Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: నా గర్భసంచి తీసేశారు, అందంగా లేవని గెంటేశారు.. కంటతడి పెట్టించే కీర్తి లైఫ్ జర్నీ!
తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్‌తో సంచలనాలను సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎవరూ ఊహించని కంటెంట్‌తో సాగే దీనికి ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందననే అందించారు. ఫలితంగా తెలుగులో ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రారంభమైన ఆరో సీజన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా ఇంటి సభ్యుల బిగ్ బాస్ జర్నీలను చూపించి కంటతడి పెట్టించాడు బిగ్ బాస్.

21 మంది కంటెస్టెంట్లుగా..
వరుస పెట్టి సీజన్లతో ముందుకు సాగుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆరో సీజన్ ను సెప్టెంబర్ 4న ప్రారంభించారు. ఈ 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, సీరియల్ నటి శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

ఒక్కొక్కరి గురించి అద్భుతంగా..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు మిగిలారు. వీరిలో ఈ 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ కానుందని వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా ఇంటి సభ్యుల బిగ్ బాస్ జర్నీలను వారికి చూపించారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అద్భుతంగా చెప్పాడు బిగ్ బాస్. అది విన్న ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు.

నీకోసం పెద్ద ఫ్యామిలీ ఉంది..
గత ఎపిసోడ్ అంటే డిసెంబర్ 14 బుధవారం నాటి 101వ రోజు 102వ ఎపిసోడ్ లో శ్రీహాన్, కీర్తి భట్ ల బిగ్ బాస్ ప్రయాణాన్ని చూపించారు. ఇందులో చివరిగా కీర్తి భట్ బిగ్ బాస్ జర్నీని వేశారు. ఫోన్ కాల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ మాట్లాడి కీర్తిలో ధైర్యాన్ని నింపాడు. నువ్ ఒంటరి కాదు.. నీకోసం పెద్ద ఫ్యామిలీ ఉందంటూ భరోసా ఇచ్చాడు. తర్వాత కీర్తి గురించి చెప్పాడు బిగ్ బాస్. బిగ్ బాస్ తన మాటల్లో కీర్తిని ఒక మహావృక్షంతో పోల్చారు.

మహావృక్షం బాధపడితే..
"కీర్తి నిజ జీవితం కల్పితం కన్నా ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహించివేస్తుంటే మీరు చూపించిన గుండె నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒక్కటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే.. ఆకాశం తాకి తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు."

కుటుంబ సభ్యుల సంఖ్య కొన్ని లక్షలు..
"సింపథీ కోసమే మీ ప్రయాణమని మిగతా వారు నిందించినప్పుడు మీ మనసు గాయ పడింది. కానీ మీ ఆట ఆగలేదు. ఆ గాయాలు మిమ్నల్ని ఆపలేకపోయాయి. 14వ వారాల సుధీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్ ఫినాలే చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు మీ కుటుంబం కూడా. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు. కష్టాల పునాదులపై నిర్మించి విజయాన్ని గడపడం అంత సులభం కాదు" అని బిగ్ బాస్ అద్భుతంగా చెప్పారు. దీంతో చాలా ఎమోషనల్ అయింది కీర్తి.

నా గర్భసంచి తీసేశారు..
బిగ్ బాస్ మాటల తర్వాత కీర్తి జర్నీని చూపించారు. అందులో కీర్తి చెప్పిన సంఘటనలు ఎమోషనల్ గా మలిచారు. "నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. యాక్సిడెంట్ లో నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. నేను కోమాలోకి వెళ్లాను. కొన్నాళ్ల తర్వాత కళ్లు తెరచి చూసి.. నా వాళ్ల కోసం నేను వెతుక్కుంటున్నా. కానీ నేను తప్ప ఎవరు బతకలేదని తెలిసి తట్టుకోలేకపోయాను. ఆ విషాదం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. నేను ఒంటరిగా ఉండకూడదని ఒక పాపను దత్తత తీసుకున్నా. ఆ పాపను కూడా దేవుడు దూరం చేశాడు. పోనీ నాకు పెళ్లి అయి.. ఒక పాపను కనొచ్చు అనుకుంటే అది కూడా లేకుండా చేశాడు. ప్రమాదంలో నా కడుపుకి గాయం కావడంతో నా గర్భసంచి తీసేశారు. ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు" అని వీడియోలో చూపించారు.

అందంగా లేవన్నారు...
కీర్తి జర్నీ అయ్యాక చివర్లో చాలా భావోద్వేగంగా తనకు జరిగిన అనుభవాలను పంచుకుంది. "ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎవరు నన్ను ఛీ తూ అన్నారో.. నువ్వు అందం లేవు.. చూడ్డానికి బాలేదు అని బయటకు గెంటేశారో.. ఎవరైతే నువ్వు వద్దని నన్ను దూరం పెట్టారో వాళ్లకు చెబుతున్నా.. ఇది కీర్తి అంటే.. ఇదే కీర్తి. ఈరోజు నా పేరెంట్స్ ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను. నా బిడ్డ జీవితం ఏమౌతుందో అని వాళ్లు పైనుంచి చూసి ఏడుస్తుంటారు. కానీ ఈరోజు వాళ్లు నన్నుచూసి సంతోషపడతారు. ఈ బిగ్ బాస్ వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ దొరికింది. వాళ్లందరికీ రుణపడి ఉంటాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కీర్తి.