Remuneration: బిగ్‌బాస్‌ తెలుగు షోలో టాప్ రెమ్యునరేషన్ ఎవ్వరికో తెలుసా? వారానికి ఎన్ని లక్షలంటే?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 9 అట్టహాసంగా మొదలైంది. ఇంటిలోకి అడుగుపెట్టిన కామన్ మ్యాన్స్, సెలబ్రిటీలు ఘాటుగా మాటలతో, దూకుడు ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్‌బాస్ ఇస్తున్న టాస్కులను కూడా అంతే జోష్‌తో ముగించేస్తున్నారు. అయితే ఈ షోలోకి వచ్చిన సెలబ్రిటీలలో టాప్ రెమ్యునరేషన్ ఎవరికి చెల్లించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకొన్నారనే వివరాల్లోకి వెళితే..

సాధారణంగా బిగ్‌బాస్ షోలో అన్నీ సీక్రెట్‌గానే సాగిపోతుంటాయి. చాలా విషయాల పట్ల చాలా స్క్రిక్ట్‌గా వ్యవహారిస్తుంటారు. ఇంటిలోకి వెళ్లే వారి ప్రవర్తన విషయంలో గానీ... ఇంటిలోని వస్తువుల డామేజ్ చేస్తే దానికి పరిహారం విషయంలో గానీ, అలాగే పారితోషాకాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఆర్థిక వ్యవహారాలను బయటకు చెప్పకూడదనే విషయాలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇలాంటి అంశాలన్నింటిని పక్కాగా ఒప్పందం చేసుకొని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకొంటారు అని గతంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు చెప్పడం తెలిసిందే.

Bigg Boss Telugu 9 Contestant Bharani Shankar Remuneration

ఇలా పక్కగా రూల్స్ విధించినా.. కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ విషయాలు బయటకు ఎలాగోలా లీక్ అవుతుంటాయి. తాజాగా షో ప్రారంభం కాగానే రకరకాల మాధ్యమాల్లో, ఇతర సెలబ్రిటీలు చేసే లీకుల ద్వారా కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు బయటకు పొక్కుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో అత్యధికంగా పారితోషికం అందుకొంటున్న టాప్ కంటెస్టెంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే ఇంటిలో పెద్ద తరహాగా కనిపించే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే.. అది టెలివిజన్ యాక్టర్ భరణి శంకర్ కుమార్. వయసులోను, వ్యవహారంలో కూడా అందరి కంటే పెద్ద వ్యక్తిగానే ముద్ర వేసుకొన్నాడు. చిన్నవారిని, తనతోటి వారిని కలుపుకుపోతూ అందర్నీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సీజన్‌లో భరణి శంకర్ అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం.

Bigg Boss Telugu 9 Contestant Bharani Shankar Remuneration

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లోకి అడుగుపెట్టిన భరణి శంకర్.. అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడు. అయితే నిర్వాహకులతో జరిగిన కన్సల్టేషన్స్‌తో ప్రతీ వారానికి సుమారుగా 3.5 లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం జరిగింది. అంటే.. ప్రతీ రోజు ఆయనకు చెల్లించే పారితోషికం 50 వేల రూపాయలు అనే విషయం బయటకు వచ్చింది. భరణి కుమార్ ప్రస్తుతం అత్యధికంగా పారితోషికం పొందుతున్న సెలబ్రిటీగా ఘనతను సాధించాడు.

భరణి శంకర్ విషయానికి వస్తే.. వైజాగ్‌కు చెందిన ఆయన హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. టెలివిజన్ నటుడిగా అందరికి సుపరిచితుడు. చిలసౌ స్రవంతి, కుంకుమ రేఖ, తూర్పు పడమర, అభిషేకం, పున్నాగ అనే సీరియల్స్‌ ద్వారా, మేస్త్రీ, యంగ్ ఇండియా, పరమ వీర చక్ర, గోపాల గోపాల, బాహుబలి లాంటి చిత్రాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X