నా దెబ్బకి ఆ హీరో ఎగిరిపోయాడు... బిగ్‌బాస్‌లో తలుపులు మూసేసి.. టాప్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9 రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. అయితే ఆటలో మజాను పెంచడానికి త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా పలువురిని హౌస్‌లోకి పంపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఆదివారం లేదా? దీపావళి నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాంచింగ్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే బిగ్‌బాస్‌లోకి పలానా వాళ్లు వెళ్తారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లేడీ కమెడియన్ గీతా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నవ్వులు పూయించిన లేడీ కమెడియన్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్లు ఏ ఇండస్ట్రీలోనూ ఉండరన్నది అందరికీ తెలిసిందే. పురుషులతో పాటు లేడీ కమెడియన్స్ కూడా నాటి నుంచి నేటి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు. గిరిజ, రమాప్రభ, శ్రీలక్ష్మీ, కొవై సరళ, పాకీజా, తెలంగాణ శకుంతల, హేమ వంటి కమెడియన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో వీరంతా తమ హవా చాటుకున్నారు. ఈ కోవలోకే వస్తారు గీతా సింగ్.

Bigg Boss Telugu 9 Actress Geetha Singh wants to join in top Show as a contestant

కితకితలుతో పాపులారిటీ
దివంగత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు సినిమాలో హీరో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటించారు గీతా సింగ్. భారీ పర్సనాలిటీతో, తనదైన కామెడీ టైమింగ్‌తో భర్తను మార్చుకునే భార్యగా ఆకట్టుకున్నారు గీత. నిజానికి ఈ సినిమాకు ముందే జై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గీతా సింగ్. ఆ తర్వాత ఎవడిగోల వాడిది, అల్లరి పిడుగు, ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, మళ్లీ మళ్లీ, సీమటపాకాయ్, ధూల్, సరైనోడు ఇలా హిట్ చిత్రాలలో నటించారు. 20 ఏళ్ల కెరీర్‌లో 70కి పైగా సినిమాలలో నటించారు. అయితే గత కొన్నేళ్లుగా గీతా సింగ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

పాత ఆర్టిస్ట్‌లకి ఛాన్స్ ఇవ్వాలి
ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న గీతా సింగ్ .....తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతుండగా ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై గీతా సింగ్ మాట్లాడుతూ... బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు నేను రెడీ. వాళ్లకు తెలియాలి... ట్రెండింగ్‌లో ఉన్నవాళ్లని తీసుకుంటున్నారు. ఇంత పేరు సంపాదించి మేం ఉన్నాం, బిగ్‌బాస్‌లో పాత ఆర్టిస్ట్‌లని చూశారా? ఎవ్వరూ లేరు.. కొత్త కొత్త వాళ్లని తీసుకుంటున్నారు. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు.. మేడం మీరెందుకు బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదు. నాకు తెలియదని చెప్పా. వాళ్ల నుంచి మనకి కాల్ రావాలి తప్ప, మనం అప్రోచ్ అయితే బాగోదు కదా... వెయిట్ చేస్తున్నా అని గీతా సింగ్ అన్నారు.

పారిపోవడానికి కూడా కుదరదు
బిగ్‌బాస్‌ నుంచి కాల్ వచ్చి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన వెంటనే అక్కడ 18 మంది కంటెస్టెంట్స్ మీ ఎదురుగా ఉన్నారు.. మీరు ఎలా గేమ్ ప్లే చేస్తారని యాంకర్ అడగ్గా... అందరూ ఆడినట్లే ఆడతాను. స్క్రిప్ట్ ఇస్తారు కదా దాని బట్టే ఆడతాను. స్క్రిప్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను, అందరూ అదే మాట చెబుతున్నారు కదా. నా దెబ్బకు అంతా పారిపోతారు, పడిపోతారు.. ఎందుకులే వాళ్లని రిస్క్‌లో పెట్టడం. ఆల్రెడీ కితకితలులో స్విమ్మింగ్ పూల్‌లో దూకినప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు. బిగ్‌బాస్‌లో ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోదు. మిగిలిన వాళ్లెక్కడ స్నానాలు చేస్తారు? వాళ్లెక్కడ స్విమ్మింగ్ చేస్తారు. వాళ్లు పారిపోవడానికి కూడా లేదు.. గేట్లన్నీ మూసేస్తారు కదా. నాగార్జున హోస్టింగ్ అద్భుతంగా చేస్తున్నారు అని గీతా సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X