Bigg Boss 9 Agnipariksha Winners: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష విజేతలు వీరే? ఓటింగ్‌లో టాప్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9లో కామన్‌మెన్‌కి ఈసారి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వేలల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి 40 మందిని సెలెక్ట్ చేసి వారిలో 15 మందిని టాప్ 15గా చేశారు. వీరికి జడ్జిలు నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లు రకరకాల టెస్టులు పెట్టి అన్ని రకాలుగా పరీక్షించారు. వీరిలో నుంచి సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ తెలుగు 9లో అడుగుపెడతారన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 15 ఎపిసోడ్స్‌లుగా సాగిన బిగ్‌బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షకు సెప్టెంబర్ 5తో ఎండ్ కార్డ్ పడింది. అయితే వీరిలో ఐదుగురికి మాత్రమే హౌస్‌లో కామన్‌మెన్ కేటగిరీలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. ఆ ఐదుగురు ఎవరు? ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? పరిశీలిస్తే..
ఇద్దరు ఔట్
ఇప్పటికే ప్రసన్న, శ్వేతలను న్యాయ నిర్ణేతలు అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ చేయడంతో 13 మంది మిగిలారు. వీరిలో ఐదుగురికి హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దానికి తగినట్లుగానే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 15 హోరాహోరీగా సాగింది. కలర్ బాల్స్ టాస్క్‌లో దివ్య టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ హరీష్ గెలిచాడు. దీంతో అప్పటి వరకు దివ్య వేసిన బాల్స్ కూడా పాయింట్ల కింద హరీష్‌కే కేటాయించారు న్యాయ నిర్ణేతలు. ఆ తర్వాత హరీష్‌తో తలపడేందుకు కళ్యాణ్ వచ్చాడు. బాటిల్‌లను గాలిలోకి ఎగరేసి దానిని స్టడీగా నిలబెట్టే గేమ్‌లో కళ్యాణ్ అలవోకగా విజయం సాదించాడు.

ఎవరు వర్త్?
అనంతరం ఎవరు వర్త్, ఎవరు అన్‌వర్త్ అనే టాస్క్ ఇచ్చారు న్యాయ నిర్ణేతలు. ఈ సందర్భంగా పవన్‌పై అనూష మండిపడింది. అతనికి గేమ్ అర్ధం కావడం లేదని, ఎదుటి వాళ్లతో ఆర్గ్యూమెంట్ కూడా సరిగా చేయడం లేదని అతను అన్‌వర్తి అని, నేను వర్తి అని చెప్పుకుంది. తర్వాత దమ్ము శ్రీజ ఎంటరై తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది. శ్రేయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదని, కాబట్టి ఆమె అన్‌వర్తి అని చెప్పింది. మొత్తంగా ఈ టాస్క్‌లో హరీష్, షాకిబ్‌లకు మూడుసార్లు అన్‌వర్తి బోర్డులు దక్కాయి. మళ్లీ కలర్ బాల్స్ గేమ్‌ని షురు చేయగా కళ్యాణ్‌ని కల్కి ఓడించింది.
మేము కూడా సామాన్యులమే
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనల్ ఎపిసోడ్‌కు హీరో సత్యదేవ్ వచ్చి సందడి చేశారు. మీ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టాస్క్‌లు అన్ని ముగిసిన తర్వాత బిందు మాధవి, నవదీప్, అభిజిత్‌లు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ముగిసిందని.. తుది నిర్ణయం ప్రేక్షకులదేనని ఓటింగ్ అప్పీల్ చేసుకోమని చెప్పారు. అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మీతో కలిసి ట్రావెల్ చేసినందుకు మీతో బాండింగ్ ఏర్పడిందని ఎమోషనల్ అయ్యారు. నేను, నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవి గారు అందరం కామన్‌మెన్లమేనని, మాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని కష్టపడి పైకొచ్చామని ధైర్యం నూరిపోసింది. సెప్టెంబర్ 9న మీలో ఎవరు బిగ్‌బాస్ స్టేజ్‌పై అడుగుపెడతారో చూస్తామని చెప్పింది.
ఓటింగ్‌లో టాప్ ఎవరు?
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ టఫ్‌గా సాగుతోంది. కొన్ని సామాజిక మార్గాల్లో జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి చూస్తే కళ్యాణ్ పడాల 15.21 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉండగా.. షాకీబ్ 14 శాతం, పవన్ 12 శాతం, ప్రియ 11 శాతం, శ్రీజ 9 శాతం, మనీష్ 6 శాతం ఓటింగ్‌లో నిలిచారు. మరికొన్ని సైట్లలో వీరి స్థానాలు మారిపోయాయి. అయితే చాలా వరకు ఓటింగ్‌లో వీరే టాప్‌లో నిలిచినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్ స్టేజ్ మీద అడుగుపెట్టబోయే కామన్‌మెన్స్ ఎవరో చూడాలి.


Click it and Unblock the Notifications











