Don't Miss!
- News
కోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్‌రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ!!
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu షాకింగ్ ట్విస్ట్.. హోస్టింగ్ కు నాగార్జున గుడ్ బై! కొంప ముంచిన ఎలిమినేషన్?
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ షోకి ప్రధానమైన హైలెట్ గా నిలిచేది హోస్ట్. మొదటి రెండు సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లకు టాలీవుడ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేయనని నాగార్జున తేల్చి చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

చివరి దశకు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఇప్పటికే 97 రోజులు 98 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్ని సీజన్లకు హోస్ట్ గా అలరించిన టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్టింగ్ మానుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

5 రెగ్యులర్, 1 ఓటీటీ పూర్తి..
అశేషమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. మొదట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది.

తొలి సీజన్ కు ఎన్టీఆర్..
బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆయన యాంకరింగ్ తో బిగ్ బాస్ ను స్థాయిని పెంచారు. దీంతో ఈ సీజన్ అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందగలిగింది. అలాగే రెండో సీజన్ ను నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇది కూడా చాలా పాపులర్ అవడంతో పాటు రేటింగ్ పరంగా కూడా దూసుకుపోయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటివరకు (6వ సీజన్) టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

హోస్టింగ్ చేయనని..
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జునపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. హౌజ్ లో కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇదంతా బీబీ టీమ్ నాగార్జునకు పూర్తి వివరాలు చెప్పకపోవడంతోనే అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇక నుంచి బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేయనని బీబీ టీమ్ వాళ్లకు నాగార్జున చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకెవరినైనా చూసుకోండి..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారం ఇనయా సుల్తానా ఎలిమినేషన్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇనయా సుల్తానా ఎలిమినేషన్ తో నాగార్జున అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. తర్వాత బీబీ మ్యానేజ్ మెంట్ తో చర్చించిన నాగార్జున ఇక నుంచి బిగ్ బాస్ కు హోస్టింగ్ చేసే ఆసక్తి లేదని చెప్పారట. తర్వాతి సీజన్ కు ఇంకెవరినైనా చూసుకోండని మరి తేల్చి చెప్పినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

మీరు కంటిన్యూ అయితే..
ఒక ఇనయా ఎలిమినేషన్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ మ్యానేజ్ మెంట్ కు సంబంధించిన చాలా విషయాలు నాగార్జునకు నచ్చలేదని టాక్. ఇప్పటికీ ఆయన హోస్టింగ్ చేయనని చాలా సార్లు చెప్పారట. ఇక ఇనయా ఎలిమినేషన్ తో ఖరాఖండిగా చెప్పినట్లు ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. అందుకు బిగ్ బాస్ టీమ్ "మీరు బ్రాండ్ సార్.. మీరే కంటిన్యూ అయితే బాగుంటుంది" అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే బీబీ మ్యానేజ్ మెంట్ అనేక విషయాలను నాగార్జన దగ్గర దాచేస్తారని సోషల్ మీడియాలో పలువురు చెబుతున్నారు.

రాజకీయాలు జరిగాయని..
ఇప్పటికే బిగ్ బాస్ పై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్ తోనే ఎలిమినేట్ చేస్తామని చెప్పిన బీబీ టీమ్ అత్యధికంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఇనయా ఎలిమినేట్ కావడంతో.. అనేకమంది ఫైర్ అవుతున్నారు. ఇనయా సుల్తానా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ట్రెండ్ కూడా నడుస్తోంది. టాప్ 2లో ఉండే కంటెస్టెంట్ ను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేయడంపై పాలిటిక్స్ జరిగాయని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే హోస్టింగ్ చేయనని నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.