Bigg Boss Telugu 9: నామినేషన్స్‌ నుంచి మరో ముగ్గురు సేఫ్.... ఈ వీక్ డేంజర్ జోన్‌లో ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీశ్‌లు తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఎలా జరగబోతోంది? డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా? ఎవరు ఎలిమినేషన్ కానున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్న వారిని శని, ఆదివారాల్లో నాగార్జున స్వయంగా సేవ్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు.

నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్
సోమవారం నాటి నామినేషన్స్‌ ఎప్పుడూ జరిగే విధంగా కాకుండా వెరైటీగా జరిగాయి. కంటెస్టెంట్స్‌ నేరుగా ఇద్దరినీ నామినేట్ చేయకుండా ఇంటి సభ్యులందరినీ తనే నామినేట్ చేశాడు. కెప్టెన్ రాము రాథోడ్ తప్పించి అందరూ నామినేషన్‌లలో ఉన్నారని చెప్పడంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. దాంతో పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలతో కలిపి మొత్తం 11 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.

Bigg Boss Telugu 9 Bharani Shankar Divya Nikitha And Pawan Kalyan Padala are entered into safe zone

నామినేషన్స్ తప్పించుకున్న ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ ఇచ్చిన షాక్‌లో నుంచి కంటెస్టెంట్స్ తేరుకునేలోపు మరో బాంబు పేల్చాడు. నామినేషన్స్‌లో ఉన్న వారిని ఇమ్యూనిటీ ద్వారా సేవ్ చేస్తానని చెప్పాడు బిగ్‌బాస్. తాను ఇచ్చే టాస్క్‌లలో గెలిచి సత్తా చాటాలని సూచించాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. అయితే అన్ని టాస్క్‌లలో గెలిచి ఇమ్మాన్యుయేల్ ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నునంచి సేవ్ అయ్యాడు.

సంజన - ఫ్లోరాలను లేపేసిన భరణి
ఆ తర్వాత కూడా నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందే అవకాశం అందరికీ వస్తుందని అనౌన్స్ చేశాడు బిగ్‌బాస్. అయితే గురువారం నాటి ఎపిసోడ్‌తో ఇమ్యూనిటీ పొందే టాస్క్‌లు ముగిసినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. అక్టోబర్ 9 నాటి ఎపిసోడ్‌లో తొలుత బిగ్‌బాస్ ఇచ్చిన నాచోరే నాచోరే టాస్క్‌లో పవన్ కళ్యాణ్ పడాల గెలవగా.. ఆ తర్వాత దివ్య నిఖిత, డిమోన్ పవన్, సుమన్ శెట్టి నిలిచారు. అయితే పాయింట్ల పరంగా లీడర్ బోర్డ్‌లో దివ్య - భరణి జంటకి బిగ్‌బాస్ ఓ పవర్ ఇచ్చాడు. ఫ్లోరా షైనీ - సంజన, దమ్ము శ్రీజ- సుమన్‌లలో ఒక టీమ్‌ని రేసులో నుంచి తీసేయమని బిగ్‌బాస్ చెప్పడంతో.. వారు ఫ్లోరా షైనీ - సంజనను తీసేశారు. దాంతో అనవసరంగా బిగ్‌బాస్‌కి వచ్చానని నన్ను ఇంటికి పంపించేయండి అంటూ సంజన గోల చేసింది.

డేంజర్ జోన్‌లో ఎవరంటే?
ఆ తర్వాత పిరమిడ్ కట్టు - పాయింట్స్ పట్టు టాస్క్‌లో తనూజ- పవన్ కళ్యాణ్ గెలవగా.. డిమోన్ పవన్ - రీతూ చౌదరిలు ఫోర్త్ ప్లేస్‌కే పరిమితమయ్యారు. ఇక ఈ టాస్క్‌తో కలిపి ఇమ్యూనిటీ గేమ్స్ ముగిసినట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. లీడర్ బోర్డులో దివ్య నిఖిత- భరణి శంకర్‌లు ఫస్ట్ ప్లేస్‌లో, పవన్ కళ్యాణ్ - తనూజలు సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. వీరిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వారు నేరుగా మెయిన్ హౌస్‌లోకి వెళ్లొచ్చని.. సెకండ్ ప్లేస్‌లో ఉన్న టీమ్‌లో ఒకరికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పడంతో కళ్యాణ్ కోసం తనూజ త్యాగం చేసింది. దాంతో కెప్టెన్ రాము, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, దివ్య నిఖిత, పడాల పవన్ కళ్యాణ్ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచారు. ఇక రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, సంజనా గల్రానీలు డేంజర్ జోన్‌లో నిలిచారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X