For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:బిగ్ బాస్ షోపై హైకోర్టులో పిటిషన్.. అశ్లీలత ఎక్కువైంది, ఆ సమయంలోనే ప్రసారం చేయాలి

  |

  రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్​బాస్​ ఆరో సీజన్​ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. దీంతో ఈ షోకి ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ షోని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఓ న్యాయవాది. ఆ వివరాళ్లోకి వెళితే..

  ఊహించని పరిణాలు, ట్విస్టులు..

  ఊహించని పరిణాలు, ట్విస్టులు..

  రియాలిటీ షో అనే పేరుకు తగినట్లుగానే నిజమైన సంఘటనల ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణాలు.. ట్విస్టులతో సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 6 షో. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది ఈ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

   21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ..

  21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ..

  గత సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. ఇక అంచనాలకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు.

  పొట్టి దుస్తుల్లో గ్లామర్ ఒలకబోత..

  పొట్టి దుస్తుల్లో గ్లామర్ ఒలకబోత..

  మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ షోలో లేడి కంటెస్టెంట్లు చూపించే గ్లామర్ షో కూడా అంతా ఇంతా ఉండదు. తాజాగా ప్రసారం అవుతున్న ఆరో సీజన్ లో కూడా లేడి కంటెస్టెంట్లు అయిన శ్రీ సత్య, వాసంతి, కీర్తి భట్ పొట్టి దుస్తుల్లో బాగానే గ్లామర్ షో చేశారు.

  కొందరికి బ్రోతల్​ హౌజ్​ల..

  కొందరికి బ్రోతల్​ హౌజ్​ల..

  అయితే ఈ బిగ్​బాస్​ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. కానీ ఇదే బిగ్​బాస్ రియాలిటీ కొందరికి బ్రోతల్​ హౌజ్​ల కనిపిస్తుంది. వారు పెట్టే టాస్క్​లు, కాన్సెప్ట్​ పాశ్చాత్య సంస్కృతికి మించి దారుణంగా ఉంటోందని తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి.

  ఇదొక బూతు దందా అని..

  ఇదొక బూతు దందా అని..

  బిగ్ బాస్ షో వచ్చే ఆదరణ, పాపులారిటీ, మన్ననలు ఒకవైపు మాత్రమే. మరోవైపు బిగ్​బాస్ షో ఒక కాంట్రవర్సీ షో. ఇదొక బూతు దందా అని పలువురు ఇప్పటికీ చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీపీఐ నేత నారాయణ.. ప్రతి సీజన్​ సమయంలో తనదైన స్టైల్​లో ఏకిపారేస్తాడు. ఈ సీజన్​కు సైతం అలానే చేశాడు. అలాగే ఈ సీజన్ ప్రారంభ సమయంలో టాలీవుడ్ పాపులర్ సింగర్ స్మిత కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్..

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్..

  ఇక తాజాగా అయితే ఈ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ను నిలిపివేయాలని ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించినట్లు సమాచారం. ఈ షోలో అశ్లీల ఎక్కువైన కారణంగా, చట్ట ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని కోరారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

  అంతగా రాని రేటింగ్..

  అంతగా రాని రేటింగ్..

  ఇదిలా ఉంటే ఇలా విమర్శలతో పాటు ప్రేక్షాదరణతో కొనసాగుతోన్న ఈ రియాలిటీ షోకి అంతగా రేటింగ్ రావడం లేదు. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ ఆరో సీజన్ కు తక్కువగా ఉందనే చెప్పాలి. దీంతో మరో కొత్త సీజన్ ఉండకపోవచ్చేనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సారి ఇలాంటి టాక్ వచ్చిన.. ఎప్పటికప్పుడు కొత్త సీజన్ తో ముందుకు వస్తోంది బిగ్ బాస్ షో. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  Lawyer Kethireddy Jagadeeshwar Reddy Petition To Stop Bigg Boss Show In Andhra Pradesh High Court.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X