Bigg Boss Telugu 6: గీతూ చేసిన మిస్టేక్ వలన ఆదిరెడ్డి బలి.. అమ్మాయిల మధ్యలో బెలూన్ ఫైట్!

ఇక మిషన్ పాసిబుల్ టాస్క్ లో గేమ్ లో భాగంగా చనిపోయిన వారు భౌతికంగా ఆటలో పాల్గొనలేరు అని బిగ్ బాస్ ప్రకటించేసాడు. దీంతో గీతూకు కౌంటర్ పడినట్లు అయింది. అందుకే ఆదిరెడ్డి ఈ టాస్క్ లో చనిపోలేదు అని ప్రకటిస్తున్నట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ఆ దెబ్బకు గీతుకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి వరకు పోరాడిన విధానం మొత్తం కూడా వృధా అయిపోయింది.

అయితే ఆదిరెడ్డి అయితే ఉద్దేశపూర్వకంగా ఇంట్లోనే మైక్ ను పడేసి అతి పెద్ద తప్పు చేశాడు అని కూడా బిగ్ బాస్ చిబాట్లు పెట్టాడు. మీరు చేసిన తప్పు కారణంగా మీరు పోటీదారులు అయ్యే అర్హతను మీ నుంచి తీసుకుంటున్నాము అని మరొక షాక్ ఇచ్చాడు. ఇక ఆదిరెడ్డిని ప్రత్యేకంగా గీతూ రెడ్డి బ్రతిమలాడే ప్రయత్నం చేసింది. ఓదార్చేందుకు సారీ కూడా చెప్పింది. భౌతికంగా పెట్టిన రూల్స్ నువ్వే ఫాలో కాలేదు. నువ్వు ఫాలో కాకపోవడం వల్ల నేను నా మైక్ విసిరేసి చచ్చిపోవాల్సి వచ్చింది.

ఒక్కదానివల్ల మొత్తం గేమ్ తిరిగిపోయింది. గేమ్ అంతా రివర్స్ అయ్యింది అని ఆదిరెడ్డి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి కెప్టెన్సీ టాస్క్ బెలూన్ మీ బాధ్యత అంటూ ఈ టాస్క్ లో పోటీదారులు వారి బెలూన్ ను కాపాడుకుంటూ ఇతర పోటీదారుల బెలూన్స్ పగలగొట్టాల్సి ఉంటుంది.

Bigg boss telugu 6 november 4th episode new twist in aadi reddy game

ఇక ఈ పోటీలో అమ్మాయిల మధ్యలో పోటీ తీవ్రత గట్టిగా నడిచింది. ఇనయా సుల్తానా శ్రీ సత్య మధ్యలో వార్ కూడా గట్టిగానే నడిచింది. ఇక మెరీనా కూడా ఇనయాకు సపోర్ట్ చేసినట్లు అనిపించింది. శ్రీ సత్యాన్ని టార్గెట్ చేయండి అని ఆమె చెప్పడంతో అందరూ కూడా మీ వెంట పరిగెత్తారు. ఒక విధంగా సుల్తానాకు ఈ గేమ్ లో ప్రేక్షకుల నుంచి మద్దతు బాగానే లభించినట్లు సోషల్ మీడియాలో కామెంట్ చూస్తే అని అర్థమవుతుంది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచి కెప్టెన్సీ టాస్క్ లో ముందు వరుసలో నిలబడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X