Don't Miss!
- News
పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Bigg Boss Telugu 6: డిప్రెషన్ లో గీతూ రాయల్.. అది కవర్ చేసేందుకు తుప్పాస్ పని, నాగార్జునతో కలిసి!
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినవారు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. అలాగే టాప్ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్సును కూడా ప్రేక్షకులు ఓట్స్ వేయకుండా ఇంటికి పంపించారు. అలా వెళ్లిన వాళ్లలో చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఒకరు.
టాప్ 5 కాదు ఏకంగా టైటిల్ కొడతానన్న కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ కంటెస్టెంట్ ను అనూహ్యంగా ఆడియెన్స్ ఇంటికి పంపించారు. టైటిల్ విన్నర్ కాదు ఏకంగా టాప్ 10లో కూడా లేకుండా చేశారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాక 20 రోజులు డిప్రెషన్ లో ఉన్నట్లు గీతూ రాయల్ తెలిపింది. అలాగే తాను ఒక తుప్పాస్ పని కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది.

మొదటి రెండు వారాలు మాత్రమే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన గీతూ రాయల్ అనూహ్యంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మొదటి రెండు వారాలు అద్భుతమైన గేమ్ ఆడి అందరిచేత ప్రశంసలు పొందింది ఈ చిత్తూరు చిరుత. అయితే ఆ తర్వాత మాట తీరు, స్ట్రాటజీస్, లూప్ లు అంటూ ప్రతిసారి గేమ్ ను అస్తవ్యస్తం చేసింది. అది కరెక్ట్ కాదని చెప్పినా వినిపించుకోకుండా తనదే కరెక్ట్ అన్నట్లుగా బిహేవ్ చేసింది.

ఎలిమినేషన్ తర్వాత కూడా..
తన ప్రవర్తన, ఆట తీరు నచ్చని ప్రేక్షకులు తొమ్మిదోవారం ఎలిమినేట్ చేసిన బయటకు పంపారు. అయితే హౌజ్ ను వీడి గీతూ రాయల్ బయటకు వెళ్లేటప్పుడు ఏడ్చిన తీరు ఇంతవరకు ఏ కంటెస్టెంట్ కూడా చేయలేదు. ఆమెను ఓదార్చడం హోస్ట్ నాగార్జున తరం కూడా కాలేదు. మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌజ్ ను వీడి గీతూ రాయల్ బయటకు వెళ్లింది. అలా వెళ్లిన తర్వాత కూడా బిగ్ బాస్ కు సంబంధించిన పోస్ట్స్ పెట్టడం, ట్రోలింగ్ గు గురి కావడం జరిగింది.

బిగ్ బాస్ పై విమర్శలు..
కొన్నిసందర్భాల్లో తన గేమ్ బాగుందని నాగార్జున, బిగ్ బాస్ తనను మునగ చెట్టు ఎక్కించి ఫైనల్ గా కిందపడేశారని విమర్శలు కూడా చేసింది గీతూ రాయల్. ఇదిలా ఉంటే గీతూ రాయల్ బిగ్ బాస్ రివ్యూవర్, యూట్యూబర్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ ను వీడాక.. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చేస్తోంది ఈ చిత్తూరు చిరుత. తాజాగా చేసిన ఓ వీడియోలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
డిప్రెషన్ లో 20 రోజులు..
ఈ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత 20 రోజులు డిప్రెషన్ లో కి వెళ్లాను. దాని నుంచి బయటకు వచ్చాక ఒక తుప్పాస్ పని చేశా. ఈ విషయం గనుక మా అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది" అంటూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్. అలాగే "బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ చూసి ఏడ్చేశాను. ఎందుకంటే మా అమ్మ నాకోసం హౌజ్ లోకి వస్తుందనకున్నా. అందుకోసం చీర కూడా కొని రెడీగా పెట్టాను" అని తెలిపింది గీతూ.
ఫ్యామిలీ వీక్ అయ్యాక..
ఈ వీడియోలో గీతూ రాయల్ ఇంకా మాట్లాడుతూ.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అయ్యాక ఎలిమినేట్ అయినా బాగుండేది. నేను ఎలిమినేట్ అయిన రోజు బాగా ఏడ్చేశాను. దీంతో డిప్రెషన్ లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి క్లాస్ పీకినరోజే ఆయన్ని కలిశాను. ఆయన నన్ను ఓదార్చారు అని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియోలో గీతూ రాయల్ ఒక టాటూ వేసుకుంది.

చిరుత చారల వంటి..
గీతూ రాయల్ తన కుడికాలిపై చిరుత చారల వంటి పచ్చబొట్టు వేయించుకుంది. టాటూ వేయించుకునేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండేందుకు బిగ్ బాస్ చూస్తూ కూర్చుంది. అయితే తన కాలికి బైక్ సైలెన్సర్ గాయం మచ్చ ఉంది. దాన్ని కవర్ చేసుకునేందుకే టాటూ వేయించుకున్నట్లు గీతూ తెలిపింది. అలా టాటూ వేసుకుంటే వాళ్ల అమ్మ చెప్పుతో కొడుతుందని ఆ వీడియో టాటూ వేసుకునేటప్పుడు చెప్పింది గీతూ రాయల్.