For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:గేమ్ అయిపోయాక అవసరమా.. సిగరెట్ల కోసం అన్ని మాటల.. అన్నాచెల్లెల్లకు నాగార్జున క్లాస్

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ అయితే బీభత్సంగా జరిగింది. బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ గేమ్ జోరుగా సాగింది. కానీ రెడ్ టీమ్ మాత్రం ఎదుటి టీమ్ వాళ్ల బలహీనతలపై కొట్టడం, రెచ్చగొట్టడం, వెకిలీ చేష్టలు, లూపులు అంటూ పనికిరాని లాజిక్స్ వెతుక్కుంటూ అరాచకం సృష్టించింది. ఇక బాలాదిత్యతో సిగరెట్ల గొడవ మరి హైలెట్ అయింది. బాలాదిత్య కంటతడి పెట్టుకునేదాకా తెచ్చింది రెడ్ టీమ్ లీడర్ గీతూ రాయల్. తర్వాత తనకు సన్నిహితుడైన ఆదిరెడ్డిని చీట్ చేసి మరి గేమ్ ఆడింది. ఆమె బాటలోనే రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా కూడా రెచ్చిపోయి ప్రవర్తించారు. ఈ విషయాలపై తాజాగా ప్రసారమయ్యే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున క్లాస్ తీసుకోనున్నాడు.

  ఆడిన ఆట తీరుపై నాగార్జున క్లాస్..

  ఆడిన ఆట తీరుపై నాగార్జున క్లాస్..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఈ వారం ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. గొడవలు, అరుచుకోవడాలు, లూప్ లు, స్ట్రాటజీస్ అంటూ ఏదోదో చేశారు. ఇక ప్రతి శనివారం ఇంటి సభ్యుల ఆటతీరుని హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరుపై నాగార్జున వచ్చి క్లాస్ తీసుకున్నాడు. నవంబర్ 5 శనివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

  సిగ్గుపడి వెనక్కి తిరిగింది..

  సిగ్గుపడి వెనక్కి తిరిగింది..

  ఈ ప్రోమోలో బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఆడిన విధానాన్ని ప్రస్తావించారు నాగార్జున. ఆదిరెడ్డిన తన టీమ్ సభ్యులకు మార్కులు ఇవ్వమని చెప్పాడు నాగార్జున. దీంతో ఐదు మార్కుల బోర్డుని బాలాదిత్యకు ఇచ్చాడు ఆదిరెడ్డి. దీనికి నీకు వేసిన నెంబర్ కూడా చూడు సిగ్గుపడి వెనక్కి తిరిగింది. ఎందుకంత డెస్పెరేషన్ అని నాగార్జున అడిగారు. అది కోపం కాదు సర్.. బాధ అని బాలాదిత్య సమాధానమిచ్చాడు.

  గెలిచే పద్ధతి కూడా ముఖ్యమే..

  గెలిచే పద్ధతి కూడా ముఖ్యమే..

  ఒక మనిషి బాగా క్లోజ్ అని చెప్పినప్పుడు ఆ మనిషి వీక్ నెస్ మీద కొట్టం కదా సర్ అని బాలాదిత్య చెప్పుకొచ్చాడు. గేమ్ విషయానికొస్తే తన తల్లిదండ్రులు కూడా తర్వాతే అని, తానొక వెధవనని గీతూ చెప్పింది కదా అని నాగార్జున తెలిపారు. అందుకు బాలాదిత్య నేను కూడా గెలవలానుకుంటాను సార్.. కానీ గెలిచే పద్ధతి కూడా ముఖ్యమే అని అన్నాడు. సిగ్గుందా.. ప్రేమతో ఆకుంటావా.. అసలు మనిషివేనా.. ఆఫ్ట్రాల్ సిగరెట్ల కోసం ఇన్ని మాటలు అవసరమా అని అడిగారు నాగార్జున.

  బలహీనతతో ఆడుకోవాల్సింది కాదు..

  బలహీనతతో ఆడుకోవాల్సింది కాదు..

  నాగార్జున అలా అడగడంతో మధ్యలో రియాక్ట్ అయిన గీతూ రాయల్.. నేను ఆ మాటలకు కూడా బాధపడలేదు సార్. ఇన్నాళ్లు నువ్ నటిస్తున్నావని చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్నాడు. దానికి హార్ట్ బ్రేక్ అయిపోయింది సర్ అని చెప్పుకొచ్చింది. ఆట సమయంలో మీరు సిగరెట్లు దాచినది ఓకే.. కానీ ఆట ఆగాక కూడా బాలాదిత్య బలహీనతతో ఆడుకోవాల్సింది కాదు అని నాగార్జున అన్నారు.

  ఆ ట్యాగ్ నాకు వద్దు సర్..

  అందుకు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతే సర్.. బాలాదిత్య ఒక స్మోకర్.. వాడికదొక బలహీనత అన్న ట్యాగ్ నాకు వద్దు సర్ అని ఎమోషనల్ అవుతూ చెప్పాడు బాలాదిత్య దీంతో ఈ విషయంలో తప్పు గీతూదా.. లేక బాలాదిత్యదా మీరే చెప్పాలి అని ఆడియెన్స్ ను నాగార్జున ప్రశ్నించడంతో ప్రోమో ముగిసింది. అయితే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారం అనూహ్యంగా టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ముద్దుబిడ్డ, చిత్తూరు చిరుత, చిత్తూరు చింతకాయ (నెటిజన్ల మాట) గీతూ రాయల్ ఎలిమినేట్ అయిందని సమాచారం.

  English summary
  Bigg Boss Telugu 6 Season Nagarjuna Class To Geetu Royal Baladitya November 5 Episode Latest Promo Released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X