Bigg Boss Telugu 7th Week Voting: పికెల్ పాప రమ్య మోక్షకు షాకిచ్చేలా ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటి వరకు 6 వారాలను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు.. ఏడో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దివారాలుగా ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతుండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో 7వ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

ఏడుగురు ఎలిమినేట్
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం శ్రష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియా శెట్టి, నాలుగో వారంలో హరిత హరీశ్, ఐదో వారంలో ఆశా షైనీ, దమ్ము శ్రీజ, ఆరో వారంలో భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో సంజన గల్రానీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్, తనూజ పుట్టస్వామి, దివ్య నిఖిత, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్‌లతో పాటు కొత్తగా వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులు ఆయేషా జీనత్, రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, దివ్వెల మాధురితో కలిపి 14 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. వీరిలో ఒకరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు హౌస్‌ను వీడనున్నారు.

Bigg Boss Telugu 7th Week Voting Ramu Rathod and Ramya Moksha Kancharla are in Danger Zone

నామినేషన్స్‌లో 8 మంది
ఈ వారం ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వారు రమ్య మోక్ష కంచర్ల, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. కెప్టెన్లుగా గెలిచిన సుమన్ శెట్టి, గౌరవ్‌ గుప్తాలు నామినేషన్స్ నుంచి మినహాయింపు పొందిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే...

డేంజర్ జోన్‌లో నలుగురు
గత కొన్నిరోజులుగా టాస్క్‌ల్లో దుమ్మురేపుతున్న పడాల పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టాప్ ప్లేస్‌లోకి రాగా.. ఎప్పుడూ రేస్‌లో ముందుండే తనూజ వెనుకబడింది. పవన్ కళ్యాణ్‌కు 32.3 శాతం ఓట్లు రాగా.. తనూజకు 24.39 శాతం ఓటింగ్ వచ్చింది. ఆ తర్వాత సంజన గల్రానీ 9.44 శాతం, రీతూ చౌదరికి 8.1 శాతం, రమ్య మోక్షకు 6.99 శాతం, దివ్య నిఖితకు 6.54 శాతం, రాము రాథోడ్‌‌కు 6.33 శాతం, సాయి శ్రీనివాస్‌కు 5.91 శాతం ఓటింగ్ లభించింది. దాంతో ప్రస్తుతానికి రమ్య మోక్ష, దివ్య నిఖిత, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్‌లు డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉందని అంటున్నారు. వీరు నలుగురికి కొన్ని పాయింట్ల తేడాతో ఓకే రేటింగ్ రావడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా జీనత్‌ వ్యక్తిగత కారణాలతో హౌస్‌ను వీడాలని నిర్ణయించుకునట్లుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆయేషా ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని అనుకుంటున్నారట. చికిత్స ముగిసిన తర్వాత ఆమె తిరిగి హౌస్‌లో అడుగుపెడతారని చెబుతున్నారు. అయితే ఆయేషా చికిత్సకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. దాంతో ఆయేషా సెల్ఫ్ ఎలిమినేట్ అయితే, నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X