For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 7లోకి మొన్న విలన్, ఇప్పుడేమో హీరో.. ఆ సీజన్ కంటెస్టెంట్స్ తో బిగ్ స్కెచ్!

  |

  తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేలా ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. వరుసపెట్టి సీజన్లతో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడు తర్వాతి సీజన్ ఎప్పుడు వస్తుందా అనేంతలా అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇక ఒక సీజన్ నడుస్తుండగానే తర్వాతి సీజన్ కోసం ప్లాన్ చేస్తుంది బీబీ టీమ్. ఇక ఇటీవల బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ పూర్తి కాకముందుగానే ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే మాజీ కంటెస్టెంట్స్, హీరోలు, విలన్లు, సీరియల్ యాక్టర్స్ ను తీసుకుంటున్నారు బీబీ నిర్వాహకులు.

   2017లో తొలిసారిగా..

  2017లో తొలిసారిగా..

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి భారతదేశంలోకి బిగ్ బాస్ గా వచ్చింది. మొదట్లో ఎలా ఉంటుందో అనుకున్న ఈ రియాలిటీ షోపై తర్వాత ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపించారు. దీంతో వివిధ భాషల్లోకి తీసుకురావడం స్టార్ట్ చేశారు నిర్వాహకులు. అలా తెలుగులో 2017లో తొలిసారిగా మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ షో తెలుగులో కూడా బాగా క్లిక్ అయింది.

  ఎన్నడు చూడని విధంగా..

  ఎన్నడు చూడని విధంగా..

  అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ అయినా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా సీజన్లన్నీ మంచి రేటింగ్ సొంతం చేసుకున్నాయి. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోనూ గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు.

   రన్నరప్ గా శ్రీహాన్..

  రన్నరప్ గా శ్రీహాన్..

  ఎన్నో ట్విస్టులతో, అనుకోని సంఘటనలతో, అరుపులు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ ఎదురైంది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ప్రేక్షకుల ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచాడు.

  హోస్ట్ గా ఎవరు..

  హోస్ట్ గా ఎవరు..

  అనేక కారణాలతో ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కాగా.. హోస్ట్ గా నాగార్జున తప్పుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో తర్వాత సీజన్ అయిన బిగ్ బాస్ తెలుగు 7కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని ఒక టాక్ వినిపిస్తే.. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హోస్ట్ చేయనున్నాడని మరో వార్త వినిపిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం అందితే.. బాలకృష్ణకు బీబీ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

   ఆరో సీజన్ తరహాలోనే..

  ఆరో సీజన్ తరహాలోనే..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైన ఏడో సీజన్ ను హిట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాలికలు రచిస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను ఆరో సీజన్ లాగే సెప్టెంబర్ లో ప్రారంభించాలను ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్.

  అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో..

  అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో..

  ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కంటెస్టెంట్, హీరో, నటుడు నవదీప్ ను అప్రోచ్ అయిందట బీబీ టీమ్. మొదటి సీజన్ లో తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించాడు హీరో నవదీప్. అప్పుడప్పుడు టాస్క్ లో భాగంగా మాత్రం మిగతా ఇంటి సభ్యులకు చిరాకు తెప్పించే పనలు చేశాడు. కానీ మిగతా సమయంలో తనదైన కామెడీతో ఫన్ అందించాడు నవదీప్. ఇప్పుడు బీబీ 7 కోసం అతన్ని తీసుకుంటే కలిసొస్తుందని బిగ్ బాస్ మేనేజ్ మెంట్ భావిస్తోందట. మరి నవదీప్ ఎస్ చెబుతాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవలే సినిమాల్లో విలన్ గా రాణించిన, ఇదే తొలి సీజన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణను బీబీ టీమ్ అప్రోచ్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 7 Season Team Approaching Actor And Bigg Boss Telugu 1 Season Contestant Navdeep For Participating As Contestant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X