For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:ఇనయా కోసం తెరచిన సీక్రెట్ రూమ్, లవ్ సర్ ప్రైజ్? మగాళ్లందరూ సచ్చిపోవాలన్న గీతూ

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ అయితే బీభత్సంగా జరిగింది. బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ గేమ్ జోరుగా సాగింది. కానీ రెడ్ టీమ్ మాత్రం ఎదుటి టీమ్ వాళ్ల బలహీనతలపై కొట్టడం, రెచ్చగొట్టడం, వెకిలీ చేష్టలు, లూపులు అంటూ పనికిరాని లాజిక్స్ వెతుక్కుంటూ అరాచకం సృష్టించింది. ఈ విషయాలపై శనివారం ఎపిసోడ్ లో వచ్చిన హోస్ట్ నాగార్జున క్లాస్ తీసుకున్నారు. రెండు టీమ్ ల ప్లస్ లు, మైనస్ లు చెప్పాడు. ఇక ఆదివారం అంటే ఫన్ డే. నవంబర్ 6 ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఇనయా సుల్తానాకు సీక్రెట్ రూమ్ తెరచి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు.

  నాగార్జున రివ్యూలు..

  నాగార్జున రివ్యూలు..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఈ వారం ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. గొడవలు, అరుచుకోవడాలు, లూప్ లు, స్ట్రాటజీస్, బలహీనతలు, కన్నింగ్ గేమ్ లు అంటూ ఏదోదో చేశారు. ఇక ప్రతి శని, ఆదివారాల్లో వచ్చే హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆట తీరుపై రివ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం ఇంటి సభ్యులు ఆడిన విధానంపై శనివారం వచ్చిన నాగార్జున క్లాస్ తీసుకున్నాడు.

  వలార్ మొర్గులీస్ అంటే..

  వలార్ మొర్గులీస్ అంటే..

  ఇక నవంబర్ 6 ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించన ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. మాస్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే గీతూ రాయల్ తో మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం సాంగ్ ప్లే చేశాక వలార్ మొర్గులీస్ (Valar Morghulis) అని అంటుంది. దానికి అర్థం ఏంటో తెలుసా అని గీతూని నాగార్జున ప్రశ్నిస్తాడు. దానికి ఆమె జీవోటీ (Game Of Thrones) చూశారా సార్ అంటూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ లోని డైలాగ్ అండ్ చాప్టర్ పేరు చెబుతుంది.

  అలా అర్థమైందన్నమాట..

  అలా అర్థమైందన్నమాట..

  గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ ప్రకారం వలార్ మొర్గులీస్ అంటే ఆల్ మెన్ మస్ట్ డై (అందరు మగాళ్లు చనిపోవాలి) అని అర్థం అని చెబుతాడు నాగార్జున. దీంతో ఇంట్లో సభ్యులందరూ షాక్ అవుతారు. అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ఆ పవర్ ఫుల్ డైలాగ్ గీతూ రాయల్ కు అలా అర్థమైందన్నమాట. ఇక తర్వాత స్నేక్స్ అండ్ లాడర్స్ టాస్క్ ఆడిపించారు నాగార్జున. పాము బొమ్మను పెట్టి ఎవరైతే స్నేక్ అనుకుంటారో వారిని అక్కడ నిల్చొబెట్టి దానికి కారణాలు చెప్పమన్నారు.

  మైక్ విసిరేయడం వల్లే..

  మైక్ విసిరేయడం వల్లే..

  ముందుగా ఇనయాను పాము అంది ఫైమా. ఫ్రెండ్ షిప్ పేరుతో కాటు వేసిందని, ఆ మరకలు కూడా ఇంకా పోవట్లేదని చెప్పింది పైమా. తర్వాత రోహిత్-మెరీనాతో కొద్దిసేపు నవ్వించారు నాగార్జున. ఆ తర్వాత ఆదిరెడ్డిని పాముగా చెప్పాడు రాజ శేఖర్. ఆయన మైక్ విసిరేయడం వల్లే అందరం కెప్టెన్సీ కంటెండర్లం అయ్యే అవకాశం పోగొట్టుకున్నామని చెప్పాడు. తర్వాత వచ్చిన రేవంత్.. వాసంతిని పాము అన్నాడు.

  వాసంతి కళ్లు పాము కళ్లలా ఉంటాయి..

  వాసంతి కళ్లు పాము కళ్లలా ఉంటాయి..

  వాసంతి కళ్లు పాము కళ్లలా ఉంటాయని అందుకే అలా అన్నట్లు చెప్పుకొచ్చాడు రేవంత్. దీనికి నాగార్జున.. మీ ఆవిడ కళ్లు అయితే గుర్తుపట్టలేకపోయావు కానీ, వాసంతి కళ్లు గుర్తుపట్టిన పాము కళ్లలా ఉన్నాయంటావా అన్నారు. దీంతో మీరు ఉండాల్సినవారే సార్.. అంటూ నాగార్జునకు దండం పెట్టాడు రేవంత్. అనంతరం ఇనయా సుల్తానాను నీ మనసులో ఉన్నదేంటో నాకు అర్థమైంది అని నాగార్జున అన్నారు.

  సీక్రెట్ రూమ్ లో ఏముందో..

  సీక్రెట్ రూమ్ లో ఏముందో..

  ఇనయాతో మనసు గురించి మాట్లాడిన వెంటనే బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి అని అన్నారు నాగార్జున. దీంతో చాలా సంతోషంగా సీక్రెట్ రూమ్ వైపు పరిగెత్తింది ఇనయా సుల్తానా. అయితే ఇనయాకు అలా ఎందుకు చెప్పారో.. సీక్రెట్ రూమ్ లో ఏముందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇనయా మనసులో ఉంది సూర్యనే. సీక్రెట్ రూమ్ లో సూర్య ఉన్నాడేమో అని అనుకుంటుంది ఇనయా.

  హౌజ్ మొత్తానికి సర్ ప్రైజ్..

  కానీ ఆర్జే సూర్య ఎప్పుడో బయటకు వచ్చేశాడు. సీక్రెట్ రూమ్ లో ఎవరు లేరు. ఇనయాను సీక్రెట్ రూమ్ కు వెళ్లమనడం ఆమెకు సర్ ప్రైజ్ ఉందో.. హౌజ్ మొత్తానికి సర్ ప్రైజ్ ఉందో తెలియాలి. సీక్రేట్ రూమ్ ద్వారా వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఏమైనా ఉందేమో చూడాలి. ఇప్పటివరకు అయితే వైల్డ్ కార్ట్ ఎంట్రీ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం గలాట గీతూ రాయల్ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చేశాయి.

  English summary
  Bigg Boss Telugu 6 Season Nagarjuna Says Open Secret Room To Bigg Boss For Inaya Sultana In Bigg Boss November 6 Episode Latest Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X