For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హాట్ టాపిక్ గా నాగార్జున షర్ట్స్ ధర.. అన్ని లక్షల్లోనే! అక్కడ మాత్రం?

  |

  ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. ఈ సీజన్ ఇప్పుడు దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఇన్ని రోజుల ఈ సీజన్ లో అనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు.

  వీటితోపాటు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే మరో విషయం హోస్ట్ నాగార్జున ధరించే దుస్తులు. అవును, హోస్ట్ నాగార్జున వచ్చేది శని, ఆది రెండు రోజులైన తనదైన స్టైలిష్ వేర్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వేసుకున్న ఆ డ్రెస్సుల ధర హాట్ టాపిక్ గా మారింది.

  Image Credits: The Tollywood Wardrobe

  మొదటి సీజన్ కు తారక్..

  మొదటి సీజన్ కు తారక్..

  విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది.

  సీజన్ 3 నుంచి హోస్ట్ గా..

  సీజన్ 3 నుంచి హోస్ట్ గా..

  బిగ్ బాస్ తెలుగు 1వ సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి యాంకరింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సీజన్ అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందింది. అలాగే రెండో సీజన్ ను నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇది కూడా చాలా పాపులర్ అవడంతో పాటు రేటింగ్ పరంగా కూడా దూసుకుపోయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.

  బిగ్ బాస్ హోస్ట్ గా విఫలం..

  బిగ్ బాస్ హోస్ట్ గా విఫలం..

  టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా నాగార్జునకు మంచి ఇమేజ్ ఉంది. వెండితెర నుంచి బుల్లితెరపైకి యాంకర్ గా షిప్ట్ అయిన నాగార్జున మొదట్లో ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత విమర్శల పాలయ్యారు. ముందుగా మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో హోస్ట్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా మాత్రం విఫలం అయ్యారనే వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి.

  యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా..

  యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా..

  ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జునపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. హౌజ్ లో కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే 63 ఏళ్లు పైబడినా కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్ గా ఉంటారు నాగార్జున. ఈ వయసులో కూడా 30 ఏళ్ల యంగ్ హీరోల అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తుంటారు.

  స్పెషల్ గా డిజైన్ చేసినట్లుగా..

  స్పెషల్ గా డిజైన్ చేసినట్లుగా..

  అంత యంగ్ గా కనిపించడానికి సీక్రెట్ ఏంటీ అని ఎంతోమంది అడిగినా ఆయన ఇచ్చే సమాధానం చిన్ని చిరునవ్వు. ఇక ఆయన డ్రెస్సింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎలాంటి డిజైనర్ వేర్ వేసినా ఆయనకు నప్పేలా ఉంటుంది. ఇక బిగ్ బాస్ షోలో ఆయన వేసే దుస్తులు ప్రత్యేకంగా ఉంటాయి. నాగార్జున కోసం స్పెషల్ గా డిజైన్ చేసినట్లుగా ఉంటాయి ఆ దుస్తులు. టీ షర్ట్స్, షర్ట్స్ లలో మరింత యంగ్ గా కనిపిస్తుంటారు నాగార్జున.

  నోరు వెళ్లబెట్టేలా ధర..

  నోరు వెళ్లబెట్టేలా ధర..

  అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వేసుకునే కాస్ట్యూమ్స్ పై, వాటి ధరపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వేసుకునే రంగురంగుల, విచిత్రమైన దుస్తుల ఖరీదును గూగుల్ లో సెర్చ్ చేసి మరి కనుక్కున్నారు పలువురు నెటిజన్లు. ఆ దుస్తుల ధరలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వామ్మో వాటి ఖరీదు అంతనా అని నోరు వెళ్లబెడుతున్నారు.

  నాగార్జున దుస్తుల ధరలు లక్షల్లో..

  నాగార్జున దుస్తుల ధరలు లక్షల్లో..

  నాగార్జున వేసుకున్న ఒక్కో షర్ట్ ధర సుమారు రూ. 2 లక్షల 50 వేలకుపైగానే ఉంది. అందులోనూ ఆయన వేసుకునే డ్రెస్సులన్నీ టాప్ బ్రాండెడ్ వే కావడంతో వాటన్నిటి ధర లక్షల్లో ఉంది. Louis Vuitton, Fendi, Prada, Gucci, Off White తదితర బ్రాండెడ్ షర్ట్స్, టీ షర్ట్స్ ఆయన ధరిస్తుంటారు. వాటిలో నవంబర్ 27 శనివారం నాటి 85వ ఎపిసోడ్ లో వేసుకున్న యెల్లో అండ్ బ్లాక్ బొమ్మల షర్ట్ ధర ఏకంగా రూ. 2, 25, 727గా ఉంది.

  అక్కడ మాత్రం వందకేనట..

  అక్కడ మాత్రం వందకేనట..

  యెల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ బొమ్మల షర్ట్ ధర ఒక్కటి మాత్రమే కాకుండా దాదాపుగా శని, ఆది వారాల్లో నాగార్జున వేసుకునే ప్రతి షర్ట్, టీ షర్ట్ ధర లక్షల్లో, వేలల్లో ఉందని టాక్. అయితే వాటి ధరకు తగినట్లుగా వాటి లుక్ లేదని కూడా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది నెటిజన్లు అయితే అలాంటి షర్ట్స్ ను పోలీన చొక్కాలు హైదరాబాద్ కోఠిలో రూ. వందకే దొరుకుతాయని సెటైర్లు వేస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Wearing Top Brand Shirts Price In Lakhs Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X