twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6:నామినేషన్స్ లో కొట్టుకోబోయిన కంటెస్టెంట్లు.. సీజన్ లోకే పెద్ద గొడవ!, బై వన్ గెట్ టు ఆఫరా?

    |

    బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ లో శని, ఆది వారాల్లో హోస్ట్ వచ్చి ఎంటర్టైన్, చురకలు, వార్నింగ్ లు, రివ్యూలు చేస్తారని తెలిసిందే. కానీ అంతకుమించిన ఫన్ సోమవారం రోజున జరిగే నామినేషన్లలో ఉంటుంది. ఊహించని ట్విస్టులు, ఎక్స్ పెక్ట్ చేయని కారణాలతో ఇంటి సభ్యులును నామినేట్ చేయడం, దీంతో వారిపై అరవడం, కొట్లాటకు దిగడం వంటివి చాలానే జరుగుతాయి. అలాగే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి ఇచ్చే ఎంటర్టైన్ మెంట్ కన్నా సోమవారం జరిగే నామినేషన్లు రచ్చ రంభోళ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా ప్రసారమైన అక్టోబర 10 సోమవారం నాటి 36వ రోజు 37వ ఎపిసోడ్ లో వాడివేడిగా నామినేషన్లు జరిగాయి.

    ముఖాలపై ఫోమ్ కొట్టి నామినేట్..

    ముఖాలపై ఫోమ్ కొట్టి నామినేట్..

    బిగ్ బాస్ తెలుగు 6 ఆరో వారం నామినేషన్లు అక్టోబర్ 10 అంటే సోమవారం వాడివేడిగా జరిగాయి. నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల ముఖాలపై ఫోమ్ (నురగ) కొట్టి కారణాలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. ఈ క్రమంలో అందరి కంటే ఎక్కువ నామినేషన్లు ఆదిరెడ్డికి పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఆయన ఎంటర్టైన్ మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని నామినేట్ చేశారు. దీనికి ఆయన శివాలెత్తిపోయాడు.

    ఆదిరెడ్డి ఎంటర్టైన్ మెంట్ లో తోపు..

    ఆదిరెడ్డి ఎంటర్టైన్ మెంట్ లో తోపు..

    ఎంటర్టైన్ మెంట్ చేయడం లేదని అంటున్నారు కదా.. నేను వెళ్తూ వెళ్తూ చాలా మంది కంటే బెటర్ గా డ్యాన్స్ వేసి చూపిస్తాను. ఆదిరెడ్డి ఎంటర్టైన్ మెంట్ లో తోపు అనిపిస్తానని శపథం కూడా చేశాడు. అనంతరం వచ్చిన మెరీనా కూడా ఆదిరెడ్డిని నామినేట్ చేయడంతో అసలు గొడవ స్టార్ట్ అయింది. అంతకుముందే రోహిత్ (మెరీనా భర్త) కూడా ఎంటర్టైన్ మెంట్ పేరు చెప్పి ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు.

    నామినేట్ చేయాలనుకున్న రీజన్ ఇదికాదు..

    నామినేట్ చేయాలనుకున్న రీజన్ ఇదికాదు..

    ఇక మెరీనా వచ్చి నామినేట్ చేయడంతో బై వన్ గెట్ టు ఆఫర్ ఇచ్చార కదండీ.. ఒకరికేస్తే ఇద్దరూ (మెరీనా, రోహిత్) వచ్చేశారు అని పంచ్ వేసినట్లు మాట్లాడాడు ఆదిరెడ్డి. దీంతో మెరీనా.. మీకు చాలా అనిపిస్తాయి కానీ, నేను నామినేట్ చేయాలనుకున్న రీజన్ ఇదికాదు. అసలు మీరు కెప్టెన్ గా సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా అని అడిగింది మెరీనా. దీనికి ఆదిరెడ్డి.. నేను పనిష్మెంట్ ఇవ్వడంలోనే ఫెయిల్ తప్పా.. మిగతా అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను అని చెప్పాడు.

    అడిగినా కూడా సరే చేయలేదు కదా..

    అడిగినా కూడా సరే చేయలేదు కదా..

    కిచెన్ లో ఇద్దరం (మెరీనా, సుదీప) ఇబ్బంది పడుతుంటే.. మీరు ఏం చేశారు.. అడిగినా కూడా సరే చేయలేదు కదా అని చెప్పింది మెరీనా. దీనికి మీరు అప్పుడు అడగాలి కదా.. నాగార్జున గారు చెప్పినట్లు నేను కెప్టెన్ గా ఫెయిల్ అయన మాట నిజం, కానీ మీ ఇద్దరితో జరిగిన పాయింట్ లో తప్పు మీదే.. నాది కాదు అని గట్టిగా అరిచాడు. ఇంతలో రోహిత్ ఉండి నేను మాట్లాడొచ్చా.. అని అన్నాడు. శుక్ర, శని వారాల్లో రూల్స్ ఏంటి అని అడిగాడు రోహిత్. దీంతో బ్రో నేను చెప్పేది మీకు అర్థం కాలేదా.. అని గట్టిగా అన్నాడు ఆదిరెడ్డి.

    వైఫ్ తో కలిసి ఆడటం కాదు..

    వైఫ్ తో కలిసి ఆడటం కాదు..

    దానికి రోహిత్.. నువ్ వాయిస్ రైజ్ చేస్తే నేను చేస్తా అని గట్టిగా అంటే.. రైజ్ చేయ్.. రైజ్ చేయ్.. అంటూ రోహిత్ పైకి దూసుకు వచ్చాడు ఆదిరెడ్డి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఆన్సర్ చేయండి అనుకుంటూ రోహిత్ మాట్లాడితే.. నీ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడు.. వైఫ్ తో కలిసి ఆడటం కాదు.. అంటూ రెచ్చిపోయాడు ఆదిరెడ్డి. దీనికి ఇది నా పాయింట్ అంటూ రోహిత్ కూడా గట్టిగానే అరిచాడు. తర్వాత నేను చెప్పేది విను అని రోహిత్ అనడంతో అక్కడే నిలబడి మాట్లాడు అని అన్నాడు ఆదిరెడ్డి. ఫస్ట్ నువ్ వెళ్లి నీ ప్లేస్ లో బ్యాక్ కు వెళ్లి నిలబడు అని రోహిత్ అన్నాడు.

    నామినేట్ చేస్తే కోపం వస్తుందా..

    నామినేట్ చేస్తే కోపం వస్తుందా..


    నేను బ్యాక్ కు వెళతానో.. ఏం చేస్తానో.. నామినేట్ చేయకూడదా.. నామినేట్ చేస్తే కోపం వస్తుందా.. ఏం మాట్లాడుతున్నారు అంటూ మళ్లీ రోహిత్ పైకి దూసుకువచ్చాడు ఆదిరెడ్డి. దీంతో రోహిత్ మరింత సీరియస్ అయ్యాడు. కోపంగా ఆదిరెడ్డిని చూస్తూ అతనికి పైకి వచ్చాడు రోహిత్. నామినేట్ చేయమని చెప్పడానికి మీరెవరూ అంటూ పెద్ద కళ్లతో చాలా కోపంగా చూశాడు రోహిత్. ఆల్ మోస్ట్ కొట్టుకుంటారా అన్నట్లుగా అనిపించింది. రోహిత్ చూసే చూపులు, ఆదిరెడ్డి దూసుకురావడం చూస్తే వీళ్లిద్దరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.

    వైఫ్ ఉంది సపోర్ట్ చేస్తున్నాడు..

    వైఫ్ ఉంది సపోర్ట్ చేస్తున్నాడు..

    తర్వాత వాసంతి, రేవంత్ వచ్చి ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. ఏం పాయింట్ మాట్లాడుతున్నావ్ పో.. అని ఆదిరెడ్డి అంటే.. వైఫ్ ఉంది సపోర్ట్ చేస్తున్నాడు అని మాటలు ఏంటి అని రోహిత్ సీరియస్ గానే అన్నాడు. ఆ పాయింట్ ఒప్పుకోండి. మీరు ఇద్దరూ కలిసే ఆడుతున్నారు అని ఆదిరెడ్డి మళ్లీ అన్నాడు. చివరికీ వీళ్లు (ఆదిరెడ్డి) మాట్లాడనీయరు కానీ.. నువ్ నామినేట్ చేశావ్ గా వచ్చేసేయ్ అని మెరీనాతో రోహిత్ అన్నాడు.

    మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడితే..

    మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడితే..

    ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని ఆదిరెడ్డికి చివరిగా పంచ్ వేసి వచ్చేసింది మెరీనా. ఆది రెడ్డి మళ్లీ ఏదో అనాలనుకుని ఆగి అలా చూస్తుండిపోయాడు. వీళ్ల గొడవ చూస్తే సీజన్ లోకే పెద్ద గొడవలా తోచింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 ఆరో వారం నామినేషన్లలో కీర్తి భట్, ఆదిరెడ్డి, గీతూ రాయల్, బాలాదిత్య, రాజశేఖర్, శ్రీహాన్, సుదీప, మెరీనా, శ్రీసత్య మొత్తం 9 మంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 6 ఐదోవారం చలాకి చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

    English summary
    Adireddy Rohit Fight In Sixth Week Nominations Of Bigg Boss Telugu 6th Season. Bigg Boss Telugu 6 October 10 2022 Day 36 Episode 37 Highlights And 9 Contestants In Sixth Week Nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X