For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఇంట్లో అస్తమించిన సూర్యుడు.. ఫెమినిస్ట్ ఎలిమినేట్!.. ఊపిరి పీల్చుకున్న ఆడియెన్స్?

  |

  అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభమైన ఓ రియాలిటీ షో భారతదేశంలోకి కూడా అడుగుపెట్టి విజయం సాధించింది. బిగ్ బాస్ పేరుతో మొదటగా హిందీలో ప్రారంభమైన ఈ షో తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది. తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ మోస్ట్ పాపులర్ కావడంతో వరుసగా సీజన్లు తీసుకొస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఆదివారం వచ్చిందంటే చాలు ఒకరు ఎలిమినేట్ బిగ్ బాస్ హౌజ్ నుంచి తమ ఇంటికి వెళ్తారు. ఇప్పటికే ఏడు వారాలకు గాను ఏడుగురు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా అనూహ్యంగా ఫెమినిస్ట్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఆ వివరాళ్లోకి వెళితే..

  మొత్తం 21 మంది కంటెస్టెంట్లు..

  మొత్తం 21 మంది కంటెస్టెంట్లు..

  అత్యంత అంచనాలు, విమర్శల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో మరో వికెట్ పడింది. ఈ ఆరో సీజన్ లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ లు బాలాదిత్య, సుదీప (పింకీ)తోపాటు కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ ఉన్నారు.

  ఏడు వారాలకు ఏడుగురు ఎలిమినేట్..

  ఏడు వారాలకు ఏడుగురు ఎలిమినేట్..

  ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేషన్స్ లలో ఏడు వారాలకు గానూ ఏడుగురు అంటే.. షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్‌ కల్యాణ్ లు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు మిగిలారు. అయితే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఎనిమిదోవారం నామినేషన్లలో మొత్తం 14 మంది ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, వాసంతి, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, ఆర్జే సూర్య ఉన్నారు.

  మారని ఆ ఇద్దరి స్థానాలు..

  మారని ఆ ఇద్దరి స్థానాలు..

  ఈ నామినేట్ అయిన 14 మందిలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ అలాగే ఉండగా.. మిగిలిన సభ్యుల స్థానాలు మారుతూ వచ్చాయి. వీళ్లిద్దరికి దాదాపు 30 శాతం ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఓటింగ్ ముగిసేసరికి చివరి రెండు స్థానాల్లో రాజ శేఖర్, ఆర్జే సూర్య ఉన్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో రాజ శేఖర్ కు గేమ్ పై క్లారిటీ ఉన్నా లేకున్నా.. తనవంతు బాగానే లాక్కొచ్చాడు.

  పర్వాలేదనిపించుకున్న రాజ్..

  పర్వాలేదనిపించుకున్న రాజ్..

  హౌజ్ సర్వైవర్ టాస్క్ లో రాజ్ పర్వాలేదనిపించుకున్నాడు. బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేసిన ఎపిసోడ్ లో ఒక్క చాలు అనే డైలాగ్ చెప్పి నవ్వించిన తీరు అతనికి ప్లస్ అయి ఉండొచ్చు. ఇక ఫెమినిస్ట్ ఆర్జే సూర్య గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంతకుముందు ఆరోహి రావుతో ఆమె వెళ్లిపోయాక ఇనయాతో చేసే రొమాన్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. నిజానికి ఆరోహి వెళ్లడానికి కారణం ఆమె కాదు సూర్యనే అని టాక్ కూడా వినిపించింది.

  సేఫ్ గేమర్ అని ఇనయానే ఎక్కువగా

  సేఫ్ గేమర్ అని ఇనయానే ఎక్కువగా

  ఆరోహి వెళ్లిపోయాక ఇనయాతో ఫ్రెండ్ షప్, ఫెమినిజం అని చెప్పి సూర్య ప్రవర్తించిన తీరు ఆడియెన్స్ కు చిరాకు తెప్పించదనే చెప్పాలి. మళ్లీ అతను సేఫ్ గేమర్, కన్నింగ్ మెంటాలిటీ అని ఈ వారం సభ్యులందరు ఎక్కువగా భావించినట్లు కూడా కొన్ని సీన్లలో చూపించారు.

  సూర్య సేఫ్ గేమర్ అని ఇనయానే ఎక్కువగా అన్న సందర్భాలు ఉన్నాయి. అతన్ని పంపించాలి అని రేవంత్ తో చేపల చెరువు టాస్క్ కు ముందు తెగ మాట్లాడింది. కానీ కెప్టెన్సీకి మాత్రం శ్రీహాన్ కు కత్తి గుచ్చి షాక్ ఇచ్చింది. అయితే అది వేరే విషయం. ఎందుకంటే మొదటి నుంచి ఇనయాకు సూర్య అంటే క్రష్ ఉందని ఆమెనే చాలాసార్లు చెప్పుకొచ్చింది.

  సూర్య ప్రవర్తించిన తీరు..

  సూర్య ప్రవర్తించిన తీరు..

  సూర్యకు బుజ్జమ్మ ఉందని తెలిసి, తప్పేమో అని చాలా ఆగుతున్నట్లు కూడా తెలిపింది. ఇదంతా పక్కనపెడితే బుజ్జమ్మకు సూర్యకు ఎలాంటి రిలేషన్ షిప్ ఉన్నా ఇనయా, ఆరోహితో సూర్య ప్రవర్తించిన తీరు తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఏదో ఓదారుస్తున్నట్లు, ఏడుస్తున్నట్లు చేస్తూ కావాలనే హగ్ చేసుకోవడం వంటివి చేసినట్లు ప్రేక్షకులు భావించినట్లు తెలుస్తోంది.

  ఫెమినిస్ట్ కే కొత్త అర్థం..

  ఫెమినిస్ట్ కే కొత్త అర్థం..

  సూర్య.. ఫెమినిస్ట్ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో సూర్య ప్రవర్తించిన తీరు అఫైర్లలా తోచిందని బయట వినిపిస్తున్న టాక్. అతను ఫెమినిస్ట్ అనే పదానికి కొత్త అర్థం తీసుకొచ్చాడని అంతా షాక్ అయ్యారు. ఇలా అనేక కారణాల మధ్య మిమిక్రీ ఆర్టిస్ట్, ఫెమినిస్ట్, ఆర్జే సూర్య బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేట్ అయినట్లు చాలా గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీంతో అతని అరాచకాలు ఇక చూడల్సిన అవసరం ఉండదని ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

  English summary
  Feminist RJ Surya Eliminated By Host Nagarjuna In Bigg Boss Telugu 6th Season Eight Week Elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X