ఆ హీరోతో రీతూ చౌదరి ఎఫైర్.. తెల్లార్లు అదే పని, వీడియోలు బయటపెట్టిన నటుడి భార్య

యంగ్ హీరో ధర్మ మహేశ్‌పై అతని భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి చౌదరి కొద్దిరోజుల క్రితం చేసిన వరకట్న వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అలాగే ధర్మ మహేశ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్లు ఉన్నాయని గౌతమి ఆరోపించింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పలు టీవీ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంచలన విషయాలు బయటపెట్టారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి చౌదరి బాంబు పేల్చింది.

గౌతమితో మహేశ్ ప్రేమ వివాహం
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి వంటి పలు చిత్రాలతో యువతలో క్రేజ్ సంపాదిస్తోన్నాడు ధర్మ మహేశ్. సినిమాల్లో నటిస్తూనే పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి చౌదరితో అతనికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో ఆమెను 2019లో మహేశ్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత గౌతమి, మహేశ్ కలిసి ఓ రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి.

Bigg Boss Telugu 9 contestant rithu Chowdary s video released by Dharma Mahesh wife Gautami Chowdary

వీడియో రిలీజ్ చేసిన గౌతమి
ఓ యువతితో ధర్మ మహేశ్ సన్నిహితంగా ఉండేవాడని, ఆమె వల్ల తమ వైవాహిక జీవితంలో గొడవలు చోటు చేసుకున్నట్లు గౌతమి ఆరోపించింది. అయితే ఆ యువతి ఎవరు? ఆమెతో మహేశ్‌కి ఎలా పరిచయం ఏర్పడింది? అనే వివరాలు మాత్రం గౌతమి ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. అయితే ఆకస్మాత్తుగా ఆమె ఓ బాంబు పేల్చింది. ఓ ఛానెల్‌లో ఇటీవల జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గౌతమి తన భర్త మరో యువతితో బెడ్‌రూమ్‌లోకి వెళ్లడం, ఇద్దరూ మత్తులో ఊగుతూ వస్తున్న ఫోటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టింది గౌతమి.

ఆ యువతి రీతూనా?
అయితే సదరు వీడియోలోని యువతి అచ్చుగుద్ధినట్లుగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరిలా ఉండటంతో బుల్లితెర ఇండస్ట్రీ షాకైంది. 2023లో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రీతూ వల్ల తనతో మహేశ్ గొడవపడ్డాడని గౌతమి తెలిపింది. అలాగే రీతూ గురించి ఆరా తీసినందుకే తనను దూరం పెడుతున్నావా? అని మహేశ్‌తో గౌతమి చేసిన వాట్సాప్ ఛాట్ స్క్రీన్ షాట్లను ఆమె లైవ్‌లో బయటపెట్టింది. ఓ యువతి తన జీవితాన్ని నరకంలా మార్చిందని.. నాతో పాటు నా బిడ్డ సంతోషాన్ని ఆమె లాగేసుకుందని గౌతమి ఆరోపించారు.

నా భర్తతో రీతూ అలా దొరికింది
టీవీ ఛానెల్ డిస్కషన్‌లో గౌతమి ఏమన్నారంటే.. 'వీళ్లు నాకు ఎలా దొరికారంటే, ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్‌కి సంబంధించి 3 నెలల ఫుటేజ్ నా దగ్గర ఉంది. 2023లో వీళ్లిద్దరికీ ఎఫైర్ నడిచిందని తెలుసు కానీ, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలియదు. ఈ అమ్మాయి వెళ్తుందన్న డౌట్ కూడా నాకు లేదు.. నా దగ్గర ఉండే కాస్ట్‌లీ ఫుట్‌వేర్ మిస్ అయ్యింది. ఇతని ఫ్లాట్‌కి నాకు యాక్సెస్ లేదు, నన్ను రానివ్వడం లేదు, నాతో మాట్లాడటం లేదు. అయితే ఫ్లాట్ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంది. నా ఫుట్‌వేర్ చూసుకోవడానికి వెళ్లి ఫుటేజ్ చెక్ చేస్తే ఈ అమ్మాయి రోజూ ఆ ఫ్లాట్‌కి వస్తూనే ఉంది. అది కూడా ప్రతిరోజూ రాత్రి 1 గంట నుంచి నాలుగు గంటల మధ్యలోనే. ఒక మూడు, నాలుగు గంటలు ఆ ఫ్లాట్‌లోనే గడుపుతుంది. ఏ అసిస్టెంట్స్‌తో నన్ను తిట్టిస్తాడో.. అదే అసిస్టెంట్స్‌ని ఈ అమ్మాయికి బాడీగార్డ్స్‌గా పెట్టి పంపిస్తాడు' అని గౌతమి చౌదరి తెలిపారు.

Take a Poll

బిగ్‌బాస్‌లో రీతూ హవా
ప్రస్తుతం రీతూ చౌదరి - ధర్మ మహేశ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీరిద్దరూ డ్రగ్స్ తీసుకోవడానికే ఒకే ఫ్లాట్‌లోకి వెళ్లారా? లేక ఇద్దరి మధ్యా నిజంగానే రిలేషన్ ఉందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై రీతూ చౌదరి, ఆమె కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం రీతూ.. బిగ్‌‌బాస్ తెలుగు 9లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకెళ్తోంది. మైండ్ గేమ్‌లు, స్ట్రాటజీతో ఆడుతోంది. ఇటీవల డిమోన్ పవన్‌ను కెప్టెన్‌గా చేయడంలో చక్రం తిప్పి నాగార్జునతో చీవాట్లు తిన్నది. తాజాగా గౌతమి ఆరోపణలతో రీతూ చౌదరి బిగ్‌బాస్ ప్రయాణంపై ఎఫెక్ట్ పడుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X