For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నీ గేమ్ బొచ్చులో ఆట అయిపోయింది.. ఇచ్చిపడేసిన నాగార్జున, గీతూకు శిక్ష

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 6 ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ గా శ్రీహాన్ ను ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు. శ్రీహాన్ కెప్టెన్ అయ్యాక రైస్ వేస్టేజ్ గురించి డిస్కషన్ జరిగింది. అలాగే ఈవారం వరెస్ట్ కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసి జైళ్లో వేయాల్సిందిగా కెప్టెన్ శ్రీహాన్ కు బాధ్యత అప్పగించాడు బిగ్ బాస్. దీంతో బాలాదిత్యను వరెస్ట్ కంటెస్టెంట్ కింద జైళ్లో వేసి లాక్ చేశాడు శ్రీహాన్. ఇలా వారమంతా జోరుగా సాగింది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షోలో శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యులు ఆట, మాట, ప్రవర్తన తీరుపై రివ్యూలు చేసి సరైనా దారిలో పెడతారన్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అక్టోబర్ 29 శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

  చేపలను గాల్లోకి విసురుతూ..

  చేపలను గాల్లోకి విసురుతూ..

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో బిగ్ బాస్ రూల్స్ పక్కన పెట్టి తమకు నచ్చినట్లు గేమ్ ఆడారు కొందరు కంటెస్టెంట్లు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది చిత్తూరు చిరుత గీతూ రాయల్. గత ఎపిసోడ్ లలో కెప్టెన్సీ కంటెండర్ల కోసం పెట్టిన చేపల చెరువు టాస్క్ లో అందరూ బాగానే పర్ఫామ్ చేసినా.. గీతూ రాయల్, ఆదిరెడ్డి మాత్రం మొదటి రౌండ్ లోనే ఓడిపోయారు. అయినా ఊరుకోకుడా తన వద్ద ఉన్న చేపలను గాల్లోకి విసురుతూ డిస్ క్వాలిఫై అయినా గేమ్ ఆడతానని చెప్పుకొచ్చింది.

  సంచాలక్ పని పక్కన పెట్టి..

  సంచాలక్ పని పక్కన పెట్టి..


  రోండో రౌండ్ లో ఆదిరెడ్డి, గీతూ రాయల్ ను సంచాలక్ గా నియమించాడు బిగ్ బాస్. సంచాలక్ అంటే ఇంటి సభ్యులు సరిగ్గా ఆడుతున్నారా లేదా అని చూసుకోవాలి. ఇంటి సభ్యులు సరిగ్గా ఆడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేసిన గీతూ రాయల్ తను కూడా చేపలు పట్టుకోవడం, హౌజ్ మేట్స్ బుట్టల్లో నుంచి చేపలు ఎత్తుకెళ్లడం, ఇష్టమొచ్చినట్లు రూల్స్ పెట్టడం వంటి చాలా చేసి చాలా ఇరిటేషన్ తెప్పించింది.

  మీరే ఎందుకు లీస్ట్ ఉన్నారు..

  మీరే ఎందుకు లీస్ట్ ఉన్నారు..

  ఈ విషయంపై తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 29 శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో సీరియస్ అయ్యారు నాగార్జున. మొన్న జరిగిన చేపల టాస్కులో నీ పార్టనర్ గీతూ ఫిజికల్ టాస్క్ ఇవ్వండి గుద్దిపడేస్తా అంది. గుద్ది పడేసిందా.. అని ఆదిరెడ్డిని అడిగాడు నాగార్జున. తటపటాయిస్తూ ఆడింది సార్ అని ఆదిరెడ్డి చెప్పాడు. దానికి మరి మీరే ఎందుకు లీస్ట్ ఉన్నారు గుద్దిపడేసే ఆట అయితే అని కౌంటర్ వేశారు నాగార్జున.

  అందరిని కావాలనే రెచ్చగొట్టా..

  అందరిని కావాలనే రెచ్చగొట్టా..


  నువ్వు గెలవాలని కాదు. అవతలి వారి వీక్ నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్ అని ఫైర్ అయ్యారు నాగార్జున. దీనికి గీతూ.. లాస్ట్ వీక్ పువ్వుల టాస్కు ఎవరు సరిగా ఆడలేదు. నేనుండే సీజన్.. వాళ్లు ఆడకపోయినా.. నేనే ఆడిపిద్దామని అందరిని కావాలనే రెచ్చగొట్టా అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్. గేమ్ ని ఇంట్రెస్ట్ గా మార్చడం ఎలాగో అనేది బిగ్ బాస్ చూసుకుంటాడు. ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడో ఉంటుంది అని నాగార్జున తెలిపారు.

  మెంటలైపోతుంది సర్ గేమ్ అంటే..

  మెంటలైపోతుంది సర్ గేమ్ అంటే..

  నాగార్జున అలా చెప్పడంతో.. మెంటలైపోతుంది సర్ గేమ్ అంటే.. బయట కూడా నేను గేమర్ ని సర్ అని చెప్పింది గీతూ రాయల్. దీంతో మరింత ఫైర్ అయిన నాగార్జున.. ఒకరి వీక్ నెస్ మీద ఆడటం గేమర్ కాదు. అసలు నువ్ ఎవ్వరు ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి. సంచాలక్ అంటే ఒక ఎంపైర్. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. ఆ మాట బాగుందా.. లేదు కదా.. కోపం వస్తే కామన్ సెన్స్, అన్నీ వెళ్లిపోతాయేమో అని అన్నారు నాగార్జున.

  పనిష్ మెంట్ కి అర్హురాలివి..

  నాగార్జున అలా చాలా కోప్పడే సరికి గీతూ మొహం మాడిపోయినట్లయింది. నోటి వెంట మాట రాలేదు. తర్వాత గీతూ నువ్ పనిష్ మెంట్ తీసుకోవడానికి అర్హురాలివి అని తెలిపారు నాగార్జున. మరి ఆ శిక్ష ఏంటనేది చెప్పలేదు. అదేంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎనిమిదో వారం ఆర్జే సూర్య ఎలిమినేట్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Angry On Geetu Royal Over Sanchalak In Chepala Cheruvu Task And October 29 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X