Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఆమెను ఇంటికి పంపించేద్దామా? కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

తెలుగు రియాలిటీ షోలలో టాప్ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7వ తేదీ గ్రాండ్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు అడుగుపెట్టనున్నారు? సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేశారు? గ్రాండ్ లాంచ్ రోజున బిగ్‌బాస్ స్టేజ్ మీద సందడి చేయనున్నారు? నాగార్జున ప్రోమోలలో చెప్పిన కొత్త సిలబస్ ఏంటీ? డబుల్ హౌస్ విశేషాలు ఏంటీ? బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో విజేతలుగా నిలిచిందెవరు? అనేది తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 9 లాంచింగ్‌కు సంబంధించి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఫీవర్‌లో తెలుగు రాష్ట్రాలు
మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి సీజన్ సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బిగ్‌బాస్ ఫీవర్‌లో మునిగి తేలుతున్నాయి. సాయంత్రం జనాలు టీవీలకు అతుక్కుపోవడం గ్యారెంటీ. దీనిని మరింత పెంచేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు పోటీలు పడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసిన నిర్వాహకులు సాయంత్రం ఏం జరగబోతుందో చిన్న ట్రైలర్ వదిలారు.

Bigg Boss Telugu 9 Akkineni Nagarjuna gave shock to Agnipariksha contestant Dahlia Shariff

ఆ అమ్మాయిని పంపేద్దాం
ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో మీ ముందుకొచ్చేసింది బిగ్‌బాస్ సీజన్ 9 అంటూ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ వెంటనే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు నాగార్జున. మిమ్మల్ని చూస్తుంటే కలయా? నిజమా? అనిపిస్తోందని ఓ కంటెస్టెంట్ అనడంతో ఆమెను కొంచెం గిచ్చాలంటూ నాగ్ పంచ్ పేల్చారు. నా హార్ట్ అలా రేజ్ అవుతోందని దాలియా చెప్పడంతో.. దాలియా నన్ను చూసేసింది? ఇంటికి పంపించేద్దామా అని నాగార్జున రివర్స్‌లో తగులుకోవడంతో దాలియా వద్దు అంటూ సైలెంట్ అయిపోయింది.

డబుల్ హౌస్ సూపర్
ఆ తర్వాత నాగార్జున కళ్లకు గంతలు కట్టుకుని బిగ్‌‌‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు నాలో యుద్ధభూమిలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు.. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు అని బిగ్‌‌బాస్ పవర్‌‌‌ఫుల్ డైలాగ్ పేల్చాడు. దాంతో నేను దేనికైనా సిద్ధమేనని నాగార్జున ఆన్సర్ ఇస్తూ కళ్లకున్న గంతలు తీసేశాడు. కత్తి తీసుకుని, సుత్తితో కొడుతూ బిగ్‌బాస్ సెకండ్ హౌస్‌ని రివీల్ చేసిన నాగ్.. సెకండ్ హౌస్ ఔట్‌ స్టాండింగ్‌గా ఉందని చెప్పాడు. ఆ వెంటనే కంటెస్టెంట్స్ ఎంట్రీ అయినట్లుగా తెలుస్తోంది. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ను ఇమిటేట్ చేశాడు.

తొలిరోజే ఎలిమినేషన్
మరో మహిళా కంటెస్టెంట్ ఒక్కసారి ఏదైనా గట్టిగా అనుకుంటే అస్సలు వదిలిపెట్టనని తేల్చిచెప్పింది. మరో వాయిస్‌లో పిక్చర్ అభి బాహీ హై అని ఇంకో వాయిస్ వినిపించగా ఆమె ఆశా షైనీగా తెలుస్తోంది. ఒక వ్యక్తి గిఫ్ట్ తీసుకుని రాగా.. ఏంటది అని నాగార్జున అడుగుతారు. ఇది నా బాడీలో ఓ పార్ట్ అని దీనిని హౌస్‌ లోపలికి తీసుకొచ్చేందుకు పర్మిషన్ అడుగుతాడు. దాంతో హౌస్‌లోకి మీతో పాటు ఏ వస్తువును తీసుకెళ్లడానికి అనుమతి లేదని బిగ్‌‌బాస్ తేల్చిచెప్పాడు. దీంతో నేను ఇంటికి వెళ్లిపోతానని ఆ కంటెస్టెంట్ అనడంతో, అది మీ ఇష్టమని బిగ్‌బాస్ తేల్చిచెప్పాడు. నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చని నాగార్జున కూడా చెప్పడంతో ఆ కంటెస్టెంట్ బాధగా హౌస్‌ని వీడాడు. చివరిలో మార్పు సరిపోయిందా నాగార్జున అని బిగ్‌బాస్ అడగ్గా.. సరిపోయింది బిగ్‌బాస్.. మీరు మారారు.. ఇల్లు మారింది అని నాగ్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. దీంతో తొలి రోజే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్న ఆ కంటెస్టెంట్ ఎవరు? అతనితో పాటు తీసుకొచ్చిన ఆ వస్తువు ఏంటీ? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X