దివ్వెల మాధురి, రీతూ చౌదరిలని ఎలిమినేట్ చేయండి.. బిగ్‌బాస్‌ తెలుగు 9 షోపై కేసు!

బిగ్‌బాస్ షోపై దేశవ్యాప్తంగా సాంప్రయదాయవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి కావాల్సిన వారిని, పెళ్లి అయిన వారిని ఒకే గదిలో కొన్నిరోజులు ఉంచడం సరికాదని, అలాగే ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉంటోందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. సీపీఐ నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్ షోపై ఎప్పటి నుంచో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ నిర్వాహకులు హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్‌ను నిరాటంకంగా టెలికాస్ట్ చేస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ మొదలై విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఈ ఏడాది 9వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 7 నుంచి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఈ సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. తొలుత 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు సామాన్యులతో కలిపి 15 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైంది. ఆ తర్వాత దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. గత ఆదివారం దివ్వెల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss Telugu 9 case filed on Akkineni Nagarjuna s show and allegations on Rithu chowdary and Divvala Madhuri

6వ వారంలోకి బిగ్‌బాస్‌ తెలుగు
ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు 9 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. తొలి వారంలో శ్రష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియాశెట్టి, నాలుగో వారంలో హరిత హరీశ్, ఐదో వారంలో ఆశా షైనీ, దమ్ము శ్రీజలతో కలిపి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్ సంఖ్య 16కి చేరుకుంది. సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న బిగ్‌బాస్ తెలుగు 9కి షాక్ తగిలింది. ఈ షోను బ్యాన్ చేయాలంటూ కొందరు వ్యక్తులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రీతూ చౌదరి, దివ్వెల మాధురిలను కంటెస్టెంట్స్‌గా తీసుకోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్‌ని నిలిపివేయాలి
బిగ్‌బాస్ షోని నిలిపివేయాలంటూ గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, బీ రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ అనే వ్యక్తులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఈ రియాలిటీ షో వల్ల యువత తప్పుడు మార్గంలో పయనించే అవకాశం ఉందని తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ షో నిర్వాహకులతో పాటు హోస్ట్ అక్కినేని నాగార్జునపైనా ఫిర్యాదు చేశారు.

మాధురి, రీతూ చౌదరిలు ఎందుకు
సమాజంలో సరైన విలువలు లేని వ్యక్తులను కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి కంటెస్టెంట్స్‌ని షో లోకి తీసుకోవడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని వారు మండిపడ్డారు. ఈ షోను తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

వివాదాల్లో రీతూ చౌదరి
జబర్దస్త్ ద్వారా పాపులరైన రీతూ చౌదరి బుల్లితెర నటిగా, యాంకర్‌గా రాణిస్తున్నారు. అయితే ఈమెపై ఏపీలో 700 కోట్ల భూ కబ్జా ఆరోపణలు రావడంతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కేసు నమోదైంది. ఇటీవల హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరి .. రీతూపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు తన భర్తతో సంబంధం పెట్టుకుందంటూ వీడియోలు, ఫోటోలు, స్క్రీన్ షాట్స్‌ను మీడియాకు లీక్ చేసింది.

దువ్వాడ శ్రీనివాస్‌ జీవితంలోకి మాధురి
ఇక దివ్వెల మాధురి విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా పాపులర్ అయ్యారు. టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ సంపాదించారు. అయితే శ్రీనివాస్‌కు అప్పటికే పెళ్లయి భార్య శ్రీవాణి, కుమార్తెలు హైందవీ, నవీన ఉన్నారు. దివ్వెల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆమె మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్‌తో మాకు దూరం పెరిగిందని శ్రీవాణి ఏకంగా నిరసన దీక్షకు దిగారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ దివ్వెల మాధురిపై అప్పట్లో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X