‘కామన్‌మెన్స్‌పై కుట్ర, బిగ్‌బాస్‌తోనే తేల్చుకుంటా’
మరో రెండ్రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి హౌస్‌లో కామన్‌మెన్‌కు కూడా అవకాశం కల్పిస్తామని కింగ్ నాగార్జున అనౌన్స్ చేశారు. ఇందుకోసం వేలల్లో అప్లికేషన్స్ రాగా.. పలు దశలలో టాస్క్‌లు, ఇతర ప్రక్రియలు దాటుకుని 40 మందిని ఫైనల్ చేశారు. వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో నుంచి 15 మందిని టాప్ 15గా ఎంపిక చేశారు. వీరిలో ఎవరు హౌస్‌లో అడుగుపెడతారనేది ఉత్కంఠగా మారింది.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష విజేతలు ఎవరు?
ఈ 15 మందిలో ఎవరు సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వాదనల ప్రకారం.. మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దివ్య నిఖితలు కామన్‌మెన్ కేటగిరీలో బిగ్‌బాస్‌లో అడుగుపెడతారనే వార్తలు వస్తున్నాయి. నెటిజన్లతో పాటు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పాల్గొంటున్న పలువురు కంటెస్టెంట్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది.

అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌కు క్రేజ్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేస్తోన్న కంటెస్టెంట్స్‌కు కూడా అప్పుడే జనాల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాదాసీదాగా ఉన్న వీరి సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో వీరి ఇంటర్వ్యూల కోసం మీడియా వెంటపడుతోంది. వీరు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కామన్‌మెన్‌గా పార్టిసిపేట్ చేస్తోన్న అనూష రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అందరిలో గెలవాలనే కసి
జనాలు నా నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.. వాళ్ల అంచనాలకు తగిన విధంగా అగ్నిపరీక్షలో రీచ్ కాలేకపోయానేమో. అందరం గెలవాలని, బిగ్‌బాస్ స్టేజ్ మీద అడుగుపెట్టాలనే వస్తారు. 15 మంది రేసులో ఉన్నప్పుడు ఒకడు ముందు, ఒకడు వెనుక ఉంటారు. నాకు ఎక్కడో అదృష్టం కలిసిరాలేదని అనిపించింది. అలా అని ఎప్పుడూ నేను వరస్ట్ ప్లేయర్ అవ్వలేదు, నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రయత్నించి ఓడిపోయినోడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా వదిలేసిన వాడిని అనాలి అని అనూష అన్నారు.
3 నెలల క్రితం వీడియోతో ట్రోలింగ్
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనేది ఓ పర్సనాలిటీ టెస్ట్.. నేను నాలానే ఉన్నా, జనాలు చూస్తారు, ఓట్లు రాబట్టాలనే ఎఫర్ట్ పెట్టాను. టాస్క్‌ల సమయంలో నా మోకాలు కమిలిపోయింది, నా నడుము పనిచేస్తుందా అన్న భయం వేసి వణికిపోయా. నన్ను నమ్మి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తే ఇంకా బెటర్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. మూడు నెలల క్రితం నాటి నా వీడియోలతో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను ముందు, వెనుక తీసుకుని మధ్యలో వాళ్లకి నచ్చిన మీమ్ యాడ్ చేసి వదులుతున్నారు. నేనే అంతకంటే బాగా ఎడిట్ చేయగలను, అంతకంటే ఎక్కువే ట్రోల్ చేయగలను, కానీ ఎంతమందికని ఆన్సర్ చేయగలనని అనూష రత్నం వార్నింగ్ ఇచ్చారు.
వాళ్లకి నా సెల్యూట్
నేను బిగ్‌బాస్‌ని ఏం అనలేదు.. మన బిగ్‌బాస్ ఎవడ్రా అన్న యాక్సెంట్‌లో మాట్లాడా? కానీ 90's కిడ్స్‌కి తెలిసిన రియాలిటీ షోలు మాయద్వీపం, ఓంకార్ అన్నయ్య షోలే. ఎక్కడా కూడా నేను బిగ్‌బాస్‌కి వెళ్లను, బిగ్‌బాస్ నచ్చదని ఆ వీడియోలో ఉండదు. బిగ్‌బాస్ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టే.. అప్లయ్ చేశా, అగ్నిపరీక్ష వరకు వచ్చాను. ఇదంతా నాకు వాళ్లు ఇస్తున్న ఫ్రీ పబ్లిసిటీ, అందుకు థ్యాంక్స్. టాప్ 15లో నేనొక్కదానినే ఇన్‌ఫ్లూయెన్సర్ కాదు కదా? ఇంకో ముగ్గురు ఉన్నారు. కానీ వాళ్లపై ట్రోలింగ్ ఎందుకు జరగడం లేదు, ఈ అమ్మాయి ఉండకూడదు అనుకుంటున్నారు. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు.. వాళ్లకి నా సెల్యూట్ అంటూ అనూష పంచ్‌లు విసిరారు


Click it and Unblock the Notifications











