Bigg Boss Telugu 9: ఇమ్యూ ఓ రెడ్ ఫ్లవర్.. తప్పు నాదే.. షో నుంచి వెళ్లిపోతా.. హరిత హరీష్
బిగ్‌బాస్ తెలుగు 9 చూస్తుండగానే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఎన్నో గొడవలు, వివాదాలు, శత్రుత్వాలు కనిపించాయి. అప్పుడే చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. గ్రూప్‌లు కట్టడం కూడా మొదలైపోయింది. ఇక వీకెండ్ అనగానే హోస్ట్ అక్కినేని నాగార్జున కోసం అందరూ ఎదురుచూస్తారు. వారం మొత్తం హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆయన విశ్లేషణ చేయడంతో పాటు తప్పు చేసినవారికి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ వీక్‌పై నాగ్ అనాలిసిస్ చేశారు. ఈ సందర్భంగా హరిత హరీశ్‌ని అందరూ కార్నర్ చేయడంతో అతను సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
హరిత హరీశ్ ఓవరాక్షన్
బిగ్‌బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరు అనిపించుకున్నాడు హరిత హరీశ్. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడే తన తీరుతో జనం దృష్టిలో పడిన అతను.. ఇలాంటి వాళ్లే హౌస్‌లో అనిపించుకున్నాడు. తన ముందు ఎవరైనా మాస్క్ వేసుకున్నట్లు కనిపిస్తే వారి మాస్క్ తీసేస్తానని ముందే చెప్పాడు హరీష్. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక.. తన బేస్ వాయిస్‌తో ప్రతి విషయంలోనూ దూరిపోతూ పెద్దమనిషిలా, కంటెస్టెంట్స్‌ని కంట్రోల్ చేసేవాడిలా ఓవరాక్షన్ చేశాడు.

ఇమ్మూ, భరణిలపై హరీశ్ వ్యాఖ్యలు
ఇమ్మాన్యుయేల్ సరదాగా గుండు అంకుల్ అంటూ ఏడిపించడాన్ని సీరియస్‌గా తీసుకున్న హరీష్.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇమ్మాన్యుయేల్ వదిలిపెట్టకుండా మధ్యమధ్యలో గుండు అంకుల్ అంటూనే ఉన్నాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, తనూజల ఆటతీరుపై మన మాస్క్ మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇమ్యాన్యుయేల్, భరణి శంకర్, తనూజలు ఒక ఆడ, ఇద్దరు మగాళ్లు అనుకున్నానని.. కానీ ముగ్గురు వెధవలతో ఆడానని వ్యాఖ్యానించాడు. అయితే ఈ డిస్కషన్ ఇద్దరి మధ్యే జరగడంతో ఈ విషయం బయటకు రాలేదు.
ఇమ్యాన్యుయేల్ కంటతడి
శనివారం నాడు హౌస్‌లో అడుగుపెట్టిన నాగార్జున ఒక్కొక్కరి బాక్స్‌లు బద్ధలు కొట్టాడు. ముందు ఫ్రీ బర్డ్ ఇష్యూతో విశ్లేషణలు మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఫ్లోరా షైనీ, సంజన మధ్య గొడవ జరిగింది. నేను వల్గర్ మాటలు పడటానికి హౌస్‌కి రాలేదని సంజన కంటతడి పెట్టింది.. దీంతో సంజనాకి ఫ్లోరా క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత తనూజ, రీతూలని హగ్ చేసుకోవాలని చెప్పిన నాగార్జున వీరిద్దరిని కలిపేశారు. ఇక మాస్క్ మ్యాన్ హరిత హరీశ్ వంతు వచ్చింది. ముందుగా హరీష్‌ను గుండు అంకుల్ అని పిలవడంపై ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్ పీకాడు నాగార్జున. నేను సరదాగా, అందరినీ నవ్వించాలనే అలా అన్నానని ఇమ్ము వివరణ ఇచ్చుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఒక ఎంటర్‌టైనర్ అని, గుండు అంకుల్ అనే మాట నవ్వించడానికే తప్పించి.. బాడీ షేమింగ్ కామెంట్ కాదని నాగార్జున తేల్చేశారు. ఆ మాటలతో ఇమ్మూ ఏడ్చేయడంతో మిగిలిన కంటెస్టెంట్స్ ఓదార్చారు.
