Don't Miss!
- News
కేశినేని నాని ట్వీట్లపై రచ్చ రచ్చ: సైబర్ సెల్ దృష్టికి
- Sports
IND vs WI : వెస్టిండీస్ తుక్కురేగ్గొట్టిన భారత స్పిన్నర్లు.. ఫలించిన హార్దిక్ ప్రయోగాలు.. ఇండియా ఘనవిజయం
- Finance
Young Techie: 12 ఏళ్లకే 3 యాప్స్ తయారు.. గిన్నిస్ రికార్డు సృష్టించిన కుర్రాడు.. కోట్లు సంపాదించే ఛాన్స్!
- Automobiles
వేట మొదలైంది.. రాయల్ ఎన్ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే
- Technology
OnePlus ఆక్సిజన్ OS 12 కొత్త అప్డేట్ విడుదల!! Nord CE 2 5G లో మెరుగైన ఫీచర్స్ ఎన్నో...
- Lifestyle
Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు ఆగష్టు 07 నుండి ఆగష్ట్ 13 తేదీ వరకు..
- Travel
ట్రెక్కింగ్ ప్రియులకు కొత్తగా పరిచయమైన హిల్స్టేషన్.. వంజంగి
Bigg Boss 6 Telugu: ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది.. ఈసారి మరింత కలర్ఫుల్ గా..
టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 6వ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్వాహకులు ఈ షోకు సంబంధించిన అన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని రెడీ అవుతున్నారు. ప్రత్యేకంగా బిగ్ బాస్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. దాదాపు ఆ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్ విషయంలోనే చర్చలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి బిగ్ బాస్ కొన్ని విభిన్నమైన టాస్కులతో ఈసారి అంతకుమించి అనేలా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో ఈ రియాలిటీ షో మొదలవుతుందట. ఇక మొత్తంగా అయితే ఈసారి 20 మందికి పైగా కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అందులో కామన్ మెన్స్ కూడా ఉంటారట. ఇక బిగ్ బాస్ 6కు సంబంధించిన ఫస్ట్ లోగో కూడా వచ్చేసింది. ఈసారి కలర్ఫుల్ గా బిగ్ బాస్ లోగో ఎంతగానో ఆకట్టుకుంటుంది. షో కూడా కలర్ ఫుల్ గా కామెడీగా సీరియస్ గా ఇలా అన్ని కోణాల్లో కూడా ఆకట్టుకుంటూ ఉంటుందని చెబుతున్నారు.

ముఖ్యంగా యూట్యూబ్ నుంచే ఈసారి కొంతమంది ఎక్కువ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉందట. నాగార్జునతో ఇప్పటికే ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. నెక్స్ట్ వారంలో ప్రోమో కు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ కు సంబంధించిన ఎలాంటి లీక్స్ కూడా జరగకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా కొన్ని రూల్స్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా దాని వెనకాల పనిచేసే యూనిట్ అందరూ కూడా క్వారంటైన్ లోనే ఉండాలి అనే విధంగా ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కోవిడ్ తో పాటు మరోవైపు లీకేజీ సమస్య కూడా బిగ్ బాస్ పై కొంత ప్రభావం చూపి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బిగ్బాస్ కు సంబంధించిన యూనిట్ అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేయబోతున్నారట. ప్రత్యేకంగా వారికోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.