Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ కొత్త హోస్ట్ గా ఆ హీరో.. నాగార్జున రికమండ్ చేసింది ఎవరినంటే?
105 రోజులు ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ డిసెంబర్ 18 ఆదివారంతో పూర్తయింది. సీజన్ మొదటి నుంచే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సింగర్ రేవంత్ నే టైటిల్ విన్నర్ గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ టైటిల్ విన్నర్ ను అనౌన్స్ చేసే క్రమంలో ఫినాలే ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలిచారు. టాప్ 2లో రేవంత్, శ్రీహాన్ ఉండగా.. రూ. 40 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో శ్రీహాన్ విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ రియాలిటీ షోకి ప్రధాన హైలెట్ గా నిలిచేది హోస్ట్. సీజన్ 3 నుంచి ఇప్పటివరకు హోస్ట్ గా అలరించిన టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఆ బాధ్యతకు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చే హోస్ట్ ఎవరా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

బిగ్ బ్రదర్ పేరుతో షో..
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది.

తనదైన యాక్షన్ తో..
బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ కు మొదటగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. హోస్ట్ చేయడమే కాకుండా తనదైన మాట, కామెడీ, యాక్షన్స్ తో సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షోను వరుసపెట్టి సీజన్లతో ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లకు ప్రధాన హైలెట్ గా నిలిచేది హోస్ట్.

4 టీవీ, 1 ఓటీటీ సీజన్లకు హోస్ట్ గా..
బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆయన యాంకరింగ్ తో బిగ్ బాస్ ను స్థాయిని పెంచారు. దీంతో ఈ సీజన్ అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందగలిగింది. అలాగే రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇది కూడా చాలా పాపులర్ అవడంతో పాటు రేటింగ్ పరంగా కూడా దూసుకుపోయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి తాజాగా పూర్తయిన ఆరో సీజన్ (ఒక నాన్ స్టాప్ సీజన్) వరకు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పలు విమర్శలు సైతం..
అనూహ్య పరిణామాలతో దూసుకుపోయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు పూర్తయింది. డిసెంబర్ 18 ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే నిర్వహించి సీజన్ 6 విన్నర్ ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మొత్తంగా 105 రోజులు సాగిన ఈ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ప్రయాణంలో హోస్ట్ గా నాగార్జున జర్నీని బిగ్ బాస్ చూపించారు. తనదైన స్టైల్ లో హోస్ట్ గా మెప్పించారు నాగార్జున. అయితే కొన్నిసార్లు హోస్ట్ గా పలు విమర్శలను సైతం ఆయన ఎదుర్కొన్నారు.

నాగార్జునకు నచ్చజెప్పుకుంటూ..
హౌజ్ లో కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఇదంతా బీబీ టీమ్ నాగార్జునకు పూర్తి వివరాలు చెప్పకపోవడంతోనే అలా జరిగి ఉంటుందని ఒక టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో బీబీ మ్యానేజ్ మెంట్ తీరు నచ్చని నాగార్జున ఫైనల్ గా హోస్టింగ్ కు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎప్పటినుంచో మానేస్తా అని నాగార్జున చెప్పిన బీబీ మేనేజ్ మెంట్ మీరు బ్రాండ్ అని, మీరు ఉంటేనే బాగుంటుందని నచ్చజెప్పుకుంటూ వచ్చారట.

హోస్ట్ గా రానా దగ్గుబాటి..
అయితే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారంలో ఇనయా ఎలిమినేట్ కావడం, హౌజ్ లో కొందరి కోసం పాలిటిక్స్ ప్లే చేయడం తదితర విషయాలు నచ్చని నాగార్జున ఇక నుంచి హోస్టింగ్ చేయనని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో తర్వాత సీజన్ కు అంటే బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా వచ్చేది ఎవరనే అంశం ఆసక్తిగా మారింది. అయితే తర్వాత హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని టాక్ వినిపిస్తోంది.

దాదాపుగా హోస్టింగ్ కు అంగీకారం..
అంతేకాకుండా రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేశారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. అయితే రానాకు ఒక సర్జరీ కారణంగా సినిమాలకు కొన్ని నెలలు దూరం కానున్నాడట. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చన్న ఉద్దేశంతో రానా దగ్గుపాటి దాదాపుగా ఒప్పుకున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో బీబీ 7 వచ్చేవరకు ఆగాల్సిందే.

బాలకృష్ణ కూడా..
ఇదివరకు నెం 1 యారి అనే టాక్ షోకు రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టాక్ షోకి ఉన్న అనుభవం బిగ్ బాస్ కి బాగానే ఉపయోగపడొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి మాత్రమే కాకుండా బీబీ 7కు హోస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రానున్నాడని మరో వార్త కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకుపోతున్న బాలయ్య బాబు వస్తే బిగ్ బాస్ షోకి మరింత క్రేజ్ రావడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.