For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్లోకే కొత్త టాస్క్.. నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేలా కొత్త ట్విస్ట్

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 71 రోజులు 72 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటికీ పది వారాలకు గానీ 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో 10 మంది ఇంటి సభ్యులు మాత్రమే మిగిలారు. వీరికి సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ జరిగాయి. ఇంతకుముందులా కంటే ఎంతో కూల్ గా ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అయితే ఇంటి సభ్యుల ఆట తీరును తెలుసుకునేలా బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. ఈసారి నామినేషన్స్ నుంచి బయటపడేలా ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు. ఆ వివరాళ్లోకి వెళితే..

  10 వారాల్లో 11 మంది ఎలిమినేట్..

  10 వారాల్లో 11 మంది ఎలిమినేట్..

  బిగ్ బాస్ తెలుగు 6 లోకి వచ్చిన 21 మంది కంటెస్టెంట్లలో పది వారాలకు గాను మొత్తం 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు పదో వారంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య అండ్ గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి బయటకు వెళ్లిపోయారు.

  10 మందిలో 9 మంది నామినేట్..

  10 మందిలో 9 మంది నామినేట్..

  ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా కూల్ గా జరిగింది. ఎప్పుడు నామినేషన్లలో అరుచుకునే ఇంటి సభ్యులు ఈ పదకొండో వారం మాత్రం పెద్ద డిస్కషన్స్ లేకుండా సాఫీగా సాగింది. ప్రస్తుతం ఉన్న 10 మంది ఇంటి సభ్యుల్లో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. ఫైమా తప్పా రొహిత్, ఇనయా, ఆదిరెడ్డి, కీర్తి, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, రాజ శేఖర్, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

  సేవ్ అయ్యేందుకు కొత్త టాస్క్..

  సేవ్ అయ్యేందుకు కొత్త టాస్క్..

  తాజాగా నవంబర్ 15 మంగళవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఎప్పుడు లేని ఆటను ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. నామినేషన్లో ఉన్నవారు ఇమ్యునిటీ పెంచుకుని అందులో నుంచి బయటపడేందుకు కొత్త స్కీమ్ కు తెరదీశాడు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఈ వారం సేవ్ అయ్యేందుకు తమకు ఇచ్చిన ఖాలీ చెక్ లపై కొంత అమౌంట్ రాయాలి.

  ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు..

  ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు..

  ఎవరైతే వారిలో ఎక్కువ మొత్తం రాస్తారో వారు సేవ్ అవుతారు. అయితే ఆ మొత్తం విన్నింగ్ ప్రైజమ్ మనీ అయిన రూ. 50 లక్షల నుంచి వారు రాసిన అమౌంట్ ను తగ్గిస్తారు. అలాగే తాము ఎంత రాశామో కూడా, ఎంత రాయాలి అని ఏ విధమైన విషయాన్ని ఇతర ఇంటి సభ్యులతో చర్చించకూడదని బిగ్ బాస్ హెచ్చరించారు. చెక్ లపై నగదు రాశాక వాటిని గార్డెన్ లో పెట్టిన డ్రాప్ బాక్స్ లో వేయాలి.

  రూ. 5 లక్షలు రాసే అవకాశం ఉంది..

  రూ. 5 లక్షలు రాసే అవకాశం ఉంది..

  ఒక్కొక్కరుగా చెక్ పై నగదు రాసి డ్రాప్ బాక్స్ లో వేశారు. ఆదిరెడ్డి చెక్ వేస్తూ ఎవరైతే ఎక్కువ నగదు రాసి.. ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తారో వారికి ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు బిగ్ బాస్ అని అన్నాడు. తర్వాత వచ్చిన రేవంత్.. నాకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉంది. అలాగే గెలుస్తానన్మ నమ్మకంతోనే ఈ అమౌంట్ రాయడం జరిగిందని అన్నాడు. ఇక ఇనయా సుల్తానా.. రూ. 5 లక్షలు రాసే అవకాశం ఉంది అంటూ ఏదో చెప్పి చెక్ వేసి వెళ్లిపోయింది.

  డిస్ క్వాలిఫై అయిన శ్రీ సత్య..

  అయితే ఇంటి సభ్యులందరు చెక్ పై అమౌంట్ రాసి డ్రాప్ బాక్స్ లో వేసి వచ్చాక బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేశాడు. నగదు విషయానికి సంబంధించిన ధరను ఎవరితో చర్చించవద్దని బిగ్ బాస్ హెచ్చరించడం జరిగింది. కానీ శ్రీ సత్య మిమ్మల్ని డిస్ క్వాలిఫై చేస్తున్నాం అని బిగ్ బాస్ చెప్పాడు. అంటే తను రాసే అమౌంట్ ను ఎవరితోనో శ్రీ సత్య చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి గేమ్ ను బిగ్ బాస్ లో ఆడించడం ఇదే తొలిసారి. అందుకు ఈ సీజన్ అట్టర్ ప్లాప్ కావడంతోనే ఇలాంటి కొత్త గేమ్స్ ఆడిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 6 Season Bigg Boss Gives Chance To Win Immunity From Nomination November 15 Episode Promo Released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X