రెడ్ ఫ్లవర్ బూతు కాదా
నా మీద జోక్స్ వేస్తే ఊరుకుంటానని.. కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే సహించనని అన్నాడు హరీష్. మరి నువ్వు లిమిట్స్‌లోనే ఉన్నావా? అని నాగార్జున గుచ్చిగుచ్చి అడగ్గా.. ఎస్ సార్ అన్నాడు గుండు అంకుల్. దాంతో నాగార్జున మాట్లాడుతూ.. గుండు అంకుల్ అనేది నిన్ను మనస్తాపానికి గురిచేస్తే, రెడ్ ఫ్లవర్ అనే పదం ఇంకెంత ఇంపాక్ట్ చూపిస్తుందని నాగ్ ప్రశ్నించారు. ఈ పదాన్ని హరీష్ గారు వాడారని, కానీ ఎప్పుడు అన్నారో తెలియడం లేదని మనీష్ చెప్పడంతో నేను వీడియో వేస్తానని నాగ్ తెలిపారు.
సారీ చెప్పిన గుండు అంకుల్
ఈ వీడియోలో ఇమ్మాన్యుయేల్‌ని హరీష్ రెడ్ ఫ్లవర్ అనడం స్పష్టంగా వినిపించింది. ఇది మంచి పదమా? బ్యాడ్ వర్డా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా.. అందరూ ముక్తకంఠంతో బ్యాడ్ వర్డ్ అని చెప్పడంతో , నేను అన్న ఉద్దేశం అది కాదని హరీష్ అన్నాడు. గుండు అంకుల్ అన్నపదానికి సారీ చెప్పించుకున్నావ్.. మరీ రెడ్ ఫ్లవర్‌కి చెప్పాల్సిన పనిలేదా అని నాగ్ ప్రశ్నించారు. దీంతో సారీ బ్రదర్ అని ఇమ్మాన్యుయేల్‌కు సారీ చెప్పిన హరీత హరీష్.. అవసరమైతే ఈ షో నుంచి క్విట్ అవుతానని తేల్చిచెప్పాడు. అక్కడితో నాగార్జున ఆగలేదు.. హరీష్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు నాగ్.
హరిత హరీశ్‌గానే ఉంటా
నీకు ఆడవాళ్లంటే గౌరవమా? అని హరీష్‌ను నాగార్జున అడగ్గా.. చాలా గౌరవమని బిల్డప్ ఇచ్చాడు గుండు అంకుల్. దీంతో నాగార్జున ప్లే చేసిన వీడియోలో భరణి, ఇమ్యాన్యుయేల్‌లను ఆడంగోళ్లు అంటూ నోరు జారడంతో వారిద్దరూ షాక్ అయ్యారు. దాంతో హౌస్‌మెట్స్ అంతా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ దెబ్బతో ఏం మాట్లాడాలో తెలియని హరిత హరీష్.. నా క్యారెక్టర్‌ని రాంగ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారని నాగార్జునతోనే గొడవ పడ్డాడు. తప్పు ఒప్పుకోకపోవడంతో ఆడియన్స్ చేత చీవాట్లు పెట్టించాడు నాగార్జున. చివరికి నేను ఏ తప్పు చేయలేదని, నేను హరిత హరీష్‌గానే ఉంటానని, ఓన్లీ హరీష్‌గా ఉండనని.. రెడ్ ఫ్లవర్ అనే మాటకి సారీ చెప్పాడు. నేను నిన్ను అర్ధం చేసుకున్నానని.. అందుకే నీ తప్పుల్ని సరిదిద్దుతున్నానని నాగ్ చెప్పాడు. ఇంతటితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.


Click it and Unblock the Notifications











