Bigg Boss 9 Telugu: వామ్మో.. ఇదేం ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ.. హౌస్‌లో మిడ్‌వీక్ ఎలిమినేషన్ టెన్షన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ ఆసక్తిని రేకెత్తించేలా మలుపులు తిరుగుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న టాస్కులు, నామినేషన్లు, గొడవలు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ఒకటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీజన్ 7లో దుమ్మురేపిన కంటెస్టెంట్లు అమర్ దీప్ చౌదరి, అర్జున్ అంబటి ఇద్దరూ ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీస్ గెటప్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారి ఎంట్రీ ఫన్నీగా ఉన్నా.. లాస్ట్ లో మాత్రంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను మీడ్ వీక్ ఎలిమినేషన్ చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో అమర్-అర్జున్‌ల ఎంట్రీతో హౌస్ మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. ఇద్దరూ పోలీస్ యూనిఫార్మ్‌లో మెయిన్ డోర్ ద్వారా లోపలికి అడుగుపెట్టగానే హౌస్‌మేట్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. "సార్ నమస్తే సార్" అంటూ ఇమ్మూ ఫన్నీగా పలకరించగా, రీతూ మాత్రం తన స్నేహితుడు అమర్‌ని గట్టిగా కౌగిలించుకొని ఎగిరి గంతేసింది. తమ సీజన్ 7 గుర్తు చేసుకుంటూ అర్జున్ "మై సెల్ఫ్ ఇంద్రజిత్ ఫ్రమ్ సీజన్ 7" అంటూ పరిచయం చేసుకోగా, అమర్ "ఐ యామ్ కామ్‌జీత్ ఫ్రమ్ సీజన్ 7" అని చెప్పాడు. వెంటనే రీతూ చమత్కారంగా "కామ్‌జీత్ అంటే కామ్‌గా ఉంటారా?" అంటూ పంచ్ వేసింది.

ఇలా అమర్-అర్జున్‌ల రాకతో హౌస్‌లో నవ్వుల వర్షం కురిసింది. "మేము ఇద్దరం పోలీసులుగా వచ్చాం, ఈ హౌస్‌లో దొంగల్ని పట్టుకోవడమే మా టాస్క్" అంటూ ప్రారంభించారు. హౌస్‌లో గ్యాంగ్ వార్స్ పేరుతో జరుగుతున్న టాస్క్‌లో ప్రస్తుతం హౌస్‌మేట్స్ రెండు టీమ్స్‌గా విడిపోయిన విషయం తెలిసిందే. మాస్ మాధురి టీం వర్సెస్ సంజన సైలెన్సర్ టీం గా షో సాగుతోంది. ఇక టాస్క్‌లో భాగంగా కొందరు కిచెన్ వస్తువులు, డబ్బులు దాచేయడంతో హౌస్‌లో పెద్ద గందరగోళం నెలకొంది.
దొంగలుగా సంజనా టీం, మాధురి టీం తమ తమ గ్యాంగ్స్‌తో అరాచకం సృష్టిస్తున్నారు. మధ్యలో సంజనా టీం డబ్బులు తనూజ, సుమన్ శెట్టి దివ్యతో కలసి దొంగలించడంతో రచ్చ మొదలైంది.
ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని సంజనా టీం పట్టుబడగా, తనూజ మాత్రం "మేమేమీ దొంగతనం చేయలేదు సార్" అంటూ అమాయకంగా సమాధానం చెప్పింది. "హౌస్‌లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్, ఎవరు నిజాయితీగా ఒప్పుకుంటే బాగుంటుంది, లేకపోతే మాతో పాటు మెయిన్ డోర్ ను బయటకు వస్తారు సార్" అంటూ అమర్ వెటకారంగా చెప్పడంతో హౌస్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ హౌస్ అంతా గాలించారు. బెడ్‌రూమ్, కిచెన్, కబోర్డ్ అన్నీ వెతికిన అమర్‌కి ఆశ్చర్యం కలిగింది. "వామ్మో రే, కిచెన్‌లో ఉండాల్సిన ఎగ్ ట్రేలు, ఫలాలు, చాక్లెట్లు ఇవన్నీ బెడ్ దగ్గర ఉన్నాయి! ఇది బెడ్‌రూమా, లేకపోతే సూపర్ మార్కెట్టా?" అంటూ కామెడీ కామెంట్లు చేశారు. తనూజ బెడ్ దగ్గర ఉండే స్నాక్స్, పండ్లు చూసి "ఏంట్రా ఇది పళ్లతోటా?" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
'మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ ఇద్దరినీ పట్టుకోవడమే మా టాస్క్' అని చెప్పిన అర్జున్ వార్నింగ్ ఇస్తారు. ఇంతలో సంజనా, మాధురి ఇద్దరూ గదుల్లో దాక్కోవడంతో "వాళ్లు ఎక్కడ దాక్కున్నారో కనుక్కోవాలి!" అంటూ ఇద్దరు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అర్జున్ "వాళ్లు డబ్బాలా, స్పూన్లలా దాక్కున్నారేమో" అంటూ పంచ్ వేశాడు. ఈ సరదా టాస్క్ అనంతరం బిగ్ బాస్ టీం రామును "మిడ్ వీక్ ఎలిమినేషన్"పేరుతో హౌస్ నుండి బయటకు పంపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఫన్నీ గేమ్ లో భాగమేనా? రియల్ గా రామ్ రాథోడ్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారా? అనే తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ లేటేస్ట్ ప్రోమో నెట్టింట్లో వైరల్ కావడంతో అమర్ దీప్, అర్జున్ అంబటి లకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులు వీళ్ల ఎంట్రీకి ఫిదా అయ్యారు. "సీజన్ 7 వైబ్ మళ్లీ వచ్చింది", "అమర్ కామెడీ సూపర్", "అర్జున్ ఎంట్రీ పవర్‌ఫుల్" అంటూ కామెంట్లు కురుస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ పోలీస్ టాస్క్ లీక్‌ను ముందుగానే బయటపెట్టింది మరొక మాజీ కంటెస్టెంట్ టేస్టీ తేజ. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "హౌస్‌లో ఇద్దరు పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతున్నారు" అంటూ 'అమరేంద్ర బాహుబలి' అనే హింట్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











