Don't Miss!
- Finance
Adani FPO: వెనక్కి తగ్గేదే లే అంటున్న అదానీ.. మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా..?
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bigg Boss Telugu 6: ఇలా అయితే మరో సీజన్ లేనట్లే.. పరిస్థితి ఎంత చెత్తగా ఉందంటే..
బిగ్ బాస్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతోంది. తెలుగులో మొదటి సీజన్ మొదలైనప్పుడు ఆ తర్వాత నాలుగు సీజన్స్ వరకు కూడా బాగానే కొనసాగిన బిగ్ బాస్ ఇప్పుడు 6వ సీజన్ కు వచ్చేసరికి మాత్రం తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుంది అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. రేటింగ్స్ అయితే మరి దారుణంగా పడిపోతున్నాయి.
కొన్నిసార్లు ఒక్కసారిగా రేటింగ్స్ లేస్తున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఒకసారిగా పడిపోతున్నాయి. దీంతో బిగ్ బాస్ షో నమ్మకం లేని పరిస్థితుల్లో కొనసాగుతోంది. అనిపిస్తోంది ఇక ఇటీవల టికెట్ టూ ఫినాలే టాస్క్ అయితే మరీ దారుణంగా కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా ఒక నిర్ణయం పై అయితే తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మరీ దారుణంగా ఉంది
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదలైనప్పుడే అసలు పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ సెలక్షన్ అయితే మరీ దారుణంగా ఉంది అని అసలు ఇందులో ముగ్గురు నలుగురు తప్పితే మిగతా వారు మొత్తం కూడా కొత్తవారు కావడం, వారు టెలివిజన్ ఆడియన్స్ కు అంతగా తెలియకపోవడం వలన రేటింగ్స్ తక్కువగా వచ్చాయి.

చాలా నీరసంగా..
పోనీ నాగర్జున వచ్చిన వీకెండ్స్ అయినా ఆయన రేటింగ్ పెరుగుతుందా అంటే అక్కడ కూడా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. గత మూడు వారాల వరకు కాస్త నిలకడగా ఉన్న రేటింగ్స్ మళ్లీ ఒకసారి తగ్గు ముఖం పట్టాయి. ఇక రేవంత్ కోసం చూసే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారం అయితే షో చాలా నీరసంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఏ మాత్రం కరెక్ట్ గా లేవు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి.

గేమ్ రుల్స్ బ్రేక్
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొన్నిసార్లు వారికి ఇష్టం వచ్చినట్లు ఆటను కొనసాగించినప్పటికీ కూడా రూల్స్ గురించి కనీసం గుర్తుకు చేస్తూ ఉండకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆ మధ్య గీతు రాయల్ కొన్ని వారాలపాటు ఒకే తరహాలో గేమ్ రుల్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ఇక ఆమెపై నెగెటివిటీ మరింత పెరగడం వలన బిగ్ బాస్ రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపించింది. అందుకే ఆమెను చివరకు తీసేయాల్సి వచ్చింది.

చెత్తగా ఉంది
అయితే టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ లో కూడా బిగ్ బాస్ అసలు ఏ విధమైన ప్లాన్ వేసాడు అనేది కూడా కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే చెత్తగా ఉంది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే పాయింట్స్ పట్టికలో టాప్ లో ఆది రేవంత్ శ్రీహన్ ఉన్నప్పటికీ తదుపరి రౌండ్ కోసం మళ్ళీ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం ఏమిటో.. అలంటిది మళ్ళీ పాయింట్స్ ఇచ్చి ఏం లాభం. తదుపరి రౌండ్ కోసం గెలిచి కూడా వృధా అయినట్లే లెక్క.

మాకు ఏమీ తెలియదు
ఫైనల్ గా ఎపిసోడ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ లతో అందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండాలి. కానీ తదుపరి రౌమ్డ్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీరే నిర్ణయాలు తీసుకోండి అని, మాకు ఏమీ తెలియదు అన్నట్లుగా మౌనంగా ఉంటున్నాడు.

ఇలానే కొనసాగితే రేటింగ్స్ రావు
ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటే ఇక బిగ్ బాస్ ఎందుకు అనే విధంగా సందేహాలు కూడా వస్తున్నాయి. అసలు బిగ్ బాస్ ఎందుకు ఉన్నాడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు అనే విధంగా నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా బిగ్ బాస్ ఇలానే కొనసాగితే రేటింగ్స్ రావు. అలాగే తదుపరి సీజన్ రావడం కూడా డౌటే.. అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి.