Don't Miss!
- News
ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంచలనం: కేంద్రానికి సవాల్, అరవింద్‌కు హెచ్చరిక
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Bigg Boss Telugu 6: నీకు శ్రీసత్యకు ఏంటీ.. అప్పుడు అలా అనిపించిందంటూ షాకింగ్ గా శ్రీహాన్!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయిన బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి సింగర్ రేవంత్ టైటిల్ ఫేవరెట్ గా నిలిచాడు. అలాగే అందరూ ఊహించిన విధంగానే టైటిల్ విజేతగా నిలిచి బగ్ బాస్ తెలుగు 6 సీజన్ ట్రోఫీ అందుకున్నాడు.
గోల్డెన్ బ్రీఫ్ కేస్, రూ. 40 లక్షల డబ్బు వంటి నాటకీయ పరిణామాలతో శ్రీహాన్ విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ ను ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ.

తల్లిదండ్రులు చెప్పడంతో..
బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ ఫినాలే ఎంతో ఆసక్తిగా సాగింది. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవ్వగా చివరిగా రేవంత్ అండ్ శ్రీహాన్ మిగిలారు. వారి ముందు రూ. 40 లక్షల టెంప్టింగ్ ఆఫర్ ను హోస్ట్ నాగార్జున ఉంచారు. శ్రీహాన్ ను ఎక్స్ కంటెస్టెంట్స్ ఒపినీయన్ తీసుకోమన్నారు. చివరిగా శ్రీహాన్ తల్లిదండ్రులు ఆ ఆఫర్ ను తీసుకోమ్మని చెప్పడంతో శ్రీహాన్ అంగీకరించాడు.

రూ. 40 లక్షలు తీసుకోకుంటే..
అలా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి రూ. 40 లక్షలు అందుకున్నాడు శ్రీహాన్. అయితే రేవంత్ ను విన్నర్ గా ప్రకటించిన తర్వాత అతి తక్కువ మార్జిన్ ఓటింగ్ తో టాప్ 1లో శ్రీహాన్, టాప్ 2 రేవంత్ ఉన్నాడు అని నాగార్జున తెలిపారు. అంటే.. ఆ రూ. 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకోకుంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అసలు విజేతగా శ్రీహాన్ నిలిచేవాడన్నమాట. రూ. 40 లక్షలు తీసుకుని టైటిల్ విన్నర్ ను శ్రీహాన్ కోల్పోయినట్లు అర్థం అవుతోంది.

యాంకర్ శివతో శ్రీహాన్ ఇంటర్వ్యూ..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినట్ అయిన ఇంటి సభ్యులను బీబీ కేఫ్ ద్వారా నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 18 ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ముగిసింది. ఈ ఆరో సీజన్ లో రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ ను తాజాగా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ. బీబీ కేఫ్ కి హాజరైన రేవంత్ ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు శివ.

ఇంకా చాలా ఉన్నాయి..
బిగ్ బాస్ చరిత్రలోనే విన్నర కన్నా రన్నర్ ఎక్కువ డబ్బు తీసుకురావడం జరిగిందని చెప్పిన యాంకర్ శివి.. శ్రీహాన్ కు స్వాగతం పలికాడు. శ్రీహాన్ ఎంట్రీ ఇవ్వగానే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. శ్రీహాన్.. నీకు కంగ్రాచ్యులేషన్స్ దేనికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఓట్లు ఎక్కువ వచ్చినందుకా.. విన్నర్ కన్నా ఎక్కువ మనీ తీసుకొచ్చినందుకా.. ఆ ఫ్లాట్ లో 50 శాతం అంటూ శివ చెబుతుంటే.. ఇంకా చాలా ఉన్నాయి అని శ్రీహాన్ అన్నాడు.

కుడిదా.. ఎడమదా అనుకుంటున్నాను..
ఇంటికెళ్లాకా సిరి చేతిలో నీ పరిస్థితి ఏంటంటావ్ అని యాంకర్ శివ అడిగితే.. దేనికి అని డౌట్ గా అడిగాడు శ్రీహాన్. దానికి డబ్బులు తీసుకొచ్చావ్ కదా.. ఇక్కడికి వచ్చింది విన్నర్ అయేందుకు కదా.. అని శివ అంటే.. అవునా.. ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది అని అయోమయంగా అన్నాడు శ్రీహాన్. మరి షూతోనా లేదా నీ సైజ్ కి బెల్ట్ ఆ అని శివ అంటే.. నువ్ అది అనుకుంటున్నావ్ నేనైతే.. కుడిదా ఎడమదా అనుకుంటున్నాను అని శ్రీహాన్ అన్నాడు.
నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు..
ఇప్పుడు నీకు శ్రీసత్యకు ఏంటీ బ్రో.. అన్నా చెల్లెల్లా ఇదా అని యాంకర్ శివ అడిగితే.. హేయ్.. అని శ్రీహాన్ అన్నాడు. దీనికి సిరి.. చూశావా అని శివ అన్నాడు. దీంతో.. నువ్ ఫిక్స్ అయిపోయావ్ లే.. నువ్ ఏమైనా చెప్పుకో.. నీ వర్షన్ నీది.. అని శ్రీహాన్ అన్నాడు. హౌజ్ లో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని అడిగితే.. రేవంత్ అండ్ శ్రీసత్య అని చెప్పాడు శ్రీహాన్.
కానీ వాళ్లు నీకెందుకు బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ ఇవ్వలేదని శివ అడిగాడు. ఒక మనిషిలో ఒకరికి ఉన్న ఒపినీయన్ ను మనం మార్చలేం. నాకు అప్పుడు ఒక క్వశ్చన్ అనిపించింది కానీ, అప్పుడు అడిగితే ఇబ్బంది పడతారని అడగలేదని శ్రీహాన్ అన్నాడు.