For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 Finale: రవితేజతో ఆదిరెడ్డి ఏలిమినేషన్.. నిన్ను చూస్తే సూసైడ్ చేసుకోరు అని ఎమోషనల్!

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే ఎంత ఆసక్తికరంగా కొనసాగింది. ఇక ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కు కొంత మంది టాప్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ కూడా ధమాకా హీరోయిన్ శ్రీలీలతో రావడం జరిగింది. అయితే టాప్ 4లో ఉన్న కంటెస్టెంట్ లలో మెల్లగా ఒకరు వెళ్ళిపోతారు అని నాగార్జున చివరిలో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. అలాగే శ్రీ లీల రవితేజను కూడా అందులో భాగం చేశారు.. ఆ వివరాల్లోకి వెళితే..

  విజిల్స్ వేస్తూ..

  విజిల్స్ వేస్తూ..

  మాస్ మహారాజ రవితేజ ధమాకా హీరోయిన్ శ్రీలీల కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే అందరూ కూడా విజిల్స్ వేస్తూ వారికి వెల్కమ్ పలికారు. ఇక కొంతసేపటి వరకు నాగార్జున రవితేజ మధ్యలో సాగిన సంభాషణ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి.. అని వాటిని పట్టించుకోవద్దు అని అది మనం ఎంతగానో నేర్చుకోవాలి అని నాగార్జున రవితేజకు చెప్పాడు. అంతే కాకుండా రవితేజ కూడా నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి వివరణ ఇచ్చాడు. ఒకప్పుడు సహాయక దర్శకుడుగా ఉన్నప్పుడు ఆయనే చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చారు అని రవితేజ గుర్తు చేసుకున్నాడు.

  రేవంత్ రొమాంటిక్ సాంగ్

  అలాగే కంటెస్టెంట్స్ అందరితోనూ రవితేజ స్టిల్ లో కూడా ఎంతో లవ్లీ గా మాట్లాడారు. ఇక రోహిత్ అయితే శ్రీ లీలను చూసుకుంటూ మంచి రొమాంటిక్ పాట కూడా పాటేయడం అంతేకాకుండా రాజా రాజా ది గ్రేట్ రా అనే పాట కూడా రవితేజ కోసం పాడి మరింత సప్రైజ్ చేశాడు. అలాగే శ్రీహన్ ను చూపిస్తూ అతను చాలా ఫ్లట్ చేస్తుంటాడు.. అని చెప్పాడు. అంతేకాకుండా అతను స్టూడెంట్ అయితే నువ్వు మాస్టర్ అని రవితేజని చూపించాడు. మీరేమైనా తక్కువ అంటూ రవితేజ కూడా నాగార్జునను స్వీట్ కౌంటర్ అయితే ఇచ్చాడు.

  రవితేజ ఇచ్చిన టాస్క్

  రవితేజ ఇచ్చిన టాస్క్


  ఇక రవితేజ శ్రీలీల ఇద్దరితోను టాప్ 4 లో ఉన్న కంటెస్టెంట్స్ లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను అప్పగించారు. ఇక బిగ్ బాస్ లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ రేవంత్ శ్రీహాన్ అలాగే కీర్తి ఆదిరెడ్డి మిగిలారు. ఇక వారిలో ఎవరో ఒకరు ఏలిమినెట్ అవుతారు అని ముందుగా కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక రోప్ ను గొడ్డలి తీసుకొని కొట్టాలి అని అయితే తాడుకు కట్టి ఉన్న ఎవరి బొమ్మ అయితే నీళ్ళల్లో పడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు.

  ఆదిరెడ్డి ఎలిమినేట్

  ఆదిరెడ్డి ఎలిమినేట్


  ఇక ముందుగా రవితేజ కీర్తి పేరుని పిలవడంతో ఆమె గొడ్డలితో తాడును కొట్టేసింది. అయితే అతని మాత్రం ఏ బొమ్మ కింద పడలేదు. ఇక తర్వాత రేవంత్ పేరు చెప్పినప్పటికీ కూడా ఏ బొమ్మ కింద పడలేదు. ఇక చివరగా శ్రీ లీల బాధ్యతను అప్పగించిన నాగార్జున ఒకేసారి రెండు పేర్లు చెప్పాలి అని అనడంతో స్నేహంతో పాటు ఆదిరెడ్డి ఇద్దరు కూడా ఒకేసారి వారి గొడ్డలితో నరకడంతో ఆదిరెడ్డి ఫోటో ఉన్న బొమ్మ పడిపోయింది. దీంతో అతను ఎలిమెంట్ అయ్యాడు అని నాగార్జున ప్రకటించారు.

   నిన్ను చూస్తే సూసైడ్ చేసుకోరు

  నిన్ను చూస్తే సూసైడ్ చేసుకోరు


  ఇక అది రెడ్డి వెళ్లిపోయేటప్పుడు బిగ్ బాస్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక చివరిలో మిగిలిన ముగ్గురితో నేను గేమ్ ఆడటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అన్నాడు. అలాగే స్టేజ్ మీదకు రాగానే అది రెడ్డి మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి చెప్పాడు. ముఖ్యంగా కీర్తి గురించి చెబుతూ నిన్ను చూసిన తర్వాత చాలా మంది సూసైడ్ చేసుకోవడం మానేస్తారు అని నువ్వు ఎన్నో బాధల్లో నుంచి ఇక్కడికి వచ్చావు. నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటే ఎవరూ కూడా సూసైడ్ చేసుకోరు అని.. అలాగే నేను నీతో గేమ్ ఆడినందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు.

  English summary
  Bigg boss telugu 6 finale adireddy eliminated with ravi teja task
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X