For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 బ్రో అంటూ అతనికి ఇనయా వెన్నుపోటు.. కిందపడి ఏడ్చిన హ్యాండ్సమ్, తొలిసారిగా ఇలా

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఫ్యామిలీ వీక్ తో సరదాగా, ఎమోషనల్ గా, సంతోషంగా సాగుతోంది. గత శుక్రవారం నాటి 82వ రోజు 83వ ఎపిసోడ్ లో చివరిగా రేవంత్ వాళ్ల అమ్మ వచ్చి సందడి చేశారు. హోజ్ లోకి ఎంటర్ అయిన రేవంత్ మదర్ అతన్ని కోపం తగ్గించుకోమని, గడ్డం కొంచెం తీయించుకోమని చెప్పింది. అమ్మ చెప్పగానే వాష్ రూమ్ కి వెళ్లి క్లీన్ షేవ్ చేయించుకుని వచ్చాడు రేవంత్. దీంతో మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు రేవంత్. అయితే దానికంటే ముందు రేవంత్ భార్య అన్వితతో వీడియో కాల్ మాట్లాడించారు బిగ్ బాస్. రేవంత్ మదర్ వెళ్లిపోయాక హౌజ్ లో చివరి కెప్టెన్సీ పోటీ జరిగింది. ఈ గేమ్ లో మిస్టర్ కూల్ అండ్ హ్యాండ్సమ్ ని నమ్మించి మోసం చేసింది లేడి టైగర్ ఇనయా సుల్తానా.

   నామినేషన్లలో ఏడుగురు..

  నామినేషన్లలో ఏడుగురు..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 82 రోజులు, 83 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ని అనౌన్స్ చేసేందుకు ఇంకొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌజ్ లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో కెప్టెన్ అయిన కారణంగా రేవంత్, అలాగే ఎవరు నామినేట్ చేయకపోవడంతో కీర్తి భట్ నామినేషన్లలో లేరు. అంటే శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, రాజ్, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డి నామినేషన్లలో ఉన్నారు.

   ఫైమాను తప్పించిన రేవంత్..

  ఫైమాను తప్పించిన రేవంత్..

  బిగ్ బాస్ తెలుగు 6 12వారం చివరిగా ఇంటి కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అందరూ ఇంటి సభ్యులు పాల్గొన్నారు. గార్డెన్ ఏరియాలో ఉన్న బాల్ ను తమ బలం ఉపయోగించి లాక్కోవాలి. బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరైతే బాల్ ఉంటుందో వాళ్లు కారణం చెప్పి ఒకరిని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఈ ఆటలో మొదటగా రేవంత్ చేతిలో ఉన్నప్పుడు బజర్ సౌండ్ రాగా అతను ఫైమాను తొలగించాడు. ఆమెకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉందన్న కారణం చెప్పగా ఫైమా ఏకీభవించలేదు.

   గట్టి పోటి ఇచ్చిన శ్రీసత్య..

  గట్టి పోటి ఇచ్చిన శ్రీసత్య..

  రేవంత్, ఫైమా వాగ్వాదం తర్వాత మళ్లీ గేమ్ స్టార్ట్ చేశారు. ఈసారి రోహిత్ చేతిలో ఉన్నప్పుడు బజర్ మోగింది. దీంతో అతను రేవంత్ ను తొలగించాడు. స్ట్రాంగ్ అండ్ ఈ వారం కెప్టెన్ అయినందున అలా చేస్తున్నట్లు చెప్పాడు రోహిత్. ఇలా గేమ్ సాగుతూ చివరిగా శ్రీ సత్య అండ్ ఇనయా సుల్తానా మిగిలారు. ఇనయాకు గట్టిపోటీ ఇచ్చింది శ్రీసత్య. అయినా ఎలాగైనా కెప్టెన్ అవ్వాలన్న కసితో ఆడిన ఇనయా చేతిలో ఉన్నప్పుడు బజర్ మోగింది.

   ఇనయా వెన్నుపోటు..

  ఇనయా వెన్నుపోటు..

  మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వా వారం, చివరి వారం కెప్టెన్ ఇనయా సుల్తానా అయింది. ఈ టాస్క్ లో ఇనయా సుల్తానా సూపర్బ్ గా ఫైట్ ఇచ్చింది. లేడీ టైగర్ లా అందరిని ఎదుర్కొని చివరిగా కెప్టెన్ అయింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ గేమ్ ఆడే క్రమంలో బ్రో అంటూ పిలిచి నమ్మించి మిస్టర్ హ్యాండ్సమ్ రోహిత్ కి వెన్నుపోటు పొడిచింది ఇనయా. రోహిత్ కు బాల్ వచ్చినప్పుడు తనను తొలగించొద్దు బ్రో అని ఇనయా అతనితో అందట.

  రోహిత్ ను తప్పించిన ఇనయా..

  రోహిత్ ను తప్పించిన ఇనయా..

  ఇనయా అలా అనడంతో వాళ్లిద్దరు (ఇనయా-రోహిత్) ఇప్పటి వరకు ఇంటి కెప్టెన్ అవ్వలేదు. సో చివరిదాకా ఇనయాను ఉంచుదామనుకున్న రోహిత్.. ఆమెను కాకుండా రేవంత్ ను తొలగించాడు. తర్వాత రౌండ్ లో ఇనయాకే బాల్ వచ్చింది. కానీ ఆదిరెడ్డి, శ్రీహాన్ ను కాకుండా రోహిత్ ను తొలగించి అక్కడ అందరికీ షాక్ ఇచ్చింది. మనిద్దరం ఇంటి కెప్టెన్ కాలేదని తెలుసు కానీ ఈసారి నేను ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని ఇనయ చెబుతుంటూ రోహిత్ నో.. నో అన్నాడు. అయినా కూడా రోహిత్ ను తొలగిస్తున్నట్లు ఇనయా ప్రకటించేసింది.

   ఎన్నడూ ఏడనివిధంగా..

  ఎన్నడూ ఏడనివిధంగా..

  తనను ఇనయా తప్పించేసరికి అది తట్టుకోలేక కుమిలిపోయాడు రోహిత్. తనను తొలగించొద్దని వేడుకుని చివరికీ అతన్నే తీసేసరికి కిందపడి మరి ఏడ్చాడు. అతని భార్య మెరీనా అబ్రహం కూడా వెళ్లినప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇంతలా ఏడవలేదు. రోహిత్ అంతలా ఏడవడం అదే తొలిసారి. ఇంతకుముందు అగ్రెషన్ అయ్యాడు, కొన్నిసార్లు కంటతడి పెట్టుకున్నాడు కానీ ఇలా అంతగా కన్నీళ్లు పెట్టుకోలేదు.

  ఇనయాకు రోహిత్ అభినందనలు..

  ఇనయాకు రోహిత్ అభినందనలు..

  ఇనయా తనను డిస్ క్వాలిఫై చేసేసరికి ఆమెను ఎంతో నమ్మిన రోహిత్ అది తట్టుకోలేక కిందపడి మరి బోరున విలపించాడు. దీంతో అతన్ని అందరూ ఓదార్చే ప్రయత్నం చేశారు. గేమ్ లో తనను ఔట్ చేయొద్దని ఇనయా అందని, అందుకే ఇనయా వద్ద బాల్ ఉన్న తను ట్రై చేయలేదని రాజ్, రేవంత్ లతో చెప్పి బాధపడ్డాడు రోహిత్. ఇనయా కెప్టెన్ అయిన తర్వాత కూడా అదంతా పక్కకు పెట్టి ఆమెకు కంగ్రాట్స్ చెప్పాడు రోహిత్. దీంతో సారీ బ్రో అంటూ ఇనయా చెప్పింది. అయితే రోహిత్ తో ఇనయా చేసుకున్న డీల్ ను చూపించలేదు బిగ్ బాస్.

  English summary
  Inaya Sultana Is Bigg Boss Telugu 6 Season 12th Week Captain In November 25 Day 82 Episode 83.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X