు అని శ్రీ సత్య సెటైర్ వేస్తుంది. తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనుకుంటూ శ్రీసత్యను చూస్తూ కిందపడి నవ్వుతాడు రేవంత్. తర్వాత శ్రీహాన్ ను అఖండ సినిమా బొమ్మ గీసేందుకు ట్రై చేస్తాడు. అయితే వాళ్లు చెప్పలేకపోవడంతో.. బాలకృష్ణ మేనరిజాన్ని శ్రీహాన్ చూపించడంతో శ్రీసత్య చెబుతుంది.

  జై బాలయ్య పాటకు ఆదిరెడ్డి స్టెప్పులు..

  చేయి చూపిస్తే ఎవరైనా చెబుతారని నాగార్జున అంటే.. శ్రీసత్య.. మేము చెప్పాం సార్ అంటూ.. ముద్దుగా బుజ్జగించేప్రయత్నం చేస్తుంది. దీంతో రేవంత్ వచ్చి.. నువ్ నాగార్జున గారిని కూడా మ్యానిపులేట్ చేస్తావ్ అటు వెళ్లు అంటూ పంపిస్తాడు. తర్వాత జై బాలయ్య పాటకు ఆదిరెడ్డి వేసే స్టెప్పులు చూసి అందరూ నవ్వుతారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 పదో వారం మరో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా గ్లామర్ క్వీన్ వాసంతి బయటకు వెళ్లనుంది.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Gives Pictionary Task To House Members And November 13 Episode Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X