For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఇంటి సభ్యులతో బీబీ జోడి జంటల సందడి.. ఒకరిని తీసుకెళతామంటూ!

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేను ఎంతో గ్రాండ్ గా నిర్వహించి సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ సందడి ఇప్పటి నుంచే మొదలైంది. బిగ్ బాస్ హౌజ్ లోకి గత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చి అలరిస్తారని తెలిసిన విషయమే. అయితే ఇదే సీజన్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ అని ఒక డ్యాన్స్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్ హౌజ్ లోకి అందులోని జంటలు ఒక్కొక్కరుగా వచ్చి సందడి చేశారు.

  అనుమానాల నడుమ..

  అనుమానాల నడుమ..

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇంకొక్క రోజులో పూర్తి కానుంది.

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ..

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ..

  ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఇనయా సుల్తానా, అరోహీ రావు, రేవంత్‌‌ ఉన్నారు.

  బీబీ జోడీ జంటలు..

  బీబీ జోడీ జంటలు..

  బిగ్ బాస్ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు ఇంటి సభ్యులను ఫినాలే వారంలోకి పంపించారు. అయితే, వీళ్లలో తాజాగా శ్రీసత్య ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఐదుగురు ఉన్నారు. వీరిని ఎంటర్టైన్ చేసేందుకు బీబీ జోడీలో పాల్గొంటున్న జంటలు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 17 శనివారం నాటి 104వ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

  నిజంగానే రాదే..

  నిజంగానే రాదే..

  హౌజ్ లోకి ముందుగా బోల్డ్ బ్యూటి అషు రెడ్డి, మెహబూబ్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ తో దుమ్ము లేపారు. ఇంటి సభ్యులతో ఏదో టాస్క్ ఆడించినట్లు తెలుస్తోంది. ఇందులో రెడీ అని మెహబూబ్ అంటే.. లవ్ స్పెల్లింగ్ ఏంటని కీర్తిని ఆదిరెడ్డి అడిగాదు. దానికి ఆమె L E V E అని కీర్తి చెప్పింది. దీంతో ఆ పిల్లకు నిజంగానే రాదే అంటూ తలపట్టుకుని కామెడీ చేశాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్, ఇనయా పేర్లు చెప్పి తెగ నవ్వేశారు.

  ఒకరినీ తీసుకెళతాం..

  ఒకరినీ తీసుకెళతాం..

  అనంతరం మెహబూబ్, అషు రెడ్డి కలిసి బ్లాక్ బస్టర్ సాంగ్ కు సూపర్ గా డ్యాన్స్ చేశారు. వీళ్లతోపాటు ఇంటి సభ్యులంతా కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంటెస్టెంట్స్ అరియానా గ్లోరి, అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి మేము వెళ్లిపోయేటప్పుడు మీలో ఒకరిని తీసుకెళతాం అని అవినాష్ అంటే.. బ్రో.. ఎంతమంది ఇదే యాక్టింగ్.. ఇందాక వాళ్లు అదే చేశారని ఆదిరెడ్డి అన్నాడు.

  సీరియస్ యాక్ట్ చేయండి..

  ఆదిరెడ్డి అలా అనడంతో వాళ్లు చెప్పింది మర్చిపోండి కొద్దిసేపు అని అవినాష్ అన్నాడు. దీనికి మేము కూడా యాక్ట్ చేస్తాం. సీరియస్ గా చేయండి, మేము కూడా చేస్తామని ఆదిరెడ్డి అన్నాడు. ఇక్కడికెళ్లి ఈరోజు ఇద్దరినీ తీసుకెళ్తున్నామని అవినాష్ అంటే.. పిల్లోను నేలపై వేసి కొట్టాడు ఆదిరెడ్డి. దీనికి ఇక్కడే దొరికిపోతావ్ అని అవినాష్ పంచ్ వేశాడు. తర్వాత మామా ఏక్ పెగ్ లా అనే పాటకు నవ్వు తెప్పించేలా డ్యాన్స్ చేశాడు అవినాష్.

  English summary
  Bigg Boss Telugu Previous Season Contestants Fun With Bigg Boss Telugu 6 Contestants In December Day 104 Promo 1 Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X