ఆమెతో బిగ్ బాస్ 8 విన్నర్ లవ్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా టీవీ నటీనటులు సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. తమకు ఉన్న క్రేజ్ ను మరింతగా పెంచుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నెక్ట్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం కానుందనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ కు ముందు అగ్ని పరీక్ష ద్వారా రాబోయే సీజన్ పై మరింతగా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు విన్నర్ నిఖిల్ మాలియక్కల్ తన వ్యక్తిగత విషయాలపై తాజాగా స్పందించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా నిఖిల్ మాలియక్కల్ తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో హౌజ్ లో టాస్క్ లు ఆడి బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ గా టైటిల్ ను గెలుచుకున్నారు. అయితే ఆయన లవ్ స్టోరీపై తాజాగా స్పందించారు. బుల్లితెర నటి కావ్య శ్రీతో తనకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడారు. కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లపై రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

నిఖిల్ మాలియక్కల్, నటి కావ్య శ్రీతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటని నిఖిల్ ను ఇంటర్వ్యూయర్ ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మేమైతే ఎక్కడ ఎక్కడ చెప్పలేదు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లా కూడా కాదు. కేవలం స్నేహపూర్వకంగా ఉంటాం. కానీ చాలా మంది ప్రచారం చేశారు కాబట్టి, అలా జరిగిపోయింది. అంతే తప్ప అది నిజం కాదు. ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదు. ఇక బుల్లితెరపై సీరియల్స్ లో మేల్, ఫీమేల్ కొంచెం మంచిగా కలిసి యాక్ట్ చేస్తే ఓ ఎందిరా వీళ్లు లవర్స్ లా ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంటుంది. ఆడియెన్స్ కూడా అలా ఫిక్స్ అవుతూ ఉంటారు.
కెమిస్ట్రీ బాండింగ్ ద్వారా వారికి అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. నేను, నా ఫ్రెండ్ అయితే ఎలా మాట్లాడిన ఏం కాదు, ఎలాంటి తమాషా చేసినా ఏం కాదు. ఎందుకంటే ఆ కెమిస్ట్రీ అక్కడ లేదు కాబట్టి ఏం తప్పుబట్టారు. అయితే ఫీమేల్ తో నటించే సమయంలో కేవలం సెట్ లో పని చేసే వారికే అక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఆడియెన్స్ కు మాత్రం తెలియదు మనం ఎలా ఉంటాం ఏం అనేది తెలియదు.
కానీ కొంత మంది అలా అనుకుంటే ఏం కాదు. చాలా మంది అనుకుంటే ప్రాబ్లం. ప్రస్తుతం మేము ఇద్దరం వేరే ప్రాజెక్ట్స్ ల్లో బిజీబిజీగా ఉన్నామని తెలిపారు. దీంతో డేటింగ్ రూమర్లకు ఇలా అడ్డుకట్ట వేశారు. ఇక నిఖిల్, కావ్య శ్రీ బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో జంటగా కలిసి నటించారు. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కావ్య శ్రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











