For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: అతని కోసం రకుల్ ప్రీత్ సింగ్ మెసేజ్.. అసలు నిజం బయటకు.. ఒక్కసారిగా హౌజ్ మొత్తం అలా

  |

  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ షో ప్రతి ఏటా ఒక్క సీజన్ చొప్పున సాగిపోతోంది. ఇలా ఐదింటిని రికార్డు స్థాయిలో రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత రంజుగా మారిపోయింది. తాజాగా 12వ వారం మదర్ ఇండియా మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయి హౌజ్ వీడి వెళ్లిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో 9 మంది ఉన్నారు. తాజాగా ప్రసారమైన నవంబర్ 21 సోమవారం నాటి 78వ రోజు 79వ ఎపిసోడ్ వివరాళ్లోకి వెళితే..

   ఒక్కొక్కరిగా బయటకు..

  ఒక్కొక్కరిగా బయటకు..


  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 78 రోజులు 79 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌ కల్యాణ్, సూర్య, గీతూ రాయల్, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు వెళ్లిపోయారు.

  వివిధ ప్రశ్నలు.. డిఫరెంట్ ఆన్సర్స్..

  వివిధ ప్రశ్నలు.. డిఫరెంట్ ఆన్సర్స్..


  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఇప్పటికీ 11 వారాలకు 12 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ప్రేక్షకులలో ఉన్న కొన్ని సందేహాలను కంటెస్టెంట్స్ ముందు ఉంచారు. ఇక వారి ప్రశ్నలకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వివిధ రకాలుగా సమాధానాలు ఇచ్చారు.

  సింపతి కోరుకుంటున్నారా..

  సింపతి కోరుకుంటున్నారా..

  ప్రేక్షకులు మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్న ఇంకొన్ని విషయాలకు సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది అని బిగ్ బాస్ ఇచ్చిన నోటీసు గురించి శ్రీహన్ చెప్పాడు. ఇక కీర్తికి అనుకున్నట్లుగానే మీరు ఆడియన్స్ నుంచి సింపతి కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె సింపతి కోసం ట్రై చేయడం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది.. లైఫ్ లాంగ్ చేయలేం కదా అని కీర్తి సమాధానం ఇచ్చింది.

  కనిపించింది కాబట్టే..

  కనిపించింది కాబట్టే..

  ముందుగా సపోర్ట్ తో కెప్టెన్ అయ్యారు.. తర్వాత మీకు సపోర్ట్ లేదని అన్నారు, అలాగే ఫేవరిటిజం ఉందని ఎలా అన్నారనే ప్రశ్న కీర్తికి ఎదురైంది. దీనికి అవును మొదట్లో సపోర్ట్ తోనే కెప్టెన్ అయ్యాను. అయితే టాస్క్ విషయానికి వస్తే సపోర్ట్ ఉండట్లేదని చెప్పాను.. అంతేకాని పర్సనల్ గా సపోర్ట్ లేదని కాదు. ఇక ఫేవరిటిజం కనిపించింది కాబట్టే అన్నాను, మీరు ఎంత చూస్తున్నారో తెలియదు 24 గంటలు ఇక్కడ ఉన్న మాకు తెలుస్తుంది కదా అని కీర్తి చెప్పింది.

  డిఫరెంట్ క్వశ్చన్..

  డిఫరెంట్ క్వశ్చన్..

  ఇక రాజశేఖర్ కు ఒక విభిన్నమైన ప్రశ్న ఎదురయింది. ఈ ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు అలాగే మీ వెనక మీ గురించి తప్పుగా (బ్యాక్ బిట్చింగ్) మాట్లాడరు అని ఎవరిని నమ్ముతున్నారు అనే ప్రశ్న ఎదురయింది. దీనికి రాజ్ ఈ హౌజ్ లో అందరూ మంచి ఫ్రెండ్సే.. అందరితో మంచి ర్యాపో ఉంది. నా గురించి బ్యాక్ బిట్చింగ్ ఎవరు చేయరనే అనుకుంటున్నాను. ఏది ఉన్నా అందరూ నా ముందే చెప్పేస్తారు అని రాజ్ సమాధానం ఇచ్చాడు.

  ఎవరు మెసేజ్ చేశారు..

  ఎవరు మెసేజ్ చేశారు..

  అయితే రాజ్ ఆన్సర్ కి టీవీ స్క్రీన్ పై ఆ ప్రశ్న అలాగే ఉంది. దీంతో క్వశ్చన్ మారట్లేదు.. ఆన్సర్ సాటిస్ఫైయింగ్ గా లేదని హౌజ్ మేట్స్ అన్నారు. ఈ క్రమంలో ఆ క్వశ్చన్ ఎవరు పంపి ఉండొచ్చనే ఆలోచన ఎదురైంది. ప్రశ్న కింద RKodigampala అని ఉంది. దీనికి R అంటే రాహుల్, రాజ్ అని శ్రీహాన్ అంటే.. రకుల్ అని ఫైమా అంది. దీనికి ఇనయా వాడికి అంతా సీన్ లేదు.. వాడికి రకుల్ ప్రీత్ సింగ్ మెసేజ్ చేస్తుందా ఫైమా అని ఇనయా మాట్లాడింది.

  నీకోసం టైప్ చేసి మరి..

  నీకోసం టైప్ చేసి మరి..

  ఇనయా అలా అనడంతో నువ్ కొంచెం కూడా హ్యాపీగా ఉండనివ్వవు కదా.. తను ఏదో అలా అంది.. వెంటనే అంతా లేదు అని అనడం అవసరమా అని ఇనయా అనే విధానాన్ని రాజ్ ఇమిటేట్ చేశాడు. దీనికి నువ్ ఎంత పెద్ద మోడల్ అయినా.. నీకోసం రకుల్ ప్రీత్ సింగ్ టైప్ చేసి మరి మెసేజ్ పంపిస్తుందా.. ఊహల్లో నుంచి బయటకు రా.. రియాల్టిలో బతుకు అని ఇనయా అంది. రాజ్, ఇనయా మాట్లాడుకుంటే హౌజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. శ్రీహాన్, రేవంత్ అయితే కిందపడి మరి నవ్వారు.

  English summary
  Inaya Sultana Satire On Rajasekhar About Rakul Preet Singh Messages For Him In Bigg Boss Telugu 6 November 21 Day 78 Episode 79 Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X