For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: టాప్ జబర్దస్త్ కమెడియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వగలరా?

  |

  బిగ్ బాస్ 6వ సీజన్ మొదట్లో కొంత నీరసంగా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. మొదటి ఎపిసోడ్ కు దారుణమైన రేటింగ్స్ రావడంతో ఆ తర్వాత బిగ్ బాస్ ఒక్కసారిగా ప్రణాళికలు మార్చేశాడు. దాంతో పాటు నాగార్జున కూడా ఆగ్రహంగా క్లాస్ తీసుకోవడంతో రేటింగ్స్ మళ్లీ మూడవారం ట్రాక్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు త్వరలోనే ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రణాళికలు రచించినట్లు సమాచారం. అది కూడా టాప్ జబర్దస్త్ కమెడియన్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

  ట్రోలింగ్స్

  ట్రోలింగ్స్

  తెలుగు బిగ్ బాస్ షో గత సీజన్స్ అన్నిటికంటే కూడా ఈసారి చాలా నిరాశపరిచే విధంగా మొదలైంది. అసలు కంటెస్టెంట్స్ విషయంలోనే చాలామంది నిరాశకు గురయ్యారు. కొంత పేరు ఉన్న సెలబ్రిటీలను తీసుకురాకుండా ఎవరెవరో కొత్తవారిని తీసుకువచ్చారు అనే విధంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఈసారి బిగ్ బాస్ నిలదొక్కుకోవడం కూడా కష్టమే అని మధ్యలోనే ఆగిపోతుంది అనే విధంగా కూడా మరికొందరు ట్రోల్లింగ్ చేశారు.

  మిత్రులు కూడా శత్రువులుగా

  మిత్రులు కూడా శత్రువులుగా

  ఇక మొత్తానికి బిగ్ బాస్ షో అయితే గతవారం కంటే ఈసారి మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పుడైతే నాగార్జున గట్టిగా క్లాస్ ఇచ్చారు. అప్పటినుంచి కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా నామినేషన్స్ లో కూడా అన్నిటిని ఎదుర్కొంటున్నారు. కెప్టెన్సీలో అయితే మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు.

  వైల్డ్ కార్డ్ ఎంట్రీ

  వైల్డ్ కార్డ్ ఎంట్రీ

  అయితే బిగ్ బాస్ 2ను మరో రేంజ్ తీసుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఓవర్గ వారి నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలైతే బిగ్ బాస్ కు మొదటి నుంచి కూడా ఇదే తరహా ఆలోచన ఉంది. అందుకే ముందుగానే ప్లానింగ్ చేసుకొని మరి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం స్టార్ సెలబ్రిటీని సిద్ధం చేసినట్లు సమాచారం.

  గతంలో జబర్దస్త్ స్టార్స్

  గతంలో జబర్దస్త్ స్టార్స్

  గతంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా అతను మంచి కామెడీ టైమింగ్ తో కూడా బిగ్ బాస్ రేటింగ్ పెంచేందుకు దోహదపడ్డాడు. అలాగే ఆ మధ్య ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ కు పిలిచారు. అతను కంటెస్టెంట్స్ పై ఇచ్చిన రివ్యూలు కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి.

  సుధీర్ కు అంత రెమ్యునరేషన్?

  సుధీర్ కు అంత రెమ్యునరేషన్?

  ఇక ఈసారి 6వ సీజన్ రేటింగ్ కాస్త తక్కువగా ఉండటంతో ఎలాగైనా భారీ స్థాయిలో ఖర్చు చేసి అయినా సరే ఒక జబర్దస్త్ కమెడియన్ రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అతను మరెవరో కాదు సుడిగాలి సుదీర్ అని ప్రస్తుతం ఒక టాక్ అయితే కొనసాగుతోంది. గతంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు అతని కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ సుధీర్ రిజెక్ట్ చేశాడు.

  మరి ఇప్పుడు అతను ఒక రోజుకు లక్షకు పైగానే పారితోషికం తీసుకుంటున్నాడు. మరి అలాంటి కంటెస్టెంట్ ఇలాంటి షోకు రావాలంటే అంతకంటే ఎక్కువ డిమాండ్ చేయకుండా ఉండడు. మరి బిగ్ బాస్ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

  English summary
  Bigg boss telugu 6 wild card entry planning with top jabardasth comedian
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X