Bigg Boss Telugu 9 Contestants Confirm List: బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ల కన్ఫార్మ్ లిస్ట్!
బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఇంటిలోకి కంటెస్టెంట్లు అడుగుపెట్టడానికి అందరూ రెడీ అయ్యారు. ఈ షోలోకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు, కామన్ మ్యాన్ కంటెస్టెంట్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ ఎప్పటిలానే కంటెస్టెంట్ల వివరాలు సీక్రెట్‌గా పెట్టడంలో తన మార్క్ చూపిస్తున్నారు. అయితే ఈ షోలోకి వెళ్తున్న కన్ఫార్మ్ కంటెస్టెంట్ల వివరాలు.. అలాగే ఈ షో ప్రారంభానికి సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9 పాల్గోనే 18 మంది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి కావడం.. వారికి సంబంధించిన అగ్రిమెంట్స్ వ్యవహారాలు కూడా కంప్లీట్ చేయడంతో దాదాపు 105 రోజులపాటు ఇంటిలో ఉండేదుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో కంటెస్టెంట్లందరినీ ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో వారిని క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడి నుంచే బిగ్‌బాస్ ఓపెనింగ్ వేడుకకు సంబంధించిన వేదికపైకి తీసుకెళ్తారు అని తెలిసింది.

బిగ్‌బాస్ తెలుగు 9 షోలోకి వచ్చే కంటెస్టెంట్లకు సంబంధించిన ప్రోమోలు, ఆడియో విజువల్ వీడియోలు కూడా సిద్దమయ్యాయి. కొంతమంది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, హోస్ట్ నాగార్జునతో చిట్‌చాట్‌కు సంబంధించిన షూట్స్ కూడా పూర్తయ్యాయి. ఈ షూట్స్‌కు సంబంధించిన లైవ్ ప్రదర్శనలు ఆదివారం సాయంత్రం అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 7 గంటలకు జియో హాట్‌స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతాయి అని ఇప్పటికే నాగార్జునతో విడుదల చేసిన ప్రోమోలో స్పష్టమైంది.
అయితే బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో అడుగుపెడుతున్నట్టు కన్ఫార్మ్ సెలబ్రిటీల లిస్టులో రీతు చౌదరి, తనూజ గౌడ, శ్రస్టి వర్మ, ఆశా షైనీ, డేబా జానీ, సంజన గల్రానీ, భరణి కుమార్, రమ్య అలేఖ్య చిట్టి ఉన్నారు. కామన్ మ్యాన్ కన్ఫార్మ్ లిస్టులో దమ్ము శ్రీజ, మాస్క్ మన్ హరిత హరీష్, మిలిటరీ పవన్, ప్రియా, మనీష్ మర్యాద ఉన్నట్టు తెలిసింది. ఇంకా కొంతమంది వివరాలను గోప్యంగా ఉంచి ఆడియెన్స్ సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
అయితే ఈ షోలోకి ఓ సీనియర్ హీరోను కూడా తీసుకు వస్తున్నట్టు.. ఇంకా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ యాక్టర్లు కూడా షోలోకి వస్తున్నారు అనేది తాజా సమాచారం. అయితే ఈ షోలోకి యాక్టర్ పృథ్వీ కూడా అడుగుపెడుతున్నట్టు ఓ ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకపోవడం వల్ల వస్తాడా? రాడా? అనేది తేల్చి చెప్పలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications











