For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  |

  తెలుగు బుల్లితెరలో ప్రసారం అయ్యే షోలు అన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా నిలుస్తూ.. చాలా కాలంగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి మన ప్రేక్షకులు భారీ స్థాయిలోనే స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ప్రతి ఏడాది ఒకటి చొప్పన ఇప్పటికే ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఆదివారమే ఆరో సీజన్‌ కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్‌లో ఓ లేడీ కంటెస్టెంట్‌కు ఊహించని షాకిచ్చాడు బిగ్ బాస్. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  వాటికి మించేలా వచ్చిన ఆరో సీజన్

  వాటికి మించేలా వచ్చిన ఆరో సీజన్

  భారీ అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. పాత సీజన్లను మరిపించేలా దీనిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 21 మంది కంటెస్టెంట్లను పంపి సరికొత్త టాస్కుల పరిచయం చేస్తున్నారు. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో ఈ సీజన్‌కు ఆరంభంలోనే అదిరిపోయే స్పందన దక్కుతోంది.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  మొదటి వారంలో ప్రయోగాలు చేసి

  మొదటి వారంలో ప్రయోగాలు చేసి

  బిగ్ బాస్ ఆరో సీజన్‌ సరికొత్తగా ఉండబోతుందని నిర్వహకులు ముందుగానే చెప్పారు. అందుకు అనుగుణంగానే మొదటి వారం నామినేషన్స్ టాస్కు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి రచ్చ రచ్చగా సాగుతూ వచ్చింది. ఈ వారంలో నామినేషన్స్ టాస్కును కూడా సోమవారం కాకుండా బుధవారం పెట్టారు. అలా కొత్తగా దీన్ని నడుపుతున్నారు.

  కెప్టెన్సీ టాస్కు.. బాలాదిత్య కెప్టెన్‌గా

  కెప్టెన్సీ టాస్కు.. బాలాదిత్య కెప్టెన్‌గా

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో మొదటి వారంలో ముందుగా కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసుకునే టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత నామినేషన్స్ టాస్కును నిర్వహించారు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కెప్టెన్‌ను ఎంచుకునే టాస్కును నడిపించారు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా కొన్ని గొడవలతో సాగింది. ఇందులో కామ్ అండ్ కూల్ బాలాదిత్య గెలిచి బిగ్ బాస్ మొదటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

  ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

  వరస్ట్ పెర్ఫార్మర్‌ను ఎంపిక చేసేలా

  వరస్ట్ పెర్ఫార్మర్‌ను ఎంపిక చేసేలా

  సాధారణంగా ప్రతి శుక్రవారం లగ్జరీ బడ్జెట్ టాస్కు ఉంటుంది. అయితే, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం కెప్టెన్సీ టాస్కుతో పాటు ఆ వారం మొత్తానికి చెత్త ప్రదర్శన ఇచ్చిన కంటెస్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియను నిర్వహించారు. ఆ సమయంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ ఎంతో రంజుగా సాగిందనే చెప్పుకోవచ్చు.

  గీతూనే టార్గెట్... ఆ కారణాలు చెప్పి

  గీతూనే టార్గెట్... ఆ కారణాలు చెప్పి

  శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఫస్ట్ వీక్ వరస్ట్ పెర్ఫార్మర్‌ను ఎంపిక చేసే అవకాశాన్ని ఇంటి సభ్యులకు కల్పించాడు. ఇందులో ఎక్కువ శాతం మంది గీతూ రాయల్‌కే ఓటు వేశారు. ఆమె ప్రవర్తన, మాటతీరు, ఆటతీరు బాలేదని చెబుతూ నామినేట్ చేశారు. ఇందులో భాగంగానే ఆమె ముఖంపై రెడ్ కలర్ స్టాంపులు వేశారు. వీటికి గీతూ కూడా మంచిగానే కౌంటర్లు వేసింది.

  హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

  గీతూ రాయల్‌కు బిగ్ బాస్ జైలుశిక్ష

  గీతూ రాయల్‌కు బిగ్ బాస్ జైలుశిక్ష

  బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారానికి సంబంధించి జరిగిన వరస్ట్ ఇంటి సభ్యులను ఎంపిక చేసే ప్రక్రియలో గీతూ రాయల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ ఆమెకు జైలు శిక్షను విధించాడు. అంతేకాదు, కెప్టెన్ బాలాదిత్యకు అందిన ఆదేశాల ప్రకారం.. హౌస్ బయట (గార్డెన్ ఏరియా) ఉన్న జైలులోకి గీతూ రాయల్‌ను పంపించాడు. దీంతో ఆమె అసహనంతో కనిపించింది.

   పిరియడ్స్ అని రిక్వెస్ట్ చేసుకున్నా

  పిరియడ్స్ అని రిక్వెస్ట్ చేసుకున్నా

  బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారంలో గీతూ రాయల్ వరస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపికై జైలుకు వెళ్లింది. అయితే, ఓటింగ్ సమయంలో ఆమెకు పిరియడ్స్ ప్రాబ్లం ఉందని (24 గంటల స్ట్రీమింగ్‌లో) రేవంత్ చెప్పాడు. తర్వాత ఆమె స్థానంలో మరొకరిని జైలుకు పంపించాలని కెప్టెన్ బాలాదిత్య రిక్వెస్ట్ చేశాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం దీనికి నిరాకరించాడు. దీంతో గీతూ జైలు పాలయింది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Telugu 6th Season Running Successfully. Geetu Royal Went to Jail for Elected as Worst Performer In Last Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X