Don't Miss!
- News
ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss Finale: బిగ్ బాస్ టీమ్ సంచలన నిర్ణయం.. ఫినాలే ముందే ఆగిపోనున్న ఆరో సీజన్
అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా మన షో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. దీనికి ఆదరణ అంతంతమాత్రంగానే దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఫినాలే ముందే దీన్ని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

అవన్నీ కంప్లీట్.. ఇప్పుడీ సీజన్
బిగ్ బాస్ షో తెలుగులోనే భారీ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు ఇప్పటికే మన దగ్గర ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. అయితే, దీనికి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. కానీ, చివరి దశకు చేరడంతో ఇప్పుడు ఇది రంజుగా మారి రేటింగ్‌ను రాబట్టుకుంటోంది.
మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

ఫినాలే వీక్.. వాళ్లలో ఒకరు ఔట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతోంది. ఇందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే, వీరి నుంచి ఒకరిని బుధవారం రాత్రి ఎపిసోడ్‌లో బయటకు పంపించబోతున్నారు. కానీ, ఈ విషయం మాత్రం వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అంటే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురే ఎంట్రీ ఇస్తారు.
|
ఓటింగ్ భారీగా... లైన్స్ బిజీగా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు బుధవారమే వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు ఫుల్‌గా ఓట్లు వేస్తున్నారు. అలాగే, మిస్‌డ్ కాల్స్ కూడా భారీగా ఇస్తుండడంతో లైన్స్ బిజీగా మారాయి.
హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

ఆరోజే ఫినాలే.. అతడికే ఛాన్స్
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 18 ఆదివారం జరగబోతుంది. ఆరోజు ఇది సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమై దాదాపు మూడున్నర గంటల పాటు సాగబోతుంది. ఇక, ఈ సీజన్ విషయానికి వస్తే.. ఇందులో సింగర్ రేవంత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో అతడి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

సరికొత్తగా ప్లాన్.. వాళ్లంతా రాక
బిగ్ బాస్ షోలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆరో సీజన్ ఫైనల్స్ కూడా అంతకు మించేలా ప్లాన్ చేసుకుంటోన్నారు. ఇందుకోసం ఈ సీజన్‌లోని మాజీ కంటెస్టెంట్లను తీసుకు రాబోతున్నారు. దానికి సంబంధించిన షూటింగ్‌ను శుక్రవారం నుంచి మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.
Bigg Boss Winner: రేవంత్‌కు బిగ్ షాక్.. ఫినాలేలో ఊహించని ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

గెస్టుపై పుకార్లు.. బాలయ్య అని
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు హోస్ట్ నాగార్జునతో పాటు ఒక గెస్టు కూడా వస్తుంటారు. ఇలా ఇప్పటికే చాలా మంది స్టార్లు వచ్చారు. ఈ క్రమంలోనే ఆరో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు వచ్చే గెస్టు గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక సందర్భంలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ షోకు గెస్టుగా రాబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఆగిపోనున్న ఆరో సీజన్ లైవ్
బిగ్ బాస్ ఆరో సీజన్ టీవీలో గంట పాటు ప్రసారం అవడంతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. అయితే, దీన్ని డిసెంబర్ 15వ తేదీ రాత్రి నుంచి ఆపేస్తారని తెలిసింది. ఫినాలే కోసం చేసిన సర్‌ప్రైజ్‌లు లీక్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ, టీవీలో మాత్రం రోజువారి ఎపిసోడ్ ప్రసారం చేస్తారు